మహాభారత యుద్ధం, మహాజనులు, ధర్మానికి మూలాలు

GeneralComments Off on మహాభారత యుద్ధం, మహాజనులు, ధర్మానికి మూలాలు

ప్రశ్న: భీష్మ, ద్రోణులు కౌరవుల పక్షాన ఎందుకు ఉన్నారు? నిజానికి వారు చాలా ఉత్తములు కదా ?

జవాబు : దీనికి సమాధానం భీష్ముల వారే స్వయంగా యుధిష్టర మహారాజుకు చెప్పారు.

అర్థస్య పురుషో దాసో దాసస్త్వర్థో  కస్యచిత్

ఇతి సత్యం మహారాజ బద్ధోస్మ్యర్థేన   కౌరవైః

ఓ రాజా! ఒక వ్యక్తి సంపదకు సేవకుడు, కానీ సంపద ఎవరి సేవకుడు కాదు. ఇది యథార్థము. నేను కౌరవుల సంపదకు బద్ధుడను. (మహాభారతం, భీష్మ పర్వం 43. 41)

దాని అర్ధం ఏమిటంటే భీష్మ ,ద్రోణులు దుర్యోధనుని సంపద చేత ఆదరణ పొంది ఉన్నారు. అందుచేత వారు అతనికి బద్ధులై యుద్ధం చేయవలసి వచ్చింది.   ఇక్కడ నీతి ఏమిటంటే శుకదేవ గోస్వాముల వారు చెప్పినట్లు ధర్మ మార్గములో నడిచే వారు అధర్ముల నుండి ఎటువంటి ఋణములను స్వీకరించరాదు: కస్మాద్ భజన్తి కవయో ధన-దుర్మదాంధాన్ (శ్రీమద్ భాగవతం 2.2.5)

ప్రశ్న: చూడటానికి మహాభారత యుద్ధం రాజ్యం కోసం జరిగినట్లు అగుపిస్తుంది. ఇది చాలా సాధారణము. మహాభారతములో  చెప్పినట్లు ఈ యుద్ధములో  లక్షలాది జనులు, ధర్మాత్ములైన  భీష్మ , ద్రోణులు హతులయ్యారు.  వారు దీన్ని యోగ్యమైన దానిగా అనుకొన్నారా? అంతమంది కేవలం ఒక  స్వల్ప విషయము కోసం హతులు అవటం ఏవిధముగా ధర్మము? 

జవాబు: జరిగిన యుద్ధాలన్నీ భూమి మరియు స్త్రీల కోసం జరిగినవే. ఇది మీలాంటి నిస్సంగ భక్తులకు వింతగా అగుపించవచ్చు కానీ జీవితమే ధనార్జన మరియు అధికారం కోసమని పాకులాడే వారికి కాదు. భీష్మ , ద్రోణులు ఈ యుద్ధములో నిర్ణయాత్మక పాత్ర పోషించలేదు.

 ప్రశ్న : చివరకు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన భూమిని వారు పొందారా? ఈ యుద్దాన్ని ఏ ఫలితం గొప్పగా చేసింది ? యుధిష్ఠిరుడు 36 సంవత్సరాల పాలన తర్వాత పరీక్షిత్తుకు అధికారాన్ని అప్పచెప్పి విశ్రమించలేదా? కౌరవులు గెలుపొందితే జరిగేదాని కన్నా ఏమి  గొప్పగా జరిగింది?

జవాబు : శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన చేయడానికి మరియు అధర్మాన్ని కూకటి వేళ్ళతో సహా పెకళించి వేయడానికి రావడం జరిగింది. ఇది ఆయన కార్యం. ఇక్కడ 36 ఏళ్ళో లేక 3 సంవత్సరాలో అనేది విషయం కాదు , ఏది ధర్మము మరియు అధర్మము అనేది మాత్రమే విషయం. 

ప్రశ్న : నాకు మహాజనుల గూర్చి ఒక ప్రశ్న అడగాలని ఉంది. శ్రీమద్ భాగవతములో పన్నెండు మంది మహాజనుల గూర్చి ప్రస్తావన ఉంది. మనం భీష్ముల వంటి వారి జీవితములో వారు ఎన్నో నిర్ణయాలు అధర్మముతో కూడి ఉన్నవారికి ఉపకరించేవిగా ఉండేవి తీసుకోవడం చూస్తాము.

. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకరించలేదు.

. పాండవుల గృహాన్ని కౌరవులు తగుల పెట్టినప్పుడు ఆయన వారిని దండించలేదు. ఆయన రాజ్యాన్ని సైతం రెండుగా విభజించాడు.

. తన ప్రతిజ్ఞను నిలుపుకునేందుకు కౌరవుల పక్షాన యుద్ధం కూడా చేశాడు.

