దాతృత్వమనేది మన ఇంటి నుండి ప్రారంభమవ్వాలి

Articles by Satyanarayana DasaComments Off on దాతృత్వమనేది మన ఇంటి నుండి ప్రారంభమవ్వాలి

        బృందావనంలో నేను గమనించిన ఒక విచిత్ర విషయం ఏమిటంటే, చాలా మంది సాధువులు ప్రపంచాన్ని మార్చడం గురించి మాట్లాడుతారు. “ప్రపంచ శాంతి”, “అంతర్జాతీయ”, “సార్వత్రిక ప్రేమ” వంటి పదాలను కలిగి ఉన్న ట్రస్టులు, సమాజాలు మరియు సంస్థలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని రకాల  సంస్థలు మరియు వ్యక్తులు ఉన్నప్పటికీ,  ప్రపంచ శాంతి లేదా  ప్రపంచ సౌభ్రాతృత్వము కానీ  అభివృద్ధి చెందడం లేదు. దీనికి ఒక కారణం తప్పకుండా ఉండాలి.

     నేను ప్రధాన స్రవంతి సమాజానికి చెందిన చాలా మందిని కూడా కలుస్తూ ఉంటాను.  నాకు వారందరిలో గోచరించిన ఒక  సాధారణ దృగ్విషయం ఏమిటంటే, వారి సమస్యలకు వేరొకరిని నిందించడం. యజమాని లేదా జీవిత భాగస్వామి లేదా అత్తగారు వారి జీవితాన్ని దుర్భరంగా మారుస్తున్నాని వారి అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, అది మిక్కిలి చేటైన పార్టీగా భావిస్తారు. వారి ప్రకారం దేవుడు, ఒక శాడిస్ట్ లేదా చాలా ఉదాసీనంగా ఉండేవాడు; లేకపోతే  ఈ లోకంలో ఇంత బాధ ఎందుకు ఉంటుంది?

రెండు రకాలుగా ప్రజలు భిన్నంగా కనిపిస్తారు: ఒకరకం ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మరొకటి దాని గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తూ ఉంటుంది.  కానీ వాస్తవానికి వారిరువురికీ  ఉమ్మడిగా ఉండేవి చాలా ఉన్నాయని  నేను భావిస్తున్నాను. రెండు గ్రూపులూ ప్రపంచం భిన్నంగా ఉండాలని కోరుకుంటాయి, కానీ వారెవరూ  తమను తాము మార్చుకోవడం గురించి పెద్దగా ఆలోచించరు .ఇది రాజస  మరియు తామసిక గుణాల యొక్క ప్రభావం చేత .

రజో   గుణం  యొక్క ప్రభావాలు

     రజో గుణం ఇతరులపై అహంకారం మరియు ఆధిపత్యాలని ప్రదర్శించడానికి  మనలను ప్రేరేపిస్తుంది. ఇది అధిక విశ్వాసాన్ని ఇస్తుంది, మనం సాధించడానికి అర్హత లేని విషయాల కోసం కృషి చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది జనసాముహ్యంలో  అత్యంత సమర్థుడైన మరియు శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకునేటట్లు చేస్తుంది. రాజసిక ప్రవృత్తి  ఎప్పుడూ శాంతిని ఇవ్వదు , ఇది ఎల్లప్పుడూ ఆశయాన్ని రేకెత్తిస్తుంది. క్రొత్త సముపార్జన కోసం ఆకలిని ఇవ్వడం మరియు మనకు ఇప్పటికే ఉన్నదానిని మెరుగు పరచుకొనేందుకు కారణమవుతుంది.

   అధికారంలో ఉన్నవారు మరియు పేరు ప్రతిష్టలు  ఉన్నవారు సాధారణంగా రజో గుణం యొక్క ప్రాబల్యాన్ని కలిగి ఉంటారు, లేకుంటే వారికి “పైకి రావడానికి” అవసరమైన యుక్తులు మరియు పన్నాగాలు పన్నడానికి కావలసిన కుశలతలు  ఉండవు.

