గురుపూర్ణిమ ప్రాముఖ్యత

GeneralComments Off on గురుపూర్ణిమ ప్రాముఖ్యత

          ప్రతి ఒక్కరూ పుట్టినపుడు అజ్ఞానముతోనే పుడతారు. ఆ అజ్ఞానాన్ని తొలగించి మనకు మార్గనిర్దేశం చేసే గురువు లేనట్లయితే మన జీవితం అంధకార మయమవుతుంది. ఏ శిశువుకైనా  తల్లి మొదటి గురువు.  శిశువు తన తల్లిని గమనించడం ద్వారా, ఆమె సూచనలను వినడం ద్వారా  విద్యను  అభ్యసిస్తాడు. తరువాత శిశువు పెద్దయ్యాక, గురువు రెండవ మాతృ స్వరూపమవుతాడు. మన శాస్త్రాలు ప్రతి మనిషి  రెండుసార్లు జన్మిస్తాడని చెప్తాయి, మొదటది  తండ్రి మరియు తల్లి యొక్క కలయిక  ద్వారా, మరియు రెండవది అర్హతగల గురువు అతన్ని తన శిష్యునిగా అంగీకరించినప్పుడు.  గురువు తన శిష్యుని ఒక తండ్రిలాగా  కార్య  నిర్వహణ చేస్తూ  వేదజ్ఞానం, దీక్షా మంత్ర  ఉపదేశన చేస్తాడు , అలానే  వారి ఆధ్యాత్మిక ఉన్నతికి  మాతృ మూర్తిలాగా చేయూతనిస్తాడు .

                  మన జీవితాల యొక్క అర్ధాన్ని, లక్షాన్ని మనకు తెలిపి, దానిని ఎలా సాధించాలో మనకు నేర్పేది  గురువే. మనము  గురువును అనుసరించడం ద్వారానే  మనుషులం అవుతాం. మనం గురువును ఆశ్రయించి దీక్ష  తీసుకొనక మునుపు, కేవలం  మన మనస్సు యొక్క ప్రేరణలపై ఆధారపడి మన కోరికలను తీర్చుకొని జీవితాన్ని గడిపే  సాధారణ వ్యక్తులము మాత్రమే. అందుకే, మన భారతీయ సంస్కృతిలో గురువుకు  అంత ప్రాముఖ్య  స్థానం  ఇవ్వబడింది . వేదాలు మనల్ని గురువును ఆశ్రయంచమని ఉపదేశిస్తాయి -తద్-విజ్ఞానార్ధం స గురుమ్ యేవఁభిగచ్చేత్, సమిత్- పాణిః శ్రోత్రిర్యం బ్రహ్మనిష్ఠమ్  (కథోపనిషద్  1.2.12), “సంపూర్ణ  సత్యాన్ని  తెలుసుకోవటానికి, తమ చేతిలో కానుకలతో  ఒక గురువును ఆశ్రయించాలి. ఆ గురువు తప్పనిసరిగా శాస్త్రీయ నిపుణుడై ఉండాలి, అలానే పరమ సత్యాన్ని తెలుసుకున్న వాడై ఉండాలి. ” పూర్వ కాలములో , ఒకరికి గురువు లేకపోతే, ఆ వ్యక్తిని సమాజ బహిష్కృతుడిగా పరిగణించేవారు  మరియు ప్రజలు అలాంటి వ్యక్తితో సామాజిక పరస్పర చర్యలకు కూడా దూరంగా ఉండేవారు.

                         నేటి ఆధునిక కాలములో, ఉపాధ్యాయులను ఒక స్నేహితుడిలాగా భావిస్తూ  ప్రవర్తిస్తూ ఉండటం చూస్తాము, అయితే  దానికి  భిన్నముగా మన సనాతన భారతదేశంలో, గురువును అతని విద్యార్థులు ఎంతో  గౌరవించేవారు. పాశ్చాత్య దేశాల్లో  ఎలా  తమ తల్లిదండ్రులను గౌరవించటానికి మదర్స్ డే మరియు ఫాదర్స్ డేను జరుపుకుంటారో, భారతదేశంలో గురుపూర్ణిమ రోజు ప్రత్యేకంగా గురు ఆరాధనకు అంకితం చేయబడింది. ఇది చంద్ర మాసం ఆషాడ  (జూలైఆగస్టు) పౌర్ణమి రోజున వస్తుంది. హిందువులు, బౌద్ధులు మరియు జైనులు రోజున తమ గురువులను గౌరవిస్తారునిండు పున్నమి, పౌర్ణమి, పరిపూర్ణత, ప్రశాంతత, శాంతి మరియు అందానికి చిహ్నంగురువు ఒకరిని సంపూర్ణంగా తీర్చి దిద్దుతాడు .           

          ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది  శ్రీ వ్యాసదేవుని యొక్క ఆవిర్భావ తిధి కూడా కాబట్టి. శ్రీ వ్యాసదేవుడు విష్ణుని  అవతారం మరియు వేద సాహిత్య ప్రచారకర్తగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. వాస్తవానికి, వేదం ఒకటే. కానీ శ్రీల వ్యాసదేవుడు మన సౌలభ్యము కొరకు  వేదాన్ని నాలుగుగా విభజించారు, ఇలా విభజనం చేయటము వలన వేదాలను మనం మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు. వేదాలు నాలుగు: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదము మరియు అధర్వణవేదం. పూర్వం , వేదాన్ని గాయత్రి మంత్ర దీక్ష  తీసుకున్న వారు మాత్రమే అధ్యయనం చేయవచ్చు అనే నిబంధన ఉండేదివేదాలలో ఉన్న జ్ఞానాన్ని మిగతా మానవాళికి ఇవ్వడానికి, శ్రీల వ్యాసదేవుడు పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని  రచించాడు. వేదాల యొక్క తాత్విక భాగమైన ఉపనిషత్తుల యొక్క అర్ధాన్ని సంశ్లేషణ చేయడానికి, ఆయన  క్లుప్తమైన  వేదాంతసూత్రాలను రచించారు. ఆయన సాహిత్యం మొత్తం అనన్య  సామాన్యమైనది.

          మహాభారతం సుమారు లక్ష శ్లోకాలను కలిగి ఉంది మరియు రెండు మిలియన్లకు పైగా పదాలను కలిగి ఉంది. ఇది లిలియాడ్  మరియు ఒడిస్సీ  కలిపిన  దాని కంటే  కూడా ఎనిమిది నుండి పది రెట్లు పెద్దది. అష్ఠాదశ పురాణాలు మహాభారతం కంటే నాలుగు రెట్లు పెద్దవి . మహాభారతంలో, వ్యాసుల వారు  పుస్తకంలో కనిపించేది మొత్తం సాహిత్యము యొక్క దర్పణమని, అందులో కనుగొనబడనివి ఎక్కడా ఉండవని  పేర్కొంటారు. ప్రకటనను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే  మహాభారత పరిధికి వెలుపల ధర్మ, అర్థ, కామ , మరియు మోక్ష  అనే నాలుగు మానవ చతుర్విధ ప్రయోజనాలకు  సంబంధించిన వేరే  జ్ఞానం లేనే లేదని స్పష్టమవుతుందిసంస్కృతంలో ఒక ప్రసిద్ధ సామెత ఉంది, వ్యాసోచ్చిష్టం  జగత్ సర్వంప్రపంచం మొత్తం వ్యాసదేవుని ప్రసాదమును తిని  జీవిస్తుంది. అందువల్ల, శ్రీ వ్యాసదేవుని ని గౌరవించటానికి, భారత ప్రజలు వ్యాసదేవుని ఆవిర్భావ తిధి రోజునశ్రీ వ్యాసదేవుని ప్రతిరూపమైన వారి గురువును కృతజ్ఞతాపూర్వకముగా భక్తితో ఆరాధిస్తారు.  

       మనకు ఇంకా  సందేహం కూడా రావచ్చుఇన్ని  పూర్ణిమలు  ఉండగా , పూర్ణిమను  ఎందుకు ప్రత్యేకంగా గురువుకు  అంకితం చేశారు“? .  ఒక సంవత్సరంలోని  వేరు వేరు రోజులలో  ఎంతోమంది  ఋషులు మరియు సాధువులు జ్ఞానోదయం పొందారు, రోజులలో  సూర్యుని చుట్టూ  తిరుగుతూ ఉన్న  భూమి కక్షా మార్గములో ఉన్న  భిన్న భిన్న బిందువులు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయికానీ ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏమిటంటే కేవలం బిందువుల ప్రభావం వల్ల రోజులలో వారికి  జ్ఞానోదయం కాలేదు; అవి వారికి  వారి సాధన దీక్షకు  దోహద పడ్డాయి మాత్రమే. ప్రత్యేకముగా గురుపూర్ణిమ రోజున చంద్రుడు మరియు గ్రహాల మధ్య ఒక నిర్దిష్ట కూటమి ఉంటుంది, ఇది గురు కృపను  పొందటానికి మనస్సులో ఒక గ్రహణశక్తిని కల్పిస్తుంది. మనోబుద్ధికి చంద్రుడు పాలకుడుకుగా ఉన్నాడు, అందువల్ల మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఆయన యొక్క  సహాయం ఎంతో  కీలకం.