మహాజన అనే పదానికి నిర్వచనం ఏమిటి? భీష్ముడు లాంటి మహాజనులు తప్పులు చేసి ఉన్నారని తెల్సి కూడా మనం వారిని  ఎలా అనుసరించాలి? భీష్ముడు తన జీవితములో ఎప్పుడు మహాజనుడు అయ్యాడు?

 అలానే బలి మహారాజు జీవితాన్ని చూస్తే, మనం ఆయన బలవంతముగా ఇంద్రుని సింహాసనాన్ని ఎక్కటం ఆ తర్వాత దానికి కావాల్సిన అర్హతను పొందేందుకు అశ్వమేధ యజ్ఞాన్ని చేయటం జరిగింది. బలి మహారాజును అటువంటి పనులలో ఎలా అనుసరించగలం? బలి మహారాజు ఆత్మ నివేదన చేసాక మాత్రమే మహాజనుడు అయ్యాడని అంతకు ముందు కాదని మనం అనవచ్చా?

జవాబు : మీకు మీ గురుదేవులే మొదటి మహాజనుడు. వారిని అనుసరించండి మరియు వారు ఏ పరిస్థుతులలో ఎలా ప్రవర్తిస్తారో దాన్ని పరిగణించండి. 

ప్రశ్న : నాకు బాగా ప్రాచుర్యంలో ఉన్న “మహాజనో యేన గతః  స పంథాః” శ్లోకం లోని మూడవ పంక్తి  గూర్చి ఒక ప్రశ్న ఉంది. ధర్మస్య తత్త్వం నిహితం గుహయాం – దాన్ని అక్షరాలా తర్జుమా చేస్తే “ధర్మము యొక్క తత్త్వము  గుహలో దాగి ఉంది” ఎందుకో సరిగ్గా అనిపించదు. భక్తి వేదాంత స్వామి గుహయాం అంటే “మహాజనుల గుండెలలో” అని లేక “ధర్మ శాస్త్రాల నిజమైన అర్ధం చిత్తశుద్ధికలిగి, ఆత్మ సాక్షాత్కారమైన యోగుల హృదయాంతరాలలో దాగి ఉంది” అని అంటారు. నేను మనందరి హృదయాల్లో కూడా అట్టి గుహలు ఉన్నాయని అనుకుంటున్నాను – నిజమైన ధర్మం మనందరి హృదయాల్లో ఒక భావనగా దాగి ఉంది అని అనుకొంటున్నాను. దీని గూర్చి దయచేసి మీ అభిప్రాయం చెప్పగలరు.

జవాబు :   ధర్మము అనే పదానికి బాగా ప్రాచుర్యంలో ఉన్న అర్ధం వేదాలలో చెప్ప బడిన అనేక సూత్రాలుగా అన్వయించబడింది. ధర్మము గూర్చి చెప్పేందుకు ఈ పంక్తి వాడిన సందర్భము కూడా అటువంటిదే. అందువల్ల “భావన” అని అనేది ఈ పంక్తికి అర్ధం కాదు.

మనుస్మృతి ప్రకారం ధర్మానికి నాలుగు మూలాలు ఉన్నాయి. అవి వేదము, స్మృతి, సదాచారం మరియు ఏదైతే ఒకరికి తగినది అయివుంటోందో అది. శ్రీమద్ భాగవతం 7.11.7 లోని అర్ధం కూడా అదే.

అందువల్ల నేను మీరు చెప్పిన ఆ శ్లోకములోని మూడవ పంక్తి సదాచారమును తెలుపుతుంది అని అనుకొంటున్నాను. మన జీవితంలో మనం వేదాలలో లేక స్మృతుల్లో జవాబు లేని ఎన్నో సందర్భాలను మనము చూస్తాము. అటువంటి పరిస్థుతులలో మనము సాధువుల సదాచారములు ( సాధు -వర్త్మానువర్తనం) మీద  ఆధారపడతాము (భక్తి రసామృత సింధు). 

ఉదాహరణకు, వైష్ణవుడు బంగాళదుంపలు, టమాటాలు, చాక్లేటులు మొదలైన లాంటివి తినవచ్చా? వీటి గురించి శాస్త్రముల వైపునుండి  ఎటువంటి సహకారము రాదు. ఇచ్చట కేవలము సదాచారమే మనకు  ప్రమాణం.

Notify me of new articles

Comments are closed.

 • Satyanarayana Dasa

  Satyanarayana Dasa
 • Daily Bhakti Byte

  మీరు యౌవనంలో ఉన్నప్పుడు అన్నీ తింటారు. మీరు వృద్ధాప్యంలో అన్నిటికీ దూరంగా ఉంటారు.

  — Babaji Satyanarayana Dasa
 • Videos with Bababji

 • Payment

 • Subscribe

 • Article Archive

 • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.