    సత్వ-గుణము ఎంతో ప్రాధాన్యత కల్గిన ఆధ్యాత్మిక సమాజంలో ఉన్న నాయకులు తాము ఎక్కువగా రజో గుణంలో  ఉన్నారని అంగీకరించడానికి కూడా  ఇష్ట పడరు. వారి అహం మరియు తెలివితేటల మాయవల్ల వారి రాజసిక చర్యలను అనివార్యమైనవిగా లేదా క్షమార్హమైనవనీ వారు అనుకుంటారు. ఎవరైనా వారిని అంగీకరించకపోతే, వేరేవారిని  అసమ్మతివాదులని  ముద్రవేస్తారు, వారిని  అణగ త్రొక్కేందుకు రాజకీయాలు  చేస్తారు,  చివరకు వారిని  బహిష్కరచ్చేవరకు విశ్రమించరు. వీటినిబట్టి  చూస్తే వారు నిజంగా ఎంతగా రాజసిక గుణంలో మునిగి  ఉన్నారో తెలుస్తుంది.

   రాజసిక ప్రజలు చెడ్డవారు కాదు. అలాంటి వారు విలువైన వారు మరియు ఏ సమాజంలోనైనా అవసరమైన వారు.  అటువంటివారే లేకపోతే, “సరిహద్దులను విస్తరించడం”, నిర్వహణ చేయడం మరియు ప్రభుత్వాలను పాలించడం ఎవరు చేస్తారు? సాత్విక స్వభావం ఉన్నవారి  నేతృత్వంలో నిజాయితీగా పనిచేసేంతవరకు రాజసిక ప్రజలు చాలా మంచి సేవ చేయగలరు. కానీ వారు దీనిని తిరస్కరించినప్పుడు మరియు  తమకు తాము సాత్వికులుగా నటిస్తుప్పుడు, వారు సర్వ నాశనానికి కారణమవుతారు.

తమో గుణం యొక్క ప్రభావాలు

           తమో గుణం మనల్ని నిరంతర ఫిర్యాదు ధోరణకి, అలానే అంతులేని  నిరాశావాదము వైపు  ప్రేరేపిస్తుంది. వీటివల్ల మన ప్రవర్తన మందగిస్తుంది, మనం గమనించ లేనంతగా  ప్రతికూలంగా మారుతుంది. అలానే  అది ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా మనం గమనించలేము. మన దృష్టి  అంతా గతంలో ఎప్పుడో మనకు జరిగిన తప్పులపై సదా కేంద్రీకృతమై ఉంటుంది. సోమరితనం ఆవహించి మనం పరాన్నజీవిలా బ్రతుకు వెళ్ళదీస్తూ, ఎల్లవేళలా  ఇతరులను విమర్శిస్తూ మనము చేస్తున్న వంచనను విస్మరిస్తూ జీవితాన్ని గడిపేస్తాము .

     తమో గుణం ఇతరుల శక్తిని ఒక  “శక్తి పిశాచం” లాగా క్షీణింపజేస్తుంది. దీనికి రాజస గుణంలో ఉన్న ఆశయం మరియు ధైర్యం ఉండదు  కానీ స్వీయ-కేంద్రీకృతత తత్త్వం ఉంటుంది. దీనివల్ల ఇది అసూయ, మోసం ద్వారా ఇతరులతో పోటీ పడేలా చేస్తుంది. ఈ చీకటి పోటీ ఆచరణాత్మకంగా ప్రతిఒక్కరికీ విస్తరిస్తుంది, ఎందుకంటే,తమో గుణంలో మనకన్నా తెలివిగల, అందమైన, లేదా విజయవంతం కాని వారిని కనుగొనడం చాలా కష్టం.

