ప్రమాణం, కర్మ మరియు సుఖాన్వేషణ

Questions & AnswersComments Off on ప్రమాణం, కర్మ మరియు సుఖాన్వేషణ

ప్రశ్న : జ్ఞానాన్ని పొందటానికి మూడు రకాల మార్గాలు ఉన్నాయి: గురువు, సాధువు మరియు శాస్త్రము. ఈ మూడూ ఒకదానితో ఒకటి సమానమైనవా?

జవాబు: ఇక్కడ నిజమైన ప్రమాణము శాస్త్రము, మిగతా రెండూ శాస్త్రమునకు హేతుబద్ధమై ఉండాల్సినవి. ఒక వేళ అవి అలా ఉండకపోతే దానిని మనం పరంపర అని అనలేము. అదే పరంపరకు మరియు పంథములకు (ఉదాహరణకు కబీర్ పంథము లేక  నానక్ పంథము) గల వ్యత్యాసము.

ప్రశ్న : ప్రారబ్ధమనేది ప్రస్తుత పురుషార్ధాన్ని ఎలా ప్రభావితము చేస్తుంది ?

జవాబు: మన మనస్సు తీసుకొనే నిర్ణయాలను ప్రభావితం చేయటం ద్వారా, మంచి లేక చెడు కోరికలను జనింప చేయడం ద్వారా మరియు అనుకూల్యమైన లేక ప్రతికూల పరిస్థితులను ఉత్పన్నం చేయడం ద్వారా.

 ప్రశ్న : భాగ్యము ప్రారబ్ధం కంటే భిన్నమైనదా?

జవాబు : భాగ్యానికి మరొక పర్యాయ పదమే ప్రారబ్ధము.

ప్రశ్న : నేను ముఖ్యముగా విద్యార్హతలు పొందటం  మరియు సంపాదను ఆర్జించడం మీద దాని ప్రభావం గూర్చి తెలుసుకోవాలని అనుకొంటున్నాను. గతంలో గల ఆర్ధిక ఇబ్బందుల వల్ల నేను కళాశాలలో విద్యను పూర్తిచేయలేక పోయాను మరియు ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నేను ఉన్నత విద్యను పొందలేక పోవడం పురుషార్థ లేమి వల్ల వచ్చినదా లేక  అదినాకు వ్రాసి పెట్టిలేక పోవడం జరిగిందా అనేది తెలుసుకోవాలని ఉంది.

జవాబు : నాకు మీ గూర్చి పూర్తి విషయ జ్ఞానము లేదు కానీ నేను అది ప్రారబ్ధము వల్ల సంభవించిందని అనుకొంటున్నాను.

ప్రశ్న : ప్రస్తుత పురుషార్థము ప్రారబ్ధము యొక్క దుష్పరిణామాలను తగ్గించడం పైన ఎటువంటి ప్రభావము చూపగలదు ?

జవాబు : నేను ఇంతకు ముందు వివరించినట్లు ప్రారబ్ధాన్ని బట్టి మీరు ప్రత్యేక స్థితిలో ఉండి ఆ విధముగా కోరికలు కలిగి ఉంటారు. బుద్ధి కుశలత మరియు దృఢ నిశ్చయముతో ప్రారబ్ధ ఫలమును తక్కువ లేక పూర్తిగా నిరుపయోగం చేయవచ్చు. అది ప్రారబ్ధము అనేది ఎంత బలంగా ఉన్నది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జీవితమనేది ప్రారబ్ధము మరియు పురుషార్థముల మిశ్రమము.

ప్రశ్న : ఇలాంటి పరిస్థితులలో ఒకరి మానసిక స్థితి ఎలా ఉండాలి?

జవాబు : మనం అన్ని పరిస్థితులలోనూ సానుకూల దృక్పథంతో ఉండాలి మరియు ప్రతి ఒక్క దానిని ఆ భగవంతుని కృపగా చూడ గలగాలి.

ప్రశ్న : మీరు పైన పేర్కొన్న దాన్ని గూర్చి ఇంకా తెలుసుకోవడానికి ఏదైనా విశ్వసనీయమైన ప్రామాణిక గ్రంథము ఉన్నదా?

జవాబు:  దీని గూర్చి తెలిపేందుకు నేను ప్రత్యేకించి ఏ గ్రంథము ఉన్నదని అనుకోను. కానీ హితోపదేశము గూర్చి నేను వ్రాసిన వ్యాఖ్యానములో వీటిలోని కొన్ని అంశాల గూర్చి విశదీకరించాను.

ప్రశ్న : నేను ప్రస్తుతము ఉన్న స్థితి చాలా భాధాకరమైనది. కానీ దాని గూర్చి ఏదైనా చేసేందుకు నాకు బద్దకంగా ఉంది. మీరు నేను ఈ సమస్యల నుండి బయటకు వచ్చేందుకు దయచేసి సాయం చేయగలరా- ఇది నా జీవితములోని ఎన్నో సమస్యలను నివారించగలదు.

జవాబు: ఉత్సాహము , నిశ్చయము  మరియు  ధైర్యము –  పని చేయాలనే ఉత్సాహము, చేసేందుకు దృఢత, మరియు మొక్కవోని విశ్వాసం ఇవే విజయానికి పునాదులు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    తప్పులను అంగీకరించడానికి గొప్ప ధైర్యం మరియు వినయం అవసరం. మన తప్పును అంగీకరించడం బలమేగాని బలహీనత కాదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.