భక్తి మార్గములో అనర్థములకు మూలం ఏమిటి?

Questions & AnswersComments Off on భక్తి మార్గములో అనర్థములకు మూలం ఏమిటి?

 

ప్రశ్న : భక్తి మార్గంలో అనర్థం అంటే ఏమిటి?

సమాధానం: అర్థము అనే పదానికి వ్యతిరేకమే అనర్థం. ఇది నన్ మరియు అర్థ కూడిక చేత వచ్చే  నన్  సమాసముతో ఏర్పడిన సమస్త పదం. “ఏదైనా అర్థవంతమైనది  కానిది”  అని దీని అర్థం.  సాధారణంగా, తిరస్కారమనేది ఆరు రకాలుగా ఉండవచ్చు: ఒకేరకం, లేక పోవటం,  వేరోరకం, స్వల్పం, చెడు మరియు వ్యతిరేకం. అందుచేత అనర్థమనే పదం ఒక దానిని పోలి ఉన్నట్లుగానో, లేనట్లుగానో, వేరోగానో, కొంచెం తక్కువగానో, చెడుగానో, లేక అర్థమునకు వ్యతిరేకంగానో భావించవచ్చు. అందువల్ల, అనర్థాన్ని తెలుసుకోవటానికి మొదట మనం అసలు అర్థం అంటే ఏమిటో తెలుసుకోవాలి.  అర్థ అంటే అసలు అర్థం ” ప్రతి ఒక్కరూ కావాలని అనుకొనేది”. అది ఒక లక్ష్యం కావచ్చు లేదా ఒకరి కర్మ ఫలం కూడా కావచ్చు.  భక్తి యొక్క విషయములో ఇది ప్రేమ లేదా ఉత్తమ భక్తి.  అర్థాన్ని  ప్రయోజనమని  కూడా పిలుస్తారు. ఇది మన దగ్గర లేనిదాన్ని మనం పొందాలని అనుకొనేది. దాన్ని పొందటానికి మనం కొన్ని అనుకూల కార్యాలు చేయాలి, అలానే కొన్ని అననుకూల కార్యాలు మానాలి. మన లక్ష్యానికి ప్రతికూలమైనది ఏదైనా అనర్థమునే పేరు.

       మన దగ్గర లేనిది భక్తి. మనకు అది లేదు అనే విషయములో స్పష్టత ఉండాలి, ఎందుకంటే మనకు అది ఉంది అనుకుంటే అప్పుడు అది కూడా అనర్థమే. అది మన దగ్గర ఉంటే మనం ఎంతో అదృష్టవంతులము మరియు అప్పుడు అనర్థమనే ప్రశ్నకు తావే లేదు. ఇక్కడ మనకు అనర్థం గురించి ప్రశ్న వచ్చింది కాబట్టి  దానర్థం మనకు భక్తి లేదా ప్రేమ లేదని అర్థం. భక్తికి ఉండాల్సిన స్వరూప లక్షణం గూర్చి చెప్తూ శ్రీ రూపగోస్వాముల వారు ఆనుకూల్యేన కృష్ణానుశీలనం- మనసా , కాయా, వాచేన కృష్ణుని మరియు కృష్ణునికి సంబందించిన విషయాలు లేదా వ్యక్తులకు ఆనందం కలిగించే విధముగా ఉండటమేనని చెప్తారు. అదే అర్థమంటే. మిగతాది అంతా అనర్థమే. అర్థానికి సహాయం చేయనిది ఏదైనా అనర్థమే. ఉదాహరణకు మనం కేవలం దేహం మరియు దానికి సంబంధించిన అవసరాల కోసం మాత్రమే పని చేస్తున్నట్లయితే అప్పుడు అది అనర్థం. మనం మనది కాని దాని గూర్చి పని చేస్తున్నామన్నమాట. మనం బ్రతికే ప్రతి క్షణం అది మన నుండి దూరముగా జరుగుతుంది, అలానే ఒక రోజు అది మనం ఏమి చేయక పోయినాసరే మన నుండి దూరమవుతుంది. 

        మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడుకూడా మనం ఈ అనంత విశ్వంలో మరియు కాలంలో ప్రయాణిస్తూనే ఉన్నాము. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి మనం కూడా గుండ్రముగా తిరుగుతున్నాము. అదే జనన, మరణాల చట్రమనే సంసారము. కావున మిన్నకుండడము కూడా అనర్థమే.  దాన్నే అకర్మణి కర్మ ( భగవద్గీత 4.18) లేక జడముగా ఉండటం వల్ల కర్మలలో చిక్కుకొనటము అని అంటారు. మన సహజ సిద్ధ స్వభావం ఈ మట్టిలో భాగమయ్యే దేహ తృప్తికి  మరియు దానికి సంబంధించిన వ్యక్తులకు పనిచేయటం. ఇదే అనర్థానికి మూల కారణం. మనం దానితో పుట్టాము. అది అనాది అవిద్య. కానీ ఈ దేహాన్ని భక్తి మార్గములో వినియోగిస్తే, అప్పుడు ఈ దేహాన్ని సంరక్షించుకొనటం అనర్థం కాదు. శ్రీకృష్ణుడు పరమ జ్ఞానం అని అంటాడు ( శ్రీమద్ భాగవతం 11.29.22).