                   కేవలం భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు బౌద్ధ మరియు జైన ప్రభావంతో ఉన్న ఇతర దేశాలలో కూడా గురుపూర్ణిమ  పండుగను జరుపుకుంటారు. రోజున, ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక సంస్కృతి మరియు సాంప్రదాయానికి చెందిన వ్యక్తులు వారి వారి గురువులను సందర్శిస్తారు, ఆరాధిస్తారు మరియు వారికి బహుమతులు అందిస్తారు . బృందావన్, బెనారస్, రిషికేశ్ వంటి పవిత్ర ప్రదేశాలలో, అధిక సంఖ్యలో భక్తులు తమ గురువులకు  చెందిన దేవాలయాలు మరియు అరామాలను సందర్శిస్తారు. చాలా మంది భక్తులు రోజున తమ గురువు పట్ల  గౌరవముతో ఉపవాసం పాటిస్తారు.

                 గురుపూర్ణిమ ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడి జీవితంలో చాలా ముఖ్యమైన పండుగ; గురువు భగవంతుడి ప్రకట  స్వరూపం కాబట్టి గురువును ఆరాధించడం భగవత్ ఆరాధనతో సమానమైనది. గురుపూర్ణిమ  సన్నాహాలు మరియు వేడుకల్లో పాల్గొనడం  సాధకులకు వారి గురువును సేవించడానికి మరియు ఆయనను సంతోషపెట్టడానికి  అవకాశాలను కల్పిస్తాయి విధంగా అవి వారి ఆధ్యాత్మిక పురోగతికి  తోడ్పడతాయి

            ఆధ్యాత్మిక  మార్గములో  ఉన్న  అన్వేషకుడడైనాగురువు దయ లేకుండా వారి ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణతను పొందలేరు. ఒక యువకుడు ప్రేమలో ఉన్న యువతి హృదయాన్ని  సంతోషపెట్టడానికి ఏమి చేయాలో  ఎలా నిరంతరం ఆలోచిస్తాడో  అలానే  మనం కూడా గురువుని ప్రసన్నం చేసుకోవడానికి  రాత్రనక , పగలనక  తీవ్ర కృషి చేయాలిదానివల్ల ఆయన మనలను తన సొంతంగా భావించి వారి  కృపా కటాక్షాలను మనకు ప్రసాదిస్తాడు.

      మానవలుగా  పుట్టటం అనేది చాలా అరుదు, అలానే  అది  జన్మలలో కెల్లా  విశిష్టమైనది.  ఎందుకంటే , పరమ సత్యాన్ని తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యం కేవలం మానవులకు  మాత్రమే ఉంది. కానీ ఇందుకోసం ఒకరు పూర్తి శక్తితో  ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలానే  ప్రయత్నం సరైన దిశలో జరగాలి. మనం  అజాగ్రత్తతో ఉంటేతప్పు దారిలో నడిచే ప్రమాదము,  అసలు గమ్యాన్ని చూడ లేక పోయే ప్రమాదము  పొంచి ఉంటుంది .

         ఉదాహరణకు, కొలంబస్ భారతదేశానికి రావాలని అనుకున్నాడు కాని ఆయన అమెరికాలో అడుగుపెట్టాడు. అది  అతనికి ప్రణాళిక లేని మార్గం. కేవలం యాదృచ్చికంగా ఆయన అమెరికా  ఖండంలో అడుగుపెట్టాడు. మనం చరిత్రలో ఎంతోమంది  నావికులు  అన్వేషణలకు  బయలుదేరి చివరకు యే మార్గాన్ని  చేరుకోలేక పోవటాన్ని చూస్తాముమనం ఒక  మార్గదర్శకత్వం లేకుండా ప్రణాళిక లేని మార్గంలో వెళితే, ఇదే  జరుగుతుందిఒకసారి కొలంబస్ అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుండి, యూరప్ నుండి అమెరికాకు ప్రయాణించడం ఎంతో సులభం అయింది. ఎందుకు? ఎందుకంటే  కొలంబస్ వేసిన మార్గం  వేరే అన్వేషకులకు దిక్సూచిలాగా ఉపయోగపడింది . అదేవిధంగా, ఆధ్యాత్మిక అన్వేషకుడు గురువు వద్దకు వెళ్లి  అయన  మార్గాన్ని అనుసరిస్తాడు. గురువు అప్పటికే తన గమ్యస్థానానికి చేరివుంటాడుఅందువల్ల శిష్యుడు గురువును అనుసరిస్తే గమ్యస్థానానికి చేరుకోవడం ఇంకా సులభతరుము అవుతోంది.

