జీవిత శ్రేయస్సు సాధించుట ఎలా?

Articles by Satyanarayana DasaComments Off on జీవిత శ్రేయస్సు సాధించుట ఎలా?

                   ఈ ప్రపంచమనేది ఆధ్యాత్మిక, భౌతిక శక్తుల మిళితం. మనం మన చుట్టూ చూసేది, అనుభవించేది  ఏదైనా రెండు శక్తుల మిశ్రమమే. శక్తులనేవి అనేక రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. జీవితమనేది ఆధ్యాత్మిక శక్తి భౌతిక పదార్థాలలో వ్యక్తమవ్వడముచలనం లేని రాయి వంటి వస్తువులలో భౌతిక శక్తి ప్రముఖంగాఆధ్యాత్మిక శక్తి అవ్యక్తంగా ఉంటాయి. అందువల్లే మనం రాళ్ళలో జీవం లేదు అంటాము. మొక్కలలో ఆధ్యాత్మిక శక్తి రాళ్ళలో కన్నా ఇంకొంచెము ప్రస్ఫుటమై జీవ లక్షణాలను చూపిస్తుంది. మొక్కలలో కన్నా జంతువులలో, పైన మానవులలో ఆధ్యాత్మిక శక్తీ ప్రస్ఫుటంగా కనపడుతుంది.  

        జీవిత పరిణామం వివేకమనేది యే తరహాలో జీవ శరీరాలలో వ్యక్తమైనది అనే దాని మీద ఆధార పడి ఉంటుంది. మానవులు వారి చైతన్యము వల్ల మిగతా జీవరాశులన్నింటికన్నా గొప్పగా గుర్తించబడ్డారు. వారికి తమ శక్తి యుక్తులపై, భావాలపై, అనుభూతులపై పూర్తి అవగాహన ఉంది. అలాంటిది జంతువులలో ఉండదు. మానవులు తమను తాము అర్థం చేసుకోగలరు అలానే విశ్వములో వారి స్థానముపై అవగాహనతో ఉండగలరు.    

              శరీరమనేది భౌతిక దేహము మరియు మనస్సు అనే రెండు స్థాయిలలో ప్రకటితమవుతుంది. చైతన్యమనేది ఆధ్యాత్మిక శక్తి లక్షణము. అది మనస్సు, భౌతిక దేహాల ద్వారా ప్రకటితమవుతోంది. జీవమనేది  ఆధ్యాత్మికభౌతిక దేహం, మనస్సు యొక్క మిశ్రమం కావటం చేత మన జీవిత బాగోగులు మూడింటి బాగోగులపై ఆధారపడి ఉంటాయి. మూడు కనుక స్థిరముగా ఉండి చక్కగా పని చేస్తుంటే మన జీవితం సుఖశాంతులతో ఆనందముగా ఉంటుంది.

క్రమశిక్షణగల జీవితం 

        శరీరము, మనస్సు, చైతన్యము మూడూ వాటి అవసరాలు కలిగి ఉన్నాయి. ఒక క్రమ పద్దతిలో వాటిని సంతుష్టపరచాల్సిన అవసరం ఉంది. శ్రీ కృష్ణుడు గీతోపనిషత్తులో దానికై ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడుఎవరైతే ఆహార, వ్యవహార, నిద్ర, జాగృత స్థితులయందు క్రమశిక్షణతో ఉండి తమ కార్య కలాపాలను ఎల్లప్పుడూ హద్దులలో ఉంచుకొంటారో వారు బాధలకు దూరముగా ఉంటారు“. సమస్యలనేవి పైన చెప్పిన కార్యకలాపాలలో అనుచితముగా ప్రవర్తించడం వల్ల వస్తాయి.    

      దీనికి కారణం జీవన సూత్రాలపైనా మనకు అవగాహన లేకపోవటమే. మనం చేసే పనులు మనయొక్క జ్ఞానంపైన ఆధారపడి ఉంటాయి. అందువల్ల మనకు క్రమబద్ధమైన ఆహార, నిద్ర, వినోదం మీద, అలానే మనము వేకువగా ఉన్నపుడు చేసే పనులు ఎలా సమతుల్యంతో చేయాలి అనేదానిపైన పూర్తి విజ్ఞానం ఎంతైనా ఆవశ్యకం.  