        భక్తి మార్గములో, అనర్థాలు అర్హుడైన గురుని శరణుజొచ్చి  గురు-పాదాశ్రయమును స్వీకరించటం ద్వారా పెకళించి వేయబడతాయి. శ్రీ రూప గోస్వాముల వారి ప్రకారం ఇది భక్తిలో తొలి మెట్టు. గురువును ఆశ్రయించడం యొక్క ముఖ్య ఉద్దేశం మన పుట్టుకతో మన వెంట ఉన్న అనర్ధములను నివారించుటకే. కానీ ఇలా చేయడం ఎంతో కష్టతరం ఎందుకంటే మనం శరణుజొచ్చడం అనే దానికి అలవాటుపడలేదు కనుక. మన దేహం మరియు మన బుద్ధి అటువంటి ఆలోచనపై ప్రతిఘటిస్తాయి. అవి స్వతంత్రముగా ఉండి, పుట్టుకతో తమతో ఉన్న అనర్థాలను అర్థాలుగా తప్పుగా భావిస్తూ ఇంకా ఇంకా అనర్థాలలో మునిగి తేలాలని అనుకొంటాయి. మనం తెలివిగా ప్రయత్నం చేయనట్లయితే, మనం అనర్థాలకు దూరముగా వెళుతున్నామా లేక దగ్గరగా వెళుతున్నామో కూడా తెలియదు. కావున మనకు ఆ అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఒక వేళ మనం శరణాగతులం అవ్వగలిగితే, అప్పుడు అనర్థములు ఉండవు. అంటే దానర్థం, మనం గురువు మరియు కృష్ణుని అభీష్టం ప్రకారం నడచు కొంటున్నామని అర్థం.  అనర్థాలు దేహానికి సంబంధించినవి, ఒక్కసారి మనకు శరీరంతో ఆ గుర్తింపు పోయినట్లైతే, ఇక అనర్థాలు ఉండనే ఉండవు. కానీ అది చాలా కష్టం. అది మన ఉనికి మరియు గుర్తింపు మీద ప్రత్యక్ష దాడి, అది మనకు మనమే చేసుకోవాలి. అది ఆత్మహత్య చేసుకోవటం లేదా తన ఇంటికి తానే ఆనందముగా నిప్పు పెట్టుకోవటం లాంటిది. మన గుర్తులను మనం కాల్చడమంటే మనం వాటిని మారుస్తున్నామని అర్థం. మనం స్వతంత్ర ఆస్వాదకులమనే అనుకునేబదులు, కృష్ణుని సేవకులుగా భావించుకొంటాము. అది మనమీద పై నుండి రుద్దినది కాదు; అదే మన గుర్తింపు.  దానర్థం చీకటి నుండి వెలుగు లోకి రావటం (తమసోమా జ్యోతిర్గమయ). 

           మనం అబద్ధములో ఎంతో కాలం నుండి జీవిస్తున్నాము, అందుకే మనము మారాలి అని అనుకోము. అబద్ధం అనేది మనకు బాగా అలవాటైపోయింది. మన మనస్సు తనకు తెలిసిన విషయాలతో సౌకర్యంగా మరియు తెలియని విషయాలతో భయంగా ఉంటుంది.  అందుకే, అది అబద్ధాలను అంటిపెట్టుకొని ఉంటుంది. దాని ఫలితముగా, మనం ఎవరికీ శరణుజొచ్చి  ఉండాలి అని అనుకోము. శరణాగతి అనేది గుండెల్లో ధైర్యమున్న వాళ్ళకే. శరణాగతి అనేది బలహీనత అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఇది ప్రాపంచిక విషయాలలో నిజం కావచ్చు, కానీ భక్తి మార్గములో కాదు. అర్జునుడు బలహీనుడు కాదు. అతడు పరాక్రమవంతుడు. అతడు కృష్ణుని శరణు వేడి “నేను నువ్వు ఆజ్ఞాపించినట్లే చేస్తాను” ( భగవద్గీత 18.73) అన్నాడు. ఇది అతనిని బలహీనుడిని చేయలేదు. అర్జునుడు శరణాగతికి  ముందు  బలహీనంగా మరియు దైన్యముగా వేదనతో ఉన్నాడు. 

            వేదనలన్నీ శరీరం నుండి వస్తాయని తెలిసినప్పటికీ, మనం దాన్నే ప్రేమిస్తాము. అలానే అది ఎంత నొప్పిని కలిగించినా దానికే లొంగి ఉంటాము. ఇది సహజ సిద్దమైన శరణాగతి. ఇది ఎటువంటి ఆజ్ఞకు, విధికి లోబడినది కాదు. ఇది శరీరంపైన గల రాగ-భక్తి. మనం శారీరక బంధనాన్ని అతిక్రమించాలి. శరీరాన్ని ప్రేమిస్తూ అలానే అదే సమయంలో కృష్ణుని పైన ప్రేమతో ఉండటం జరగదు.  మనం శరీరశ్రద్ధకు పెట్టిన సమయంలో ఒక్క  పావు వంతు కృష్ణుని సేవలో గడిపితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే శరీరం పైన మనకు గల మమకారమే అనర్థములకు పునాది. ప్రస్తుతం మనకు మన దేహం, దానితో పాటు ఉన్న మనస్సే గురువు. కృష్ణుడు మనలను ఆ గురువును మార్చమని అడుగుతున్నాడు. మనం మన శరణాగతి పొందే విషయం మార్చితే, అనర్ధం దానంతట అదే మాయం అవుతుంది. ఇదే ఉత్తమ-భక్తి. 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    భౌతిక ప్రేమ మూడు విభాగాలు కలిగి ఉంటుంది: దేహం, వాక్కు మరియు మనస్సు. ఆధునిక సమాజంలో మొదటిరెండు ముఖ్యమైనవి. మూడవది సాంప్రదాయక భాతర సమాజంలో ముఖ్యంగా ఉండేది. మొదటి రెండు ప్రాధాన్యంగాగల ప్రేమ కలలప్రపంచంలో ఒక వస్తువులాంటిది. అది సంతృప్తిని ఇవ్వలేదు, అది భ్రమ మాత్రమే.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.