రాజస మరియు తామస గుణాల  తగ్గింపు

     భక్తి మార్గంలో ఉన్న  సాధక భక్తుడు సాధారణంగా ఎంతో కొంత భౌతిక గుణాల ప్రభావంతో ఉంటాడు.  తద్వారా వారి జీవితాలలో మరియు వారి వారి సమాజాలలో రాజస మరియు తామస గుణాలను, ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తూనే ఉంటారు. కానీ, ఒకరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఈ గుణాలు మందగిస్తున్నట్లు భావించాలి. అది జరిగినప్పుడు, ఒకరు క్రమంగా వారి స్వంత లోపాలను ఖచ్చితంగా గ్రహించగలుగుతారు అలానే  ఇతరులలో ఉన్న  మంచి లక్షణాలను అభినందించ గలుగుతారు .

దీన్ని ఆచరణాత్మకంగా పొందాలంటే, గురు పాదాశ్రయం తప్పనిసరి. తెలివిగల భక్తులు గ్రంథాలను ఉటంకిస్తూ మరియు వాదనలను ప్రతిపాదించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని అనుకరించగలరు, కానీ పైన  పేర్కొన్న రాజస  మరియు తామస గుణ ప్రభావాలు వారి వ్యక్తిగత జీవితం అట్లానే  వారు ఏర్పరచుకొన్న సామాజిక విభాగాలలో  ప్రముఖంగా  అగుపిస్తూనే ఉంటాయి .

       రాజస మరియు తామసిక గుణాలు  ఎల్లప్పుడూ మన  దృష్టిని ఇతరుల వైపు మరియు బాహ్యప్రపంచం వైపుకు మరలుస్తాయి.  ఈ గుణాల  ప్రభావంతో ఆధ్యాత్మిక ఆకాంక్షకులు కేవలం ఆధ్యాత్మిక పురోగతి యొక్క బాహ్య లక్షణాలను అనుకరించడంపై దృష్టి పెట్టి,  తమ శాయశక్తులా ఇతరుల లోపాలను ఎత్తి పొడవములో నిమగ్నమౌతారు.  వీటివల్ల మన జీవితాలను అంతర్గతముగా కాక  కేవలం పైపైన మాత్రమే  మార్చుకోగలుగుతాము. మన మార్పు నిజమైనది కాకపోవడము వల్ల  అది మన పూర్వ వ్యక్తిత్వాన్ని మార్చదు అలానే  మన ఆత్మను కూడా  తాకదు .

     జీవితంలో ఏదైనా నిజమైన పురోగతి సాధించడానికి, మొదట ఒకరి స్వంత ఇంటిని శుభ్రపరచాలి.  నిజమైన మార్పు మన స్వంత ఆలోచనలు మరియు చర్యలు  రాజస మరియు తామసిక గుణాలచేత ఎలా ప్రభావితమౌతున్నాయో గుర్తించడం ద్వారా మాత్రమే  మొదలవుతుంది.

     దీనికి తీవ్రమైన  ఆత్మపరిశీలన అవసరం.  కాని ఈ పదానికి అర్థం ఏమిటో చాలామంది ప్రజలకు ఇంకా నిజంగా అర్థం కాలేదని నేను భావిస్తున్నాను. ఆత్మ పరిశీలనమంటే మన  లోపాలను, సంస్కారాలను ఎత్తి చూపమని గురువును కోరడమో  లేదా మనకు  మంచి అనుభూతిని కలిగించని గురువును విమర్శించడమో కాదు. అలానే ఆత్మపరిశీలనము అంటే  గురువు కి తెలియని  నూతన యుగ సాంకేతిక ఆవిష్కరణ అంతకన్నా కాదు.  ఆత్మపరిశీలన అంటే మీ హృదయాన్ని (చిత్తము) శుభ్రపరిచే ఒక గొప్ప క్రియ.