                          కానీ, చూడటానికి సులువుగా ఉన్న  గురువు యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించడమనే విషయము నేటి  ఆధునిక ఆధ్యాత్మిక అన్వేషకులకు అధిగమించలేని ఒక పెద్ద అడ్డంకి, ఎందుకంటే దీనికి శరణాగతి  అవసరం కనుక. శరణు పొందడం అంటే, గురువు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము, అలానే  తమ హృదయాన్ని గురువు హృదయంతో అనుసంధానము చేయడము. దీని వల్ల  మనము నిస్వార్థంగా గురువుకు సేవ చేయగలుగుతాము. సాధారణంగాఇలా చేయడానికి మనకు  అహంకారమనేది  అడ్డు పడుతుంది. అది  సాధకుడు గురు శరణు పొందకుండా  నిరోధించడానికి  వివిధ  రకాల మాయలు చేస్తుందిఅవి ఎలాంటివి అంటే  మనం  వినయపూర్వకమైన శరణాగత  శిష్యునిగా మన  గురువుకు సేవ చేస్తున్నామని  భ్రమించేటట్లు చేయడము వంటివి. నిజానికి  ఇక్కడ మనం  చేస్తున్నదల్లా ఏమిటంటే గురువునుండి  సేవను పొందటం మాత్రమే. అందువల్లమనం గురువును అత్యంత వినయంతో సంప్రదించాలి. గురువును ఇతర శిష్యులు గౌరవించడాన్ని చూడటం కూడా అహంకారభూతుడైన  శిష్యుడి హృదయంలో వినయాన్ని ప్రేరేపిస్తుంది. అందరూ ఒకరి గురువు సాన్నిధ్యములో జీవించలేరు. శిష్యులు తమ గురువు యొక్క సహవాసము  పొందటానికి మరియు ఇతర శిష్యులను కలవడానికి గురుపూర్ణిమ  గొప్ప అవకాశం ఇస్తుంది. ఒక పెద్ద ఆధ్యాత్మిక కుటుంబం యొక్క వాతావరణం  ఇక్కడ ఉంటుంది .

            అందువల్ల, గురుపూర్ణిమ  మానవ జాతికి అత్యంత ముఖ్యమైన రోజు. ఇది గతంలో భారతదేశంలోని అతి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా జరుపుగోబడేది. రోజుల్లో సంపద అనేది చాలా ముఖ్యమైన విషయంగా  ఉండేది  కాదు; బదులుగా, జ్ఞానానికి అత్యధిక విలువ ఉండేది. కారణం చేత, గురువును సమాజంలో ఒక అత్యున్నత వ్యక్తిగా పరిగణించేవారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థ చాలావరకు నిర్లక్ష్యం చేయబడిందిగత డెబ్బై ఏళ్ళలోప్రభుత్వం గురు పూర్ణిమ రోజుకు గల ప్రాముఖ్యతను గుర్తించకపోవడంతో  అది దాని ప్రాశస్తాన్ని కోల్పోయింది. ఇది జాతీయ సెలవుదినం కాదు. చాలా మంది నేటితరంలోని  భారతీయులకు గురుపూర్ణిమ తేదీ కూడా తెలియదు. ఒక గురువును  ఆశ్రయం పొందిన వారికి మాత్రమే రోజు యొక్క ప్రాముఖ్యత నిజంగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అలానే  దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోడానికి అవకాశం ఉంది.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  ఇద్దరు మనషులు ఒకే విధంగా ఆలోచించలేరు. అవతలి వ్యక్తి మీ మనస్సును నూరుశాతం తెలుసుకోలేరు మరియు మీ కోరిక ప్రకారం నూరుశాతం ఎప్పడూ పనిచేయలేరు. అవతలి వ్యక్తికి వారి స్వంత కోరికలు, ఆశలు మరియు పరిమితులు ఉన్నాయి.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.