“ప్రేమ మరియు ద్వేషం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు” అనే నానుడి మీరు వినేవుంటారు. మీలో కొంతమంది ప్రస్తుతం దీని యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని బహుశా పొందుచూ ఉండవచ్చు. మనం మన ఆత్మీయులతో ఉండటానికి ఎల్లప్పుడూ ఇష్టపడతాము. కానీ ఈ ఉరుకులూ-పరుగుల జీవితం కారణంగా తగినంత సమయం లభించదు. అయితే కరోనా దయ వల్ల, ఇప్పుడు మన ప్రియమైనవారితో రోజుకు ఇరవై నాలుగు గంటలూ ఉండవలసి వస్తుంది. కొంతమందికి, ఇది భరించలేనిదిగా మారుతోంది. చాలా కాలం క్రితం, ప్రేమ మరియు ద్వేషం ఒకే భావోద్వేగానికి రెండు వైపులా ఎలా ఉన్నయో చక్కగా వివరించే ఒక కథను నేను చదివాను. ఒకప్పుడు భారతదేశంలో ఒక ముస్లిం చక్రవర్తి చాలా అందమైన మహిళతో ప్రేమలో పడ్డాడు. అతను ఆమెను తరచూకలిసేవాడు, కాని ఒక రోజు, అతని ఆశ్చర్యానికి, ఆమె మరియు అతని సైన్యాధిపతి కూడా ప్రేమికులు అని అతను కనుగొన్నాడు! ఇది తన అహానికి అవమానంగా భావించి, తద్వారా భరించలేనిది మరియు శిక్షార్హమైనది అని అతను భావించాడు. ఒక చక్రవర్తి కావడం వల్ల, తనకు నచ్చిన విధంగా ప్రజలను శిక్షించగలడు. కాని ఉరి తీయడం లేదా హింసించడం వంటి సాధారణ శిక్షను అతను కోరుకోలేదు. కాబట్టి అతను తన చాలా తెలివైన మంత్రులలో ఒకరిని పిలిచి, ఏది సరిఅయిన మరియు ప్రత్యేకమైన శిక్ష అని అడిగాడు. మానవ తత్వశాస్త్రములో నిపుణుడయైన ఆ మంత్రికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. “ఉత్తమ శిక్ష, వారిద్దరినీ 24 గంటలు ముఖాముఖి నగ్నంగా కట్టివేయడం” అని అన్నాడు. ఆశ్చర్యపోయిన చక్రవర్తి, “ఏమిటి? అది శిక్ష కాదు! వారు ఆనందించేదిగా చేయడము!” అన్నాడు. అప్పుడు “లేదు, ప్రయత్నించి చూడండి” అని మంత్రి అన్నాడు.
మంత్రి తెలివిని నమ్మిన ఆ చక్రవర్తి, సేనాధిపతి మరియు మహిళను పిలిచి, వారిని ఎదురు బొదురుగా నగ్నంగా కట్టివేశాడు. 24 గంటలు వారు అలానే ఉండవలిసి రావడంవల్ల, ఒకరి ముఖంలోకి ఒకరు శ్వాస వదలాల్సి వచ్చినది అలానే మల మూత్రాలుకూడా ఒకరిమీద ఒకరు విసర్జన చేయవలసి వచ్చింది. 24 గంటల తర్వాత కట్లు విప్పబడినప్పుడు, వారు వ్యతిరేక దిశల్లో పరుగెత్తారు అంతేకాక మరలా ఒకరిని ఒకరు అసహ్యించుకొని మళ్ళీ జీవితములో ఎప్పుడూ ఒకరినొకరు చూడాలని కూడా అనుకోలేదు.
ఇది ప్రేమ మరియు ద్వేషాల ప్రాథమిక మూలాలు ఒకే భావోద్వేగంలో ఉంటాయని నిరూపిస్తుంది. మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు, మనం ఆ వ్యక్తితో విలీనం కావాలని అనుకుంటాము.అందుకే ఆలింగనం చేసుకోవడం ప్రేమికుల మధ్య జరిగే ఒక సాధారణ చర్య. ప్రేమలో ఉన్నవారు ఒకరిలో ఒకరు విలీనమైనట్లు “మనం ఇద్దరం ఒకటే, మనం ఒకరినొకరు లేకుండా జీవించలేము” అంటూ ఉంటారు. మరోవైపు, మనం ఒకరిని ద్వేషించినప్పుడు, మనం ఆ వ్యక్తి నుండి దూరంగా ఉండేందుకు ఇష్టపడతాము. ప్రేమ ఆకర్షణ మరియు సాన్నిహిత్యాన్ని కలిగిస్తుంది. ద్వేషం దానికి పూర్తి వ్యతిరేకం, ఇది విరక్తిని కలిగిస్తుంది. దూరానికి కారణమవుతుంది. వాస్తవానికి, ప్రేమ మనల్ని మనం త్యాగం చేసుకోవడానికి సిద్ధం చేస్తుంది, ఐతే ద్వేషం ఇతరులను సదా నాశనం చేయాలనుకుంటుంది.
ప్రతి ఒక్కరూ తాము ఇష్టపడే వ్యక్తులతో దీన్ని అనుభవిస్తారు. మనం దానిపై బహుశా ఉద్దేశపూర్వకంగా దృష్టి పెట్టడం లేదు. బహుశా మనం ఈ వికారమైన సత్యాన్ని విశ్వసించలేకున్నా, మనం ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తినే మనం ద్వేషిస్తాము అనేది నిజం. చాలా అరుదుగా మనం యాదృచ్ఛిక అపరిచితులను ద్వేషిస్తాము, కాని చాలా తరచుగా మనం ఇష్టపడే వ్యక్తులను ద్వేషిస్తాము, వారిపై అరుస్తాం, వారి గురించి చెడుగా మాట్లాడటం మొదలైనవి చేస్తాము.
ఇది మానవ భావోద్వేగ మనస్తత్వనిర్మాణం కారణంగా చెప్పవచ్చు. ద్వేషం మరియు ప్రేమ అనే రెండు విపరీతాల మధ్య మన మనస్సు ఎప్పుడూ లోలకంలాగ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక వైపు ఉండలేదు. ఇది ఎల్లప్పుడూ ఒక భావము నుండి మరొకదానికి మారుతుంది. ఇది సాంఖ్య-కారికా (12) లో చాలా అద్భుతంగా వివరించబడింది.
దీన్ని మనం ఎంత త్వరగా గ్రహించి, అంగీకరించగలిగితే అంత త్వరగా మనం ఆధ్యాత్మిక పురోగతి సాధించగలం. దానిని అంగీకరించడం ద్వారా, మన ప్రియమైనవారి పట్ల (గురువుతో సహా) మనకున్న ద్వేష భావనలకు మనం బాధ్యత వహించాలి. దీన్ని ఎవరూ అంగీకరించడానికి ఇష్టపడరు, కానీ అది నిజం. ఇది గురువును కలిగి ఉండటం, నియంత్రించడం, సలహా ఇవ్వడం మరియు సందేహించడం వంటి సూక్ష్మ రూపాల్లో ప్రకటం అవుతూ ఉంటుంది. మనం మన ద్వేషపూరిత భావాల్ని సొంతంగా తెలుసుకోవడం చాలా బాధాకరముగా ఉండవచ్చు. దానికి కఠినమైన ఆత్మపరిశీలన అవసరం. ఈ భౌతిక మనస్సుని – రాగ మరియు ద్వేషాల యొక్క దీర్ఘకాల బంధనాల నుండి బయటపడేటట్లు చేయాలంటే ఇది చాలా అవసరం.
