బ్రహ్మ విమోహన లీల సారాంశం

GeneralComments Off on బ్రహ్మ విమోహన లీల సారాంశం

ప్రశ్న : బ్రహ్మ విమోహన లీల యొక్క వ్యాఖ్యానాలను గోస్వాములు కృష్ణుడు, నారాయణుడు మరియు ఇతర విష్ణురూపాలుగా మారతాడు అని చూపడానికి వాడారు అని నేను అనుకుంటున్నాను. కృష్ణుడు అన్ని విష్ణు రూపాలకు మూలమనే సిద్ధాంతము,  శ్రీమద్ భాగవతం 1.3.28 లోని కృష్ణస్తు భగవాన్ స్వయమ్ అనే వాక్యం కాకుండా, శ్రీమద్ భాగవతం మీద పూర్తిగా ఆధారమైందా?

శ్రీమద్ భాగవతం దశమ స్కంధం, 13-14వ అధ్యాయాలపై వ్రాయబడ్డ వ్యాఖ్యానాల మీద ఆధారంగా నా అభిప్రాయం:

 1. బ్రహ్మ శ్రీకృష్ణుడితో పాటుగా ఉన్న గోపబాలురందరూ చతుర్భుజులుగా ఉండటం చూసి అబ్బురం చెందాడు. నాకు అర్థమైనదానిబట్టి బ్రహ్మ చతుర్భుజ రూపాన్ని చూసిన తర్వాతే కృష్ణుని వైశిష్ట్యాన్ని అర్ధం చేసుకోగలిగాడు. తర్వాత శ్రీకృష్ణుని ద్విబాహు రూపాన్ని స్తుతిస్తూ  ప్రార్ధనలు చేసినప్పుడు, “నారాయణ” అనే పదం వాడటం జరిగింది అది ఆయన పాల సముద్రములో తేలియాడుతున్నప్పుడు ఉండే రూపాన్ని గూర్చి తెలిపేది. ఆ ప్రార్ధనలు చతుర్భుజుడైన ఆయన రూపాన్ని మననలోనికి తెచ్చుకుంటూ చేసినవే.
 2. బ్రహ్మ ప్రార్ధనలు కృష్ణుని చతుర్భుజ రూపాన్ని చూసిన తర్వాత చేయబడ్డాయి. అందువల్ల, ఆ ప్రార్ధనలలో కృష్ణుని “నారాయణ” అని సంభోదించటం సరైనదే మరియు దాని అర్ధము కృష్ణుడు నారాయణుడిగా మారాడు అని కాదు. కృష్ణుని “నారాయణ” అని పిలవడం తప్పు కాదు అలానే అసమంజసం కానే కాదు. ఎందుకంటే నారాయణుడే కృష్ణుడు కాబట్టి.

శ్రీమద్ భాగవతం 1.3.28 లోని – కృష్ణస్తు భగవాన్ స్వయమ్ కాకుండా, బ్రహ్మ విమోహన లీలను శాస్త్రీయముగా సమర్ధిస్తూ కృష్ణుడు అన్ని రూపాలకు మూలము అని చెప్పేందుకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? దయచేసి చెప్పగలరు.

 జవాబు:  మనం అన్నిటికంటే ముందు, బ్రహ్మ విమోహన లీలను పరిశీలిద్దాము. మీరు “బ్రహ్మ శ్రీకృష్ణుడితో ఉన్న గోపబాలురందరూ చతుర్భుజులుగా ఉండటం చూసారు” అని అన్నారు.  నేను మనిద్దరి అవగాహనలోని వ్యత్యాసం ఇక్కడే ఉందని అనుకుంటున్నాను. మీరు కృష్ణుని చతుర్భుజ రూపాలలో కలిపి చూస్తున్నారు కానీ మేము అలా చూడటం లేదు. మా అవగాహన ఏమిటంటే గోపబాలురు మాత్రమే చతుర్భుజ రూపములోకి మారారు కృష్ణుడు తన ద్విబాహు రూపములోనే ఉన్నాడు.  

సర్వే వత్స పాలాః (10.13.46) అనేది కృష్ణుని కలపవచ్చు లేక కలపకపోవచ్చు. కానీ ఆ శ్లోకముకి యథార్థ రూపములో అది కృష్ణునికి వర్తించదు.  వత్స పాల అనే పదం బ్రహ్మ చేత దొంగిలించబడ్డ గోపబాలురకు వర్తిస్తుంది. కృష్ణుడు గోపాలుడు కూడా కాబట్టి ఆయన్ని కూడా గోపబాలునిగా పరిగణలోనికి తీసుకోవటం సరైనదికాదు. అలానే మేము 10.14.18వ శ్లోకాన్ని  కృష్ణుడు ఇతర విష్ణు రూపాలుగా రూపాంతరం చెందాడని అర్థము చేసుకొంటాము. నారాయణుడు కృష్ణుడుగా అవతరించాడని అనుకోవడం సరైనది కాదు. ఆ విధముగా సూచించినట్లు ఈ శ్లోకములో లేదు.

