చెడు కర్మల వల్ల వచ్చే దుఃఖాలను తప్పించుకొనుట ఎలా?

Articles by Satyanarayana DasaComments Off on చెడు కర్మల వల్ల వచ్చే దుఃఖాలను తప్పించుకొనుట ఎలా?

          ప్రతి మనిషీ మూడు రకాలైన దుఃఖాలను తన జీవితములో ఎదుర్కొంటాడు: అవి ఆధ్యాత్మిక, ధిభౌతిక, ఆదిదైవిక దుఃఖాలు. ఆధ్యాత్మికమంటే ఆత్మతో సంబంధించినది అని అర్ధం. ఆత్మ అనే పదానికి సంస్కృతములో దేహము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఉనికి, ప్రకృతి, దైవము, జీవము, ధైర్యము, స్వభావము, స్వంతము, తెలివి, అనేవి కొన్ని పర్యాయ పదాలు. కానీ ,ఆధ్యాత్మిక దుఃఖాలకు సంబంధించి ఆత్మ అంటే దేహం, మనస్సు, బుద్ధి అనే అర్ధం. అంటే దానర్ధం ఆధ్యాత్మిక దుఃఖాలు దేహం, మనస్సు, బుద్ధి వల్ల వచ్చేవి. అలానే ధిభౌతిక దుఃఖాలు అంటే వేరే భూతముల ( ప్రాణులు ) వల్ల వచ్చేవి. ఈ ప్రాణులు మనుష్యులు, జంతువులు, పక్షులు, సరీసృపాలు, లేదా జలచరాలు కావచ్చు . ఆదిదైవిక దుఃఖములు అంటే దేవతల వల్ల వచ్చేవి. ఇక్కడ దేవతలంటే మన విశ్వములోని కార్య కలాపాలను చక్కపెడుతూ వాటికి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు. ఆదిదైవిక దుఃఖములు ప్రకృతి విలయాలైన భూకంపాలు , సునామీలు, వరదలు, కరువు, తుఫానులు, శీతోష్ణ పరిస్థితులు, మంటలు, మహమ్మరిలుగా వస్తుంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు. అది ఏంటంటే దేవతలు మనకు కష్టాలు ఎందుకు కలుగచేస్తారు?   దేవతలు స్వతహాగా కరుణా ప్రపూర్ణులు మరియు సహృదమైన వారు. వారు ఎందుకు మనల్ని కష్ట పెడతారు? మనకు కష్టాల్ని ఇవ్వటం వల్ల వారికి ఒరిగేది ఏమిటిది ?

                     ఈ ప్రశ్నలకు సమాధానం అర్ధం చేసుకోవాలంటే మనం ముందుగా విశ్వము ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. ఆధునిక విజ్ఞానం విశ్వము పెద్ద విస్ఫోటనం వల్ల ఉద్భవించింది అని చెప్తుంది. ఈ విజ్ఞాన శాస్త్రం విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడనే దాన్ని నమ్మదు. అంటే విశ్వానికి ఏ ఆంతర్య ప్రయోజనం లేదని అర్ధం.  విశ్వం పుట్టుక కేవలం యాదృచ్ఛికం, దాని నియంత్రణకు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే మన జీవితానికి ఏ ప్రయోజనం లేదు అని అర్థం. ఇది మనము ఒప్పుకుంటే జీవితంలో ఏ నియమాలు పాటించక్కరలేదు. అలానే జీవితంలో సాదించాల్సినది కూడా ఏమీ లేదు ఎందుకంటే అది వ్యర్ధము కనుక. అందుకే  నేటి ఆధునిక  భావమైన “నువ్వు ఒకే సారి జీవిస్తావు” అనేది బాగా ప్రాచుర్యమైనది. అందుకే జనులు యెంత కావాలంటే అంత కామం, మద్యం, వ్యసనాలు, ధనం అనుభవించాలని  ఉవ్విళ్ళు ఊరుతున్నారు. జీవితములో అనుభవించటం కన్నా వేరే ప్రయోజనం లేదు కనుక.  కొందరు దానిలో తప్పేంటని అనవచ్చు. దానికి సమాధానం ఏంటంటే అటువంటి ప్రవుత్తి మానవ సమాజములో విలువల పతనానికి దారితీస్తుంది. అటువంటి భావాలకు మన జీవితములో ప్రేరేపితమైతే , మన జీవితాల్లో నీతి, నియమాలకు ఆస్కారం లేకుండా పోతుంది.

