జీవులతో కృష్ణునికి గల సంబంధం

Questions & AnswersComments Off on జీవులతో కృష్ణునికి గల సంబంధం

 

ప్రశ్న : నేను శ్రీ జీవ గోస్వాముల వారు వ్రాసిన సందర్భములలో శ్రీకృష్ణుడు జీవుల కర్మ క్రియలలో ప్రత్యక్షంగా పాలు పంచుకోడని అది నిజానికి ఆయన అంశమైన పరమాత్మ ద్వారా జరుగుతుందని చదివినట్లు గుర్తు. అది నిజమేనా? అయినట్లయితే దాని గూర్చి సమాచారమును ఇవ్వగలరు.

ఒక వేళ అది సిద్ధాంతమైతే, మనం కృష్ణుని ప్రార్థిస్తే, మన ప్రార్థనలను స్వయముగా కృష్ణుడే వింటాడా లేక పరమాత్మా?

జవాబు:  జీవులు రెండు రకాలు: భక్తులు, భక్తులు కానివారు. భక్తులు కాని వారు పరమాత్ముని పరిధిలో ఉంటారు ఎందుకంటే పరమాత్మ తటస్థ శక్తికి అధ్యక్షుడు. ఒకరు భక్తి మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు (లేక వారి వారి ఇష్ట దైవం) స్వయముగా  పరమాత్ముని భాధ్యతను తీసుకొంటాడు, ఎందుకంటే భక్తి అనేది అంతరంగ శక్తి మరియు దాని నిర్వాహణ అధికారి శ్రీకృష్ణుడే. అందుకే భక్తులు కర్మ ఫలం నుండి ముక్తులు అని అంటారు. కర్మ అనేది పరమాత్ముని పరిధిలో ఉండేది. భక్తులు  చూడటానికి  బాధ లేక సుఖమును ఇతరులు పొందినట్లే పొందుతున్నప్పటికీ అది కర్మ వల్ల వచ్చేది కాదు అది కృష్ణుడు తన భక్తులు భక్తిలో పరిపక్వతను పోందేందుకు చేసే సదుపాయము మాత్రమే.

కానీ ఆయన అది కర్మ వలే అగుపించేటట్లు చేస్తాడు, అలా చేయడం భక్తిని  అసాధారణమైనదిగా చూపించాలని కాదు, అర్హత లేని వారు భక్తి  మార్గములోనికి ప్రవేశం లేకుండా చెయ్యడం కోసం. ఇది మీరు ప్రార్థన గూర్చి అడిగిన ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినదని నేను భావిస్తున్నాను. దీనికి మూలం పరమాత్మ సందర్భము  మొదటలో ఉంది

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  సత్త్వము, రజస్సు మరియు తమస్సు ఒకదానికొకటి పోటీ అయినాకూడా అవి కలిసి ఉండి కలిసి పనిచేస్తాయి. సహకారభావంతో ఎలా ఉండాలో మనకు చెప్పే ఒక మంచి ఉదాహరణ.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.