ఏదైతేనేమి, ఈ గోపబాలురందరూ కృష్ణుడు వ్యాప్తి చెందటం వల్ల చతుర్భుజులుగా వచ్చినవారే. శాస్త్రములో ఎక్కడైనా చతుర్భుజుడైన విష్ణువు లేక నారాయణుడు ద్విబాహుడైన కృష్ణుని వలే మారినట్లు చెప్పడం జరిగిందా? నేను అటువంటి విషయాన్ని వినలేదు. కంసుని కారాగారంలో వసుదేవ, దేవకీల ముందు చతుర్భుజుడుగా ప్రత్యక్షమైన ప్రమాణానాన్ని నేను పరిగణలోకి తీసుకోను ఎందుకంటే కృష్ణుడు తన కోరికను బట్టి ద్విబాహు లేక చతుర్భుజుడుగా ప్రత్యక్షముకాగలడు కాబట్టి.  10.3.44 లో కృష్ణుడే వసుదేవ, దేవకీలకు తమ పూర్వ జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేయడానికి తాను వారిముందు ప్రత్యక్షమైనట్లు అంటాడు. గౌడీయ వైష్ణవులకు, కృష్ణస్తు భగవాన్ స్వయమ్ తో ప్రమేయం లేకుండా కృష్ణుడే విష్ణు తత్వానికి మూలమని చెప్పటానికి ఇది ఒక స్వతంత్ర సాక్ష్యము. ఇక కృష్ణస్తు భగవాన్ స్వయమ్కు మద్దతుగా శ్రీమద్ భాగవతములోని 10.2.40, 10.14.20, 10.87.46, 11.29.49, 10.1.23, 10.47.60, 9.24.55 మరియు 11.16.29 శ్లోకాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు.

అలానే మీరు ఇతర శాస్త్రాలలోని ఈ శ్లోకాలను కృష్ణస్తు భగవాన్ స్వయమ్ అని అనేందుకు పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఈ శ్లోకాలు శ్రీమద్ భాగవతం నుండి కాకుండా వేరే శాస్త్రాలలోనివి.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో త్తః స్మృతిర్ జ్ఞానమపోహనమ్

వేదైశ్చ సర్వైర్ అహం వేద్యో వేదాంత కృద్ వేద విద్ ఏవ చాహం

నేను అందరి హృదయాలలోనూ ఉన్నాను. నానుండి జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు మర్చిపోవటం అనేవి వస్తాయి. వేదాల నుండి నేను మాత్రమే తెలుసుకోగల వాడిని. వేదాంతానికి నేనే నిజమైన రచయితను మరియు నేను మాత్రమే వేదాలను తెలిసినవాడను (భగవద్గీత 15.15) .

ఇక్కడ చాలా స్పష్టముగా వేదాల నుండి కృష్ణుడే తెలుసుకోబడ వాడు అని చెప్పపడింది.

దేవీ  సర్వే అవతారాస్తు బ్రహ్మణః కృష్ణ రూపిణః

అవతారీ స్వయమ్ కృష్ణ సగుణో నిర్గుణో స్వయమ్

“ఓ దేవీ!  అవతారములన్నియు పర బ్రహ్మ స్వరూపమైన కృష్ణుని నుండే ఉద్భవించినవి. కానీ  సకల గుణ స్వరూపుడు (సగుణ) మరియు గుణాతీతుడైన (నిర్గుణ) కృష్ణుడు తానే అవతారి” ( నారద పురాణం 2.8.45).

సర్వేచాంలా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్

ఈ అవతారములన్నియునూ పురుషునిలో కొద్ది భాగములో లేక చిన్న భాగములో , కానీ కృష్ణుడు మాత్రము స్వయం భగవానుడు. (బ్రహ్మ వైవర్త పురాణం 4.117.12).

అవతారా హి అసంఖ్యాతాః కథితా మే తవాగ్రతః

పరం సమ్యక్ ప్రవక్ష్యామి కృష్ణస్తు భగవాన్ స్వయమ్

“నేను మీకు అసంఖ్యాకమైన అవతారములు వివరించాను. నేను ఇప్పుడు మీకు స్పష్టముగా చెప్పెదియేమిటంటే కృష్ణుడు స్వయము భగవానుడు అవటం చేత వారందరిలో పరమ పూజ్యుడు”(  శ్రీ కృష్ణ సంహిత 92వ అధ్యాయము). 

సహస్ర నామ్నామ్ పుణ్యానాం త్రిరావృత్యా తు యత్ ఫలం

ఏకవృత్తయా తు కృష్ణస్య నామేకైకం తత్ ప్రయచ్ఛతి

“కృష్ణుని నామాన్ని కేవలం ఒక్కసారి ఉచ్ఛరించటం వల్ల, వేల కొలది విష్ణుని నామాలు ఉచ్ఛరించటంవల్ల వచ్చే ప్రయోజనం కన్నా మూడు రెట్లు ప్రయోజనాన్ని ఒకరు పొందుతారు” (బ్రహ్మాండ పురాణం 236.19):

కానీ దయచేసి గమనించండి. నాకు  మీతో వాదించాలనో లేక మీ అవగాహనను మార్చాలనో ఆసక్తి ఏ మాత్రం లేదు. మా అవగాహన పక్షపాతంతో ఉందనుకోని మీ అవగాహనతో మీరు కొనసాగడానికి మీకు స్వేచ్ఛ ఉంది. నాకు దానివల్ల ఎటువంటి సమస్య లేదు. మీరు ఈ లీల గూర్చి మా అభిప్రాయాన్ని  తెలియచేయమన్నారు కాబట్టి నేను మీ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను.

 

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  ప్రతి అనుభవం మరింత ప్రశాంతమైన మార్గాన్ని స్వీకరించడానికి ఒక అవకాశం.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.