        మనము దేహం, మనస్సు, ఆత్మల సమ్మేళనం. మనము వాటి గుణగణాలు, పనులు, అవసరాల గూర్చి తెలుసుకోవడం ముఖ్యం. మనము ఒక కొత్త కారు కొన్నప్పుడు దాన్ని రహదారిపై తీసుకువెళ్లే ముందు దాన్ని నడపటం ఎలానో నేర్చుకొంటాము. మనం కారుతో వచ్చే నియమసంపుటిని క్షుణ్ణంగా చదువుతాము. దాని ద్వారా కారు గురించిన   సాధారణ సంకేతాలు అలానే అది పనిచేసే విధివిధానాల గూర్చి తెలుసుకొంటాము.  

      అదే మన ఆత్మకు కారువంటి శరీరం గూర్చి ఎటువంటి శోధన చేయము. వేదశాస్త్రాలు మన జీవనము బాగు పరచడానికి చదవవలసిన నియమ సంపుటిలాంటివి. అందుకే సనాతన భారతీయ విద్యా విధానములో విద్యార్థులు వేరే విషయాలు చదివే మునుపు వేదాలను అభ్యసించేవారుమనము వేరేవిషయాల గూర్చి తెలుసుకొనేముందు మన గూర్చి (స్వీయ) మనము తెలుసుకోవాలి.  

      అయితే నేటి ఆధునిక విద్యా విధానములో సరిగ్గా దీనికి విరుద్ధమైనది జరుగుతోంది. ఇక్కడ మనంస్వీయకన్నా వేరే విషయాల గూర్చి మనం నేర్చుకుంటుంటాము. దేహం గూర్చి ఎంతో కొంత నేర్చుకొంటునప్పటికీ, మనస్సు, ఆత్మ గూర్చి నేర్చుకొంటున్నది దాదాపు శూన్యం. భారతీయ విజ్ఞాన పరిధిలో, దేహం, మనస్సు, ఆత్మ  గూర్చి  పరిచయం చేయడానికి ఆయుర్వేదం, ఇంకా శ్రద్దతో క్షుణ్ణంగా తెలియచేయడానికి సాంఖ్య, యోగ, పూర్తి పరిపక్వత నివ్వడానికి వేదాంతములు అమర్చబడ్డాయి. మూడు శాఖల ద్వారా దేహం, మనస్సు, ఆత్మ అనే విషయాల గురించిన పూర్తి జ్ఞానం ప్రతి ఒక్కరికీ ఇవ్వబడిందిఅలానే శాఖలు ఎవరైతే వాటి గూర్చి ప్రత్యేకముగా తెలుస్కోవాలనుకొంటున్నారో వారికి కావాలసిన విషయాలను కూడా అదనముగా కలిగిఉన్నాయిఅందువల్ల మన జీవన పరిపూర్ణ సమగ్రతకు మూడు అంశాల గూర్చిన జ్ఞానము మనందరికీ ఎంతైనా అవసరం

        మన దేహం మనము తీసుకొనే ఆహారమునుండి శక్తిని పొందుతుంది, అలానే మనస్సు మన యొక్క ప్రేమ పూర్వక సంభంధాల నుండి శక్తిని పొందుతుందిఆత్మ పరమాత్మతో( భగవంతునితో ) మనము ఏర్పరచుకొనే సంబంధం మీద ఆధార పడి పరిపూర్ణతను సాధిస్తుంది. అయితే ఇవి కాకుండా మన జీవితాన్ని  మెరుగుపరచే వేరే ఒక అంశం కూడా ఉంది

  పరిసరాల ప్రభావం

       మన శరీరం ఒక పూర్తి వ్యవస్థ వంటిది, దీనిలో ఉన్నవన్నీ ఒకటి వేరొకదానికి పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అందువల్ల, అన్నీ అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. మన శరీరంలోని కణాలు ఒకదానితో ఒకటి కలసి ఉంటాయి. వార్తాహరునిగా పనిచేసే కణాలు శరీరంలో అత్యంత వేగంగా పనిచేస్తూ చిన్న చిన్న అవసరాలకు సయితం మన శరీరాన్ని సిద్ధముగా ఉంచుతాయి. మన శరీరంలోని కణాలు ఎలా మన దేహం లోని భాగాలో అలానే మన దేహం కూడా విశ్వంలో ఒక విడదీయలేని భాగము.  

