కర్మ, గురు-శిష్యులు, మంత్ర దీక్ష

Questions & AnswersComments Off on కర్మ, గురు-శిష్యులు, మంత్ర దీక్ష

ప్రశ్న : ఒకరికి  పూర్వ జన్మలో  తను ఏమి తప్పు చేసాడో గుర్తులేక పోయినా, ఈ జన్మలో దాని ఫలితాన్ని అనుభవించవలసి వస్తే కర్మ యొక్క ఉపయోగం ఏమిటి? అలాంటి దాని వల్ల అతను ఎటువంటి గుణపాఠమును నేర్చుకోలేడు.

జవాబు : ఒక వేళ ఒక వ్యక్తి పూర్తిగా తప్ప తాగి  వాహనం నడుపుతున్నాడని అనుకుందాము. తన కారు అదుపు తప్పి దారిలో నడుస్తున్న ఒక పాదచారిని గుద్ది వేశాడు. ఆ సంఘటనలో తను కూడా  గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అతనికి స్పృహ వచ్చిన తర్వాత అతనికి ఏమి జరిగిందో కూడా గుర్తుండదు. నేను మిమ్మల్ని ఇక్కడ అడిగే ప్రశ్న ఏమిటి అంటే అతనిని తాగి వాహనం నడపటం మరియు ఒక ప్రాణానికి హాని కలిగించినందుకు శిక్షించాలా లేదా ? మీరు ఒక వేళ  అవును అని అంటే మీ ప్రశ్నకు సమాధానము దీనిలో ఉంది. మీరు ఒక వేళ  లేదు అని అంటే అలా అనటానికి కారణం నాకు తెలియచేయండి. అంటే దీనర్థము మర్చిపోవడం అనేది శిక్షను తప్పించుకోవడానికి ఒక మంచి సదుపాయం. తప్పు చేసినవాడిని  శిక్షించాలనే  దానికి అనేక కారణాలు ఉన్నాయి. సరిదిద్దుకోవడం అనేది వాటిలో ఒకటి కానీ కేవలం ఒకే ఒకటి కాదు. మీ ప్రశ్న శిక్ష అనేది సరిదిద్దుకొనుటకే అనే భావంతో అడిగినట్లు అనిపిస్తుంది. 

ఇంకోవిధముగా చెప్పాలంటే,  చాలామంది నేరస్థులు వారు చేసిన నేరలముకు శిక్షించబడ్డారు. వారు తమ శిక్షాకాలం తర్వాత దానిలోంచి ఏదైనా గుణపాఠం నేర్చుకున్నారా? అంటే నేరం చేయకూడదనే విషయం. మీరు దాని గూర్చి పరిశోధన చేయవచ్చు , కానీ నేననుకొనేది ఏమిటంటే చాలా మంది అటువంటి వారు మళ్ళా నేరాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు నేరంచేసిన విషయం గుర్తుండాలనే విషయం అర్థరహితం. ఒకవేళ అదే నిజమైనట్లయితే చాలామంది నేరగాళ్లు అలా ఉండేవారు ఎందుకంటే వారికి నేరానికి శిక్ష తప్పదనే విషయం తెలుసు గనుక. కానీ ఇక్కడ శిక్ష ఉంటుందని వారికి తెలిసినా అది వారికి ప్రతిబంధకం కాదు.

ఇక్కడ ఒకరికి కర్మ సూత్రముల గూర్చి  ఎంత అవగాహన, మరియు శాస్త్రీయ శ్రద్ధ అనేవి ఎంత మాత్రము ఉన్నాయి అనేవి పట్టించుకోవాల్సిన విషయాలు అంతేగానీ ఒకరికి పూర్వ జన్మలో చేసిన పాపాలు ఎంత గుర్తు ఉన్నాయన్న విషయం కాదు. ఒకరికి శ్రద్ధ అనేది లేకపోతే వారు తమ పనికిమాలిన పనులు చేస్తూనే ఉంటారు.

ప్రశ్న : నేను ఏళ్ల తరబడి భక్తుల వద్ద విన్న విషయం ఏమిటంటే గురువుకి తన శిష్యులతో ఉన్న బంధం ఎంత గట్టిదంటే గురువు తన శిష్యుడు ఈ ప్రాకృతిక జగత్తు నుండి ముక్తి పొందే వరకు ఈ జగత్తులో వారి కొరకు పుడుతూనే ఉంటాడు. నాకు దీని గూర్చి అర్థము అయ్యేలా చెప్పగలరా ?

జవాబు: ఇది వినటానికి బాగానే ఉన్నా అర్థరహితమైనది. ఎందుకంటే గురువుకు ఒక పెద్ద శిక్షలాగా అగుపిస్తుంది. ఒక వేళ అదే నిజమైనట్లయితే , గురువు శాశ్వతముగా ఈ ప్రాకృతిక జగత్తులోనే ఉండిపోతాడు. ఎందుకంటే గురువుకు ఉన్న శిష్యులలో ఒకరు తప్పకుండా ముక్తిని పొందకుండా ఉండే అవకాశంఉంది. అలాంటి వారిని ఉద్దరించడానికి గురువు పదే పదే జన్మిస్తూనే ఉండాలి. అలా పుట్టేటప్పుడు తను మరల గురువు అవుతాడు ,మరలా శిష్యులు అతని వద్దకు వస్తారు. మరలా వారిలో ఒక్కరైనా మోక్షము  పొందరు. మరలా వారికొరకు మీరు చెప్పిన చట్రం ఎప్పటికీ పునరావృతం అవుతునే ఉంటుంది.