ఆధునిక మనస్సు యొక్క ఆటంకాలు

    గతంలో, సమాజం సరళముగా ఉన్నప్పుడు అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభావితం  కాకుండా ఉండియున్నప్పుడు , ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సాంప్రదాయ సాధన పద్ధతులైన , జపము, కీర్తనము, లీలా -స్మరణము, దేవతారాధనము,  శాస్త్ర ప్రవచనము  మరియు సేవ వంటివి సరిపోయేవి. ఎందుకంటే, ఆ ప్రజలు పుట్టుకనుండే  వర్ణాశ్రమ వాతావరణంలో ఉండేవా రు. అందువల్ల  వారికి  తమ సామజిక కట్టుబాట్లు మరియు జీవిత లక్ష్యం గురించి పూర్తి అవగాహన ఉండేది. అధికారాన్ని అంగీకరించి విధేయముగా ఉండే స్వభావము వారికి  సహజము గానే ఉండేది. వారు ఎల్లప్పుడూ  సత్వ స్థితిలో ఉండే వారు.

   అయితే,  ఈనాటి ఆధునిక తరములో, సమాజం పూర్తిగా మారిపోయింది. అందువల్ల, సాంప్రదాయిక పద్ధతులు, గతంలో ఉన్నట్లుగా శక్తివంతమైనవి అయినప్పటికీ, వాటి ప్రభావాన్ని చూపించ లేవు.  ఎందుకంటే మన మనస్సు ఎల్లప్పుడూ అస్థిరంగా, గందరగోళంగా మరియు సందేహాస్పదంగా ఉంటుంది. ఈ  ఆధునిక యుగంలో  మన మనస్సులలో విశ్వాసమనేది  లోపించింది  మరియు అసురక్షణ బాగా ప్రజ్వరిల్లింది. మనకు ఒకరికి లొంగి సాధన చేయడం అనే విషయములో  శిక్షణ లేదు సరికదా దానికి విరుద్ధంగా ఈ ఆధునిక ప్రపంచంలో  మన మనస్సు రాజసిక పరిజ్ఞానపు ఆవిష్కరణల ప్రభావం చేత  పరధ్యానంలో మునిగి పోయి ఉంటుంది. ఇటువంటి  పరిస్థుతులలో  ప్రాథమిక తాత్విక భావనల మీద  హేతుబద్ధమైన అవగాహనతో చాలా కొద్ది మంది మాత్రమే పెరుగుతారు. మనము  మార్గదర్శకత్వాన్ని అధికారమనీ, దౌర్జన్యమనీ,  బలహీనతయని   భావిస్తాము. అంతేకాకుండా, తామసిక  మరియు రాజసిక గుణాల ప్రభావము చేత  పనిచేయని మరియు అస్తవ్యస్తమైన ఆధునిక కుటుంబాల్లోని సంబంధాలు మనకు మన బాల్యావస్థ నుంచే లోతైన బాధలను కలిగిస్తాయి. వీటివల్ల  విమర్శ,  లోపాలను ఎత్తి చూపడం  ఇష్టపడని  తీవ్రసున్నిత మనస్త్వతాన్ని  మనము కలిగి ఉంటాము .

     ఈ విధంగా, చాలా మంది ప్రజలు భక్తి మార్గములోకి తమ  ఆధునిక జీవితపు గాయాలను నయం చేసుకోడానికి వస్తారు.  నిజమైన ఆధ్యాత్మిక పరిణామం కోసం కాదు. మనము  ఆధ్యాత్మిక సాధన యొక్క క్రమబద్ధతలో ప్రధానంగా సామాజిక సమూహాలలో అంగీకరించబడతాము, అది మన హృదయాల్లోని దెబ్బతిన్న బాల్యం యొక్క జ్ఞాపకాలను చెరిపివేస్తుందని  మనము ఆశిస్తాము. మన  నిజమైన ప్రేరణ, తరచూ మనకు తెలియనిది, ఒక సర్రోగేట్ కుటుంబాన్ని కనుగొనడం-అందువల్ల మనల్ని రజోగుణ తమోగుణాలలో ఉంచే రిఫ్లెక్సివ్ ప్రవర్తనలు మరియు అవగాహనల (సంస్కారాల) నుండి మన హృదయాలను శుద్ధి చేయటానికి నిజమైన ఆత్మపరిశీలనపై ఆసక్తి చూపడం లేదు.