          మన పరిసరాలను మనం ప్రభావితం చేస్తాము అలానే వాటివల్ల మనం కూడా ప్రభావితం అవుతాము. మన శరీరానికీ మన చుట్టూ ఉన్న పరిసరాలకీ మధ్య ఒక నిరంతర శక్తి ప్రవాహము ఉంటుంది. మనం అందరం ఒక సముద్రపు ఒడ్డున లేదా ఆహ్లాదమైన ప్రకృతిలో ఉన్నప్పుడో చాలా సేదతీరుతాము. దీనివల్ల మన మీద పరిసరాల ప్రభావం తప్పక ఉంటుందని మనకు అర్ధమవుతుందిఇది ఎలా ఉంటుందంటే ఒక వాహనం చక్కగా పనిచేయాలంటే కేవలం దాని బాగోగులే కాదు, అది వెళ్లే మార్గం, మార్గాన రవాణా స్థితిగతులు ఎలా ఉంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వేదాంతం మనకు కేవలం మన గూర్చే కాకుండా, విశ్వంలో మన పాత్ర ఏమిటి, మనం ఎలా సమగ్రతతో సమతుల్యమైన, ఆనందమైన జీవనాన్ని గడపాలో తెలుపుతుంది.   

            ఒక పూర్తి ఆరోగ్యకరమైన జీవనానికి, మనకు దాని గూర్చి క్షుణ్ణంగా తెలిసి ఉండాలికానీ కేవలం తెల్సివుండటం సరిపోదు, ఒకరు దాన్ని తమ జీవితములో శ్రద్ధగా అవలంబించాలి. అప్పుడే వారు సరైన గమ్యాన్ని చేరుకొనగలరు.

      ఈనాడు మన జీవితం కేవలం ఉనికిని కాపాడుకొనే ప్రయత్నాల వల్ల బాగా ఒత్తిడి పాలయింది. అందువల్ల ప్రజలు చాలా సామాన్యమైన ఆరోగ్య సూత్రాలను కూడా మర్చిపోతున్నారు. వాళ్ళు తరచుగా మా దగ్గర వ్యవధి లేదని ఆక్షేపిస్తూ ఉంటారు. మనం మన వాహనాన్ని సరిగా ఉంచలేకపోతే అది ఏదోఒక రోజు ఆగిపోవడమో లేక ప్రమాదానికి గురవ్వడమో తధ్యము. అలానే, మన జీవితానికి సంబంధించిన మూడు విషయాల అవసరాలు సరిగ్గా నెరవేర్చక పోతే మనం విఫలం అవ్వటం కూడా తథ్యం. మనం చివరకు మన సమయాన్ని, ధనాన్ని అసౌకర్యాలకు గురి అవ్వడం పైన వృధా చేయవలసి ఉంటుంది.

కర్తవ్య ప్రణాళిక 

        ప్రపంచంలో అన్ని చోట్లా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆరోగ్యంపై ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తున్నాయి, కానీ ఇంత చేసినా అందరికీ సరైన ఆరోగ్య సదుపాయాలను కల్పించలేకపోతున్నాయి. కానీ వారందరికీ ఆయుర్వేదం, యోగ, వేదాంత సూత్రాల మీద ఆధారమైన అంతర్, బాహ్య శక్తులను ఎలా సమతుల్యముగా ఉంచుకోవాలో శిక్షణ ఇస్తే ఆరోగ్యంపై ఖర్చు చేసే కోట్లాది ధనం మిగులుతుంది. ఇది మన విద్యావిధానాలలో వేదజ్ఞానాన్ని పరిచయం చేయటం ద్వారా, సామజిక మాధ్యమాలలో వాటి గురించి ప్రచారం చేయటం ద్వారా, వేద జ్ఞాన కేంద్రాలను ప్రారంభించటం ద్వారా చేయవచ్చు విధముగా జ్ఞానాన్ని సర్వ మానవాళి సంక్షేమానికి ఉచితముగా అందుబాటులోకి తేవాలి.   

 

           

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  తప్పుచేయడం మానవసహజం. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం దివ్యత్వం.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.