                           కానీ భారతీయ శిక్షాస్మృతులు మనకు విశ్వము ఈశ్వరుడు, భగవంతునిచే సృష్టించబడినది, అలానే విశ్వము సజావుగా నడవటానికి ఆయన కొన్ని నియమాలను ఏర్పరచాడని స్పష్టీకరణ చేస్తాయి. ఈ విశ్వము యొక్క పరిపాలనా భాధ్యతను నిర్వహించే వారిని దేవతలు అంటారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికీ ఒక కార్య నిర్వాహణ వ్యవస్థ ఉన్నట్లే, విశ్వానికి కూడా కార్య నిర్వాహణ వ్యవస్థ ఉన్నది. ఈ విశ్వంలో అత్యంత ప్రముఖమైన నియమము కర్మ అనేది. ఈ విశ్వములో ఉన్నవన్నీ ఈ కర్మ నియమానికి లోబడి ఉన్నాయి. మనం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఉన్నట్లే , ఈ కర్మ నియమానికి లోబడి ఉంటాము. ఎలా అయితే మనం గురుత్వాకర్షణ శక్తిని చూడలేమో అలానే కర్మను కూడా చూడలేము. మనం నమ్మినా, నమ్మకపోయినా గురుత్వాకర్షణ శక్తి దాని ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది. అలానే మనం కర్మను నమ్మినా, నమ్మకపోయినా కర్మ దాని ప్రభావం మన మీద చూపిస్తుంది.

                 మనం చేసే ప్రతి పని ఒక ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో అర్ధం చేసుకోలేనిది ఏమిలేదు. కొన్ని  ఫలాలు తొందరగా రావచ్చు మరికొన్ని కూసింత సమయం తర్వాత రావచ్చు. మనం కాలే మంటలో చెయ్యి పెడితే దాని ఫలితం తొందరగా అగుపిస్తుంది. మద్యం సేవిస్తే దాని ఫలితం కొంత సమయం తర్వాత కనిపిస్తుంది. ఒక్కోసారి ఫలితం రావటానికి నెలల కొద్దిసమయం పట్టవచ్చు కూడా. ఒక శిశువు జన్మించడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. కొన్ని పనులు జన్మల కొద్దీ సమయం తీసుకొనేవి కూడా ఉంటాయికర్మ అనేది ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం ఉద్భవించడానికి ప్రకృతిలో కొన్ని ప్రత్యేకమైన  సదుపాయాలు ఉండాలి. దానికి అవసరమైన తేమవేడి, గాలి  తగినైన పాళ్ళలో ఉంటేనే అది వృద్ధి చెందుతుంది. రకరకాల విత్తనాలు ఋతువులను అనుసరించి వాటి ఫలాలను ఇస్తాయిఅలానే కర్మ కూడా దాని ఫలితాన్ని  ఇవ్వడానికి ఒక సందర్భం కావాలి. ఒక సందర్భం జన్మలో దొరకక పోతే, అది వేరే జన్మలో దాని ఫలితాన్ని ఇస్తుంది.

                             ఇక్కడ మనము గుర్తించాల్సిన విషయము ఏమిటంటే వ్యక్తిగత కర్మలు ఉన్నట్టే, సామూహిక కర్మలు కూడా ఉంటాయి. ఒక కుటుంబానికి, గ్రామానికి, లేక దేశానికి సంబంధించిన ప్రజలు వారందిరికీ సంబంధించిన సామూహిక కర్మలను కలిగి ఉంటారు. అందువల్ల , ఒక్కోసారి చెడ్డవైనా లేక మంచివైనా పరిస్థితులు మొత్తము కుటుంబం, గ్రామం, లేదా దేశం ఎదుర్కొనాల్సి వస్తుంది. మహమ్మారీలు సామూహిక కర్మలకు ఒక ఉదాహరణ.