భావభక్తి పొందిన ఎవరైనా మరలా జన్మ పొందే అవకాశం లేదు .దానికి ఆమె లేక అతడు గురువు కావాల్సిన అవసరం లేదు. ఇది శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీత 8.5-7 మరియు 12.6-7 లలో చాలా స్పష్టముగా చెప్పాడు. గురువు తన శిష్యుని ఉద్దరించేందుకు మరలా వస్తాడు అని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదు. కానీ భక్తిలో యోగ్యత పొందిన శిష్యుడు మరలా జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్పేందుకు చాలా ఆధారాలు న్నాయి.

కానీ మీరు గురువు శిష్యుడిని ఉద్దరించేందుకు వస్తాడనే వాక్యాన్ని ఇలా అర్ధం చేసుకోవాలి. కృష్ణుడే అందరికీ నిజమైన గురువు. ఆయన గురువు రూపంలో వస్తుంటాడు. ఒక శిష్యుడు తన జీవితములో మోక్షాన్ని పొందలేకపోతే అలాంటి వారికి మళ్ళా వచ్చే జీవితములో వేరొక గురువు దొరుకుతాడు. ఆ గురువు కూడా శ్రీకృష్ణుణి ప్రతిరూపమే. అలా ఆ విధముగా గురువు శిష్యుని ఉద్ధరణకు వస్తాడు.

ప్రశ్న : మంత్ర దీక్ష అనేది హరినామ దీక్ష తీసుకున్న గురువు దగ్గరే తీసుకోవాలా?

జవాబు : అవును.

 ప్రశ్న : ఒక భక్తుడు మంత్ర దీక్షను వేరే గురువు వద్ద తీసుకోవాలంటే హరినామ దీక్ష తీసుకున్న గురువు వద్ద అనుమతి తీసుకోవాలా?

జవాబు : అవును.

ప్రశ్న : ఒకవేళ ఒకరి హరినామ గురువు తన సమయాన్ని మనకు తగినంతగా ఇవ్వకపోయినా, రాగానుగ -శిక్షణను మనకు ఇవ్వకపోయినా, వేరే వారినుండి మంత్రదీక్షకు అనుమతి ఇవ్వకపోయినా మనం ఏమి చేయాలి?

జవాబు : మీరు చేయగలిగింది పెద్దగా ఏమియు లేదు. ఎందుకంటే ఆయనను మీరే గురువుగా అంగీకరించారు. ఆయన మిమ్మలను తన దగ్గర దీక్ష తీసుకోమని నిర్బందించ లేదు. అది కేవలం మీ ఎన్నికయే. మీరు ఆయనను గురువుగా స్వీకరించే ముందు వీటన్నింటి గూర్చి బేరీజు వేసుకొని చూడాల్సింది. అందుచేత ఆయనది తప్పుగా భావించకండి. జరిగిన తప్పుకు మీరే బాధ్యత వహించండి. సరైన దారి చూపేందుకు శ్రీకృష్ణునికి ప్రార్ధన చేయండి. నేను అంతమాత్రమే చెప్పగలను.

ప్రశ్న : హరినామ దీక్ష మరియు మంత్ర దీక్ష ఒకే గురువు వద్దనే  తీసుకోవాలనే దానికి ఏదైనా శాస్త్రప్రమాణం ఉందా?

జవాబు : ఇక్కడ నాకు తెల్సిన శాస్త్రప్రమాణం ఏదీ లేదు కనుక నేను సాంప్రదాయమును అనుసరించి సమాధానం ఇస్తాను. ప్రతి విషయం గూర్చి అక్షరాలా వ్రాయబడి ఉండదు. కొన్ని విషయాలు సాంప్రదాయమును బట్టి తెలుస్తుంటాయి. అందుకే “మహాజనో యేన గతః పన్థాః” అని – భక్తాగ్రేసరులు నడిచిన మార్గములో నడవండి అని అంటారు (మహాభారతం , వన పర్వము 313.117) మరియు సాధు -వర్తమానువర్తనం – సాధువుల మార్గాన్ని అనుసరించండి ( భక్తి రసామృత సింధువు , పూర్వ-విభాగము 1.2.100).

హరినామ దీక్ష మరియు మంత్ర దీక్ష గురువులు వేరు వేరుగా ఉన్న సందర్భాలు నాకు తెలియవు. అలా వారు ఎందుకు వేరు వేరుగా ఉండాల్సిన అవసరం ఏమిటో నాకు తెలియడం లేదు. హరినామ దీక్ష తీసుకున్న గురువు వద్దే మంత్ర దీక్ష ఎందుకు ఒకరు తీసుకోరాదు? ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులైన వైద్యుల వలే ఒక గురువు మంత్ర దీక్షలో నైపుణ్యం గలిగి ఉండటం అలానే వేరొక గురువు హరినామ దీక్షలో కలిగి ఉండటం అనేది ఉండదు.

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మన తల్లిదండ్రులతో పిల్లలుగా మనకున్న సంబంధము బట్టి, పెద్దయ్యాక ఇతరులతో మనం అలాంటి సంబంధాలు కలిగివుంటాము.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.