ప్రశ్న : నేను భక్తి మార్గములో లేని నా కుటుంబ సభ్యులతో వ్యవహరించే సమయములో చాలా వరకు ప్రతికూల భావనలతో (సరిగ్గా చెప్పాలంటే ద్వేష భావం) నిండి పోయి ఉంటాను. అదే నేను భారతీయులు కానట్టి నా సహ ఉద్యోగులతో వ్యవహరించే విషయములో చూసీచూడనట్టుగా ఉంటాను. నేను అందరితో సమదృష్టితో ఉండగలిగే దృక్పథమును ఎలా పెంపొందించుకోగలను? నేనున్నటివంటి కనిష్ట భక్తి దశలో ఇటువంటి భావావేశములకు లోనుకాకుండా ఉండటం ఎలా?
జవాబు : మీరు కొన్ని విషయాలను ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి.
1) ఈ భౌతిక జగత్తులో అందరూ బద్ధులై ఉన్నారు. మీరు వారి ప్రవర్తన విషయములో స్వతంత్రులని అనుకోవచ్చు కానీ నిజానికి వారు ప్రకృతిచే నిబంధించబడి ప్రవర్తిస్తూ ఉంటారు.
2) జనులు అజ్ఞానులు.
3) ఇతరులు మారతారని ఆశ పడడం ఖచ్చితంగా దుఃఖానికి దారి తీస్తుంది.
4) మీరు మిమ్ములను తప్ప వేరే వారిని ఎవ్వరినీ మార్చలేరు.
5) మిమ్ములను మీరు మార్చుకోవడం అనేది మీ బాధ్యత.
6) వేరే వారిని మార్చడం మీ బాధ్యత కాదు.
7) మిమ్ములను మీరు మార్చు కొన్నట్లయితే వేరే మారిని మార్చడం సులభతరం.
8) మీ బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వర్తించండి మరియు వేరే వాళ్ళను మార్చడమనే అసాధ్య విషయములో విలువైన సమయాన్ని వృధా చేయకండి.
9) ఇతరుల విషయములో అవాస్తవికమైన అపేక్షలను కలిగి ఉండవద్దు.
ప్రచారము
ప్రశ్న : నేను జ్ఞానాన్ని పంచడం ( పుస్తక వితరణ చేయడం ) మరియు ప్రచారం నిర్వహించడమనేవి ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ప్రాధాన్యమైనవి అని విన్నాను. నేను భక్తిలో పురోగతి పొందాలంటే ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందా? నేను ప్రచారకునిగా మారాలా?
జవాబు: మీరు మొట్ట మొదట ఇక్కడ చాలా స్పష్టముగా అర్ధం చేసుకోవాల్సిన విషయం మీ ఆధ్యాత్మిక జీవన లక్ష్యము ప్రచారం చేయడమో లేక పుస్తక వితరణో కాదు. మీ లక్ష్యం భక్తునిగా మారడం. ప్రచారమనేది దాని అనుసంగ ప్రభావం మాత్రమే. ఏది ఏమైనా, ఇక్కడ మొట్ట మొదటి అడుగు అనేది శాస్త్రమును యోగ్యుడైన గురువు వద్ద నుండి నేర్చుకోవడం. అది మనం పరిపూర్ణత పొందాలంటే చాలా అవసరం మరియు ఒకరు తనకు గల జ్ఞానాన్ని ఇతరులకు తెలపాలన్నా కూడా అవసరం. మీకు ఏమి తెలియకున్న వేరెవారికి మీరు ఏమి చెప్పగలరు.
కనుక, నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే మీరు శాస్త్రాన్ని మొదట సరిగ్గా నేర్చుకోండి ఆ తర్వాత మీరు ఏమి అవ్వాలో అది నిర్ణయించుకోండి.
లీల
ప్రశ్న: శిశుపాలుడు మరియు దంతవక్రుడు రూపములో ఉన్న జయ విజయులు మోక్షాన్ని పొంది వైకుంఠాన్ని చేరుకొన్నారు. మరి అట్లయితే జగాయి మరియు మదాయిగా వారు శ్రీ చైతన్య మహాప్రభువు లీలలో తిరిగి ఎలా వచ్చారు?
జవాబు : మీరు లీల అనే పదాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నట్లైతే మీ ప్రశ్నకు మీరే జవాబివ్వగలరు. లీల అంటే ఆట అని అర్థము, మహాప్రభువు ఆవిర్భవించి తన కృపాకటాక్షాలను వారి మీద చూపాలని వారు పాపాత్ములుగా నటించారు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.