నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడిని సందర్శించడం జరిగింది. అతని 11 సంవత్సరాల కుమారునికి ఒక పెంపుడు చిలుక ఉండేది. అతను ఆ చిలుకను ఒక పంజరంలో ఉంచి చాలా ప్రేమతో దానిని సంరక్షించే వాడు. ఒకరోజు అతను తన పాఠశాల నుండి తిరిగి వచ్చేటప్పటికి పంజరం కొక్కెమునకు చిక్కుకొని రక్తం కారి చనిపోయి ఉండటాన్ని గమనించాడు. అది చూసి అతను బాగా చలించి దుఃఖించాడు. అతను భోజనాన్ని కూడా నిరాకరించి ఆ పంజరం ముందే కూర్చుని పోయాడు. నేను నీవు నీ చిలుక కోసం ఎందుకు బాధపడుతున్నావని అతన్ని అడిగాను.
అతను “నా చిలుక చనిపోయేముందు చాలా బాధను అనుభవించి ఉండవచ్చు” అని అన్నాడు. నేను అయితే ఏమిటి నీవు మాంసాన్ని, చేపలను తింటావు కదా , అవికూడా అలానే దారుణమైన బాధను అనుభవించి ఉంటాయి కదా అది నీకు తెలియదా అని అడిగాను.
ఆ బాలుడు ఆశ్చర్య పోతూ “అవునా, నిజముగానా”, అని అడిగాడు.
నేను అవును నిజముగానే అని తెలిపాను. దానికి జవాబుగా ఆ పిల్లవాడు “అయితే నేను ఇక ఎన్నడూ మాంసము ముట్టను. ఆ జంతువులు నా వల్ల బాధపడటం చూడలేను” అని అన్నాడు.
ఆ రోజునుండి అతను శాకాహారిగా మారాడు. ఆ పిల్లవాని లాగానే చాలా మందిమాంసాహారము భుజించే వారు వారి వారి కంచాలలో చేరే ముందు ఆ జంతువులపై జరిగే క్రూరత్వమును ఎప్పుడునూ చూసి ఉండరు. ఈ మాంసాహారమును ఉత్పత్తి చేసే పరిశ్రమలలో ఉండే జంతువులు తమ జీవితకాలాన్ని కేవలం అవి పట్టేటంత పంజరాలలో గడిపేస్తాయి. నిజముగా మనం అవి ఉండే పరిస్థితులు, వాటిని వారు చంపే విధానం చూస్తే మనలో చాలా మంది మాంసాన్ని కన్నెత్తి కూడా చూడటానికి ఇష్టపడరు.
కొంతమంది ప్రకృతికి దూరముగా బతకడము మరియు యాంత్రిక జీవన విధానికి అలవాటు పడి జంతువులు కూడా తమ తమ స్వార్ధానికి వాడుకోగల యంత్రాలని భావిస్తారు. కానీ నిజానికి ఎవరైనా ఎప్పుడైనా ఒక పక్షిని, కుక్కని లేక ఇతర జంతువులను పెంచి ఉంటే ఆ ప్రాణులకు కూడా నిజమైన భావాలు ఉంటాయని అవగతం అవుతుంది.
ఆహారం అనేది అన్ని ప్రాణులకు కావలసిన మూల అవసరం. ప్రాణులందరిలో కేవలం మానవులు మాత్రమే తమ ఆరోగ్యాన్ని వారి ఆహార అలవాట్లతో పాడు చేసుకొంటారు. ఇంకో గర్హనీయమైన విషయం ఇక్కడ ఏమిటంటే మానవులకే ప్రాణులందరిలో బుద్ధికుశలతఅధికము. మనం మన ఆహారాన్ని దానిలో ఉన్న పోషక విలువల బట్టి ఎన్నుకోవడం కాకుండా అది మన ఆరోగ్యానికి చేటు కలిగించేదైనప్పటికి అది మన జిహ్వను సంతుష్టి చేస్తే చాలని అనుకుంటాము. సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారం రావడం ఎంత విచిత్రమైనది మరియు విరుద్ధమైనదో ఇది కూడా అలాంటిదే.
డాక్టర్. కెన్నెత్ వాకర్ మనం తినే ఆహారములో సగం మన కడుపులోకి వెళ్లేదని మరియొక సగము వైద్యుల కడుపులు నింపెదని అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ రుగ్మతలన్నీ సరైన ఆహార పానీయాలు తీసుకోకపోవడం వలన వస్తాయి. మనం తగని ఆహారపు అలవాట్ల వల్ల వైద్యులను గిరాకీలో ఉంచుతున్నాము.
శాకాహారం మాంసాహారము కన్నా యోగ్యమైనదని, ఆరోగ్యకరమైనదని నిర్ధారణ అయినది. శాకాహారం అనేది ఎప్పటినుంచో ఉన్నప్పడికీ, చాలా మందికి దాని నిజ స్వభావం గూర్చి అవగహన లేదు. శాకాహారిగా ఉండటానికి తరచుగా చెప్పే కారణాలు ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యం , ఆర్థిక అభివృద్ధి, జంతు దయ, అహింస, మరియు మత , సిద్ధాంత పరమైన ఎన్నిక.
మీకు గల కారణం ఏదైనప్పటికీ, శాకాహారమనేది మన ఆధ్యాత్మిక గుర్తింపు గూర్చి అవగాహన పొందేందుకు మరియు సమాజములో శాంతిని నెలకొల్పేందుకు నిస్సందేహముగా సహకరిస్తుంది.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.