                         ఆయుర్వేదం ప్రకారం మనము ప్రస్తుత జన్మలో చేసిన తప్పుల వల్ల లేదా పూర్వ కర్మల వల్ల రోగగ్రస్తులం అవుతాము. పూర్వ కర్మల వచ్చే రోగాలు సాధారణ చికిత్సల వల్ల నయం అవ్వవు, దాన్ని యుక్తివ్యపాశ్రయము  అంటారు. వాటిని దైవవ్యపాశ్రయముల చేత చికిత్స చేయాలిసంస్కృతములో  యాదృశో యక్ష తాదృశో లిః అనే  నానుడి ఉంది. అంటే  సమస్యను బట్టి దాని నివారణ ప్రక్రియ ఉండాలని దాని అర్థం. ఒక సమస్య పూర్వ కర్మలదానికి మరొక పేరు దైవ) వల్ల వస్తుంటే  దాని నివారణోపాయము కూడా దైవికముగా ఉండాలి. దైవిక నివారణోపాయాలు అంటే యజ్ఞ కార్యములు చేయటము, కొన్ని ప్రత్యేక మంత్రోచ్ఛారణ , దానాలు చేయటం, ఉపవాసాలు ఉండటం వంటివి.

           ఐతే  రోగానికి నివారణోపాయముగా దైవిక కార్యము చేయాలి అనేది మనము శాస్త్రము నుండి తెలుసుకోవాలి. అలానే ఉబ్బస వ్యాధి నివారణకు మనము కేవలం ఏదోఒక ఆయుర్వేద గుళికలను తీసుకోలేము. ఒక్కో  వ్యాధికి ఒక్కో  ప్రత్యేక ఆయుర్వేద మాత్ర ఉంటుంది. నేటి కాలములో, దైవిక నివారణోపాయముల పైన ప్రజలకు అంత నమ్మకం లేదు కానీ దానర్థం అవి పనికి రానివి అని కాదు. మనకు దైవిక నివారణయోపాయముల మీద నమ్మకం లేనట్లయితే వాటిని మనం చేయం, అందువల్ల వాటినుంచి వచ్చే ఉపయోగాలను పొందలేము. అయితే మి చెయ్యాలనే దాని మీద మనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. జనం కొత్త విషయాలు చేయటం మీద ఆసక్తి చూపిస్తారు, విధముగా చూస్తే ఇది ప్రయత్నించదగ్గ గొప్ప ప్రయోగం. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం, ఈశ్వరుడు అనే అతీంద్రియ శక్తిని నమ్మే వ్యక్తులు కేవలం ఆధునిక ఔషధములు తీసుకుంటున్న మిగతా వారికన్నా  త్వరగా కోలుకొంటున్నారు. దాని వల్ల మనకు తెలిసేది ఏంటంటే నమ్మకం అనేది కూడా రోగ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నమ్మకంతో పాటు దైవిక నివారణోపాయములను వాడినట్లయితే అవి తప్పక ప్రభావం చూపిస్తాయి. మన భారత దేశములో వేల కొలది సంవత్సరాలుగా వీటిని విజయవంతముగా  మన వాళ్ళు వాడుతున్నారు. అందుచేత మనకు వేదిక సంసృతి ప్రసాదించిన ఇటువంటి అమూల్యమైన విషయాలను మనము నిర్లక్ష్యం చేయకూడదు.

                             ఆదిదైవిక తాపాలకు నివారణోపాయం ప్రత్యేక మంత్రోచ్ఛారణ. కానీ సమస్యలను  మూలాల నుండి పెకలించాలంటే, మనం ప్రకృతితో సామరస్యముగా  జీవించాలి, అలానే ముందు చెడు కర్మలను చెయ్యటం ఆపాలి. ముందు క్షణికానందం ఇచ్చి చివరకు దుఃఖం చేకూర్చే పనులు చేయడం మానాలి. ఇదే అసలు సిసలు జ్ఞానాచరణము.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  చాలామంది భౌతిక విషయాలలో చాలా చాకచక్యంగా ఉంటారు కానీ ఆధ్యాత్మికవిషయాలలో మందకొడిగా ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక విషయాలలో చాకచక్యంగా ఉండి భౌతికవిషయాలలో మందకొడిగా ఉంటారు. రెండు విషయాలలో నేర్పుగా ఉండడం కోరదగినది, కానీ ఒకవేళ రెండింటిలో ఏదోఒకదాన్ని ఎంచుకోవలసివస్తే రెండవది ఉత్తమము.

  — ,Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.