     మనము నిజముగా  శరణాగతులమైతే , మనం మన లక్ష్యమైన కృష్ణప్రేమను పొందడానికి ప్రాథమిక సాధనాలు తప్ప మరేమీ అవసరం లేదు. కానీ ఇది సాధారణంగా జరగదు. అలాంటి “ శరణాగతి” అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియదు.

మార్గదర్శకుని ఆవశ్యకత 

    ఆధ్యాత్మిక సాధనలు ప్రముఖ లోపాలు లేకుండా చేసినప్పుడు సమర్థమౌతాయి. ఒక వ్యక్తి తన  సొంత లోపాలను స్థిరంగా మరియు కచ్చితంగా చూడటం చాలా అరుదు. ఈ కారణంగానే మార్గదర్శకుడు, గురువు చాలా అవసరం. కనీసం, ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నిస్తున్నవారంతా  తమకు తెలిసిన వ్యక్తులను, తమపై  అసూయపడేవారిని కూడా క్రమం తప్పకుండా  తమలోని లోపాలను   ఎత్తి చూపమని కోరామని నేను సూచిస్తాను. ఎందుకంటే మన లోపాలను మనమే గుర్తించటం చాలా క్లిష్ట తరం. ఆధ్యాత్మిక అభ్యాసకులం దరూ తమన లోని లోపాలను గమనించి ఎవరైనా విన్నవించినప్పుడు వాటిని సాదరంగా వినేందుకు మంచి వినికిడి శక్తి  తప్పకుండా అవసరం. 

     ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన వారు ప్రధానంగా వారి స్వంత సమస్యలను పరిష్కరించుకుంటానికి వచ్చినవారని  నేను ఎప్పుడూ అనుకుంటాను. శ్రీకృష్ణుడు భగవద్గిత(7.16)లో తనను పూజించేవారు ఆర్థిక, ఆరోగ్యం లేదా భావోద్వేగ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, అరుదైన సందర్భాల్లో మాత్రమే , ఈ  సంసారమునుండి  విముక్తికై  ప్రయత్నిస్తున్నారని భగవద్గిత(7.16) లో  చెప్తాడు. తరువాతి శ్లోకం(7.17)లో, భక్తి మార్గాన వెళ్ళే వారు ఎక్కువగా ఆ అరుదైన, నాల్గవ వర్గానికి చెందినవారని శ్రీకృష్ణుడు  వివరిస్తాడు . అలాంటివారుకూడా  భక్తి యొక్క అభ్యాసాల అసలు ఉద్దేశ్యాన్ని మరచిపోయి, మానవత్వానికి సహాయం చేయాలనే ఆలోచనతో స్థిరపడి పోతారు.

     బాగా చిక్కుముడులలో  చిక్కుకు  పోయి ఉన్న వ్యక్తి ఇతరులను ఎలా విడిపించగలడు?.  “కథం అసిద్ధః పరమ్ సాధాయతి” (“అసంపూర్ణుడు ఉన్నతమైనదాన్ని ఎలా సృష్టించగలడు?”) . తమ  హృదయాలలో రాజస  మరియు తామస లక్షణాలు కల వ్యక్తి ప్రపంచాన్ని వాటి ప్రభావాల నుండి కాపాడలేడు. క్లుప్తముగా చెప్పాలంటే అంటే వారి స్వంత సమస్యలను పరిష్కరించుకోలేని వ్యక్తి ప్రపంచ సమస్యలను ఎంతగానూ పరిష్కరించలేడు.

అందువల్ల, ప్రపంచాన్ని రక్షించడము  మన  ప్రాథమిక ఉద్దేశ్యం అయినప్పటికీ, ముందట మన స్వంత తప్పులను చూడటం అలానే  వాటిని నయం చేసుకొన్నాక మాత్రమే  ప్రపంచానికి  ఏవైనా చేయగలం.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    మీ మనసుకు భంగం కలిగించేది మీ కర్మ అని మీరు అర్థం చేసుకోగలిగితే, ఇతర వ్యక్తుల మాటలకు మీరు తక్కువ బాధపడతారు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.