ఈ కరోనా గృహనిర్బంధం మనకు మన మనస్సు ఎలా పనిచేస్తుందో నిశితంగా పరిశీలించే అవకాశాన్ని ఇస్తుంది, ఎందుకంటే మనం ఇలా నిర్బంధంగా గృహాల్లో కలిసీ ఉండటంవల్ల ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతాము. మనం మన ప్రియమైనవారితో కలిసి ఉండడం సంతోషాన్ని కలిగించాలి కానీ శాశ్వతమైన ఆనందం లేదు. మనం ఒకరితో ఒకరము ఉండటాన్ని ఆనందిస్తాము, కాని ఏదో ఒక చిన్న విషయం గురించి, అసంబద్ధమైన విషయం లేదా అభిప్రాయ భేదం గురించి పోరాడటం, వాదించడం మరియు తగాదాకి దిగడం ప్రారంభిస్తాము. భౌతిక ప్రేమ ఈవిధంగానే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీ మనస్సు యొక్క స్వభావాన్ని మరింత దగ్గరగా గమనించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
కానీ, నిరాశ చెందకండి. నిజమైన ప్రేమ లాంటిదేమీ లేదని దీని అర్థం కాదు. నిజమైన ప్రేమ ఏక దిశాత్మకమైనది. ఇది లోలకం లాగా డోలనం చేయదు. ప్రేమికులు ఎంతకాలం కలిసి ఉన్నా, వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు విసుగు చెందరు. ఈ నిజమైన ప్రేమ అన్ని ప్రేమలకు మూలమైన కృష్ణునిలో పాతుకుపోయి ఉంది. మన ప్రేమ యొక్క భావోద్వేగం కృష్ణునియందు మాత్రమే సఫలమౌతుంది. కాని దాని భావం మనం మన ప్రియమైన వారిని ప్రేమించలేమని కాదు. మనం వారిని కృష్ణునితో సంబధించి ప్రేమించాలి కాని స్వతంత్రంగా కాదు. ఆధ్యాత్మిక ప్రేమకు, భౌతిక ప్రేమకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఇది.
భాగవతంలో, నేటి సమాజంపై విధించిన “లాక్డౌన్” పరిస్థితికి సారూప్యమైన ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఇంద్రుడు వ్రజభూమిని వరదపాలు చేయడం ద్వారా అత్యవసర పరిస్థితిని కలిగించినప్పుడు ఇది జరిగింది. పౌరులందరూ గోవర్ధన పర్వతము క్రింద ఏడు అహోరాత్రులు కలసి ఉండాల్సి వచ్చింది. ఇది మన ప్రస్తుత లాక్డౌన్ కంటే చాలా తీవ్రమైనది. ఇప్పుడు కనీసం కుటుంబాలు తమ సొంత స్థలంలోనే ఉన్నాయి, కాని ఆ లాక్డౌన్లో, వందలాది వ్రజ గ్రామాల నుండి గ్రామస్తులు గోప్యత లేకుండా దగ్గరగా ఉండాల్సి వచ్చింది. అలాగే, ఇప్పుడు మనం ఇతర మానవులతో లేదా మన పెంపుడు జంతువులతో మాత్రమే ఉన్నాము. కాని ఆ లాక్డౌన్లో, వ్రజ నివాసితులు వారి పశువులన్నింటినీ వారితో తీసుకువెళ్లారు. మనల్ని పరధ్యానంలో ఉంచడానికి మరియు సమయం గడపడానికి ఇప్పుడు మనకు టీవీ, ఐప్యాడ్‌లు ఉన్నాయి. వ్రజవాసీలు దాదాపు ఏడు పగళ్లు మరియు రాత్రులు అక్షరాలా కలిసి ఉన్నారు-మరియు వారు దానిని ఇష్టపడ్డారు! వారు ఒకరినొకరు వెనక్కి నెట్టడం, గొడవ చేయడం, విమర్శించడం, పోటీ చేయడం లేదా అణచివేయడం చెయ్యలేదు. ఇది ప్రతి ఒక్కరికి కృష్ణుని పై స్వచ్ఛమైన ప్రేమ ఉండటం వల్లే సాధ్య పడింది.
English Translation for reference:
Why Love Turns into Hate—A Revelation by Corona
https://www.jiva.org/why-love-turns-into-hate-a-revelation-by-corona/
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.