లీలల గూర్చి అవగాహన, దక్షుని కర్మ మార్గము

Questions & AnswersComments Off on లీలల గూర్చి అవగాహన, దక్షుని కర్మ మార్గము

 ప్రశ్న : అప్రకట లీల ఈ భూమి పైన నిఘాఢముగా సాధారణమైన వారికి అగుపించకుండా జరుగుతుందా లేక ఈ భూలోకానికి ఎంతో ఆవల గల గోలోకంలో జరుగుతుందా ? 

జవాబు : అప్రకట లీల అప్రకట ప్రకాశంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న,ఈ అప్రకట ప్రకాశము ఎక్కడ ఉంటుంది? దీన్ని ఒక విధముగా అర్ధము చేసుకొంటే అది ఆధ్యాత్మిక జగత్తు అని మనకు స్ఫురిస్తుంది. మనం దీన్నే 107వ అనుచ్ఛేదానికి వివరణలో చూస్తాము.  కానీ నిజానికి భౌతిక జగత్తు మరియు ఆధ్యాత్మిక జగత్తు అనేవి రెండూ వేరు వేరు కావు. ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ కూడా ఉంది. కానీ మనకు ఆ ఆధ్యాత్మిక చక్షువులు లేవు కాబట్టి మనం దానిని చూడలేము. మనకు జరిగే అనుభవాలన్నీ భౌతికమైనవే అందుకే మనం ఆధ్యాత్మిక జగత్తు అనేది మనకు ఆవల ఉండేది అని భావిస్తాము.  కానీ ఆ ఆవల ఉండేది కూడా ఇక్కడే ఉంది. మనకు దానికి తగ్గ జ్ఞానం ఉంటే దాన్ని మనం చూడగలము. ఇది మనం టీవిలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటే మనం కేవలం ఏ ఛానల్ నొక్కుతామో దాన్నే చూస్తాము. అక్కడ మనం మిగతా చానళ్ళు లేవనో లేక అవి ఉన్నా మనకు అగుపించకుండా ఉన్నాయి అని అనవచ్చు. అలానే మనకు అగుపించని గోలోకము కూడా ఇక్కడే ఉంది మరియు భక్త శిరోమణులైన శ్రీ జీవ గోస్వాముల వంటి వారు ఆ వృందావనాన్ని ఇక్కడే చూశారు. గొప్ప గొప్ప భక్తులు ఆ కనిపించని వృందావనాన్ని ఇక్కడే ఈ కనిపించే వృందావనములో ఉంటూ భావుకతతో చూసినట్లు చెప్పబడే ఎన్నో కథలు ఉన్నాయి. వారు ఆ భావుకతకు లోనైనప్పుడు వారు భౌతికంగా ఈ జగత్తు నుండి ఆ జగత్తులోనికి ఏమీ తీసుకు పోబడలేదు.

ప్రశ్న : శ్రీమద్ భాగవతము శ్రీల వ్యాసదేవుని సమాధి గ్రంథము- వైదుష ప్రత్యక్షమునకు తార్కాణము.” ఈ స్థితిలో చెప్పబడేది సిద్ధాంత పద్ధతిలో వ్యక్తమయ్యే దానికి భిన్నముగా ప్రత్యక్ష జ్ఞానము లేక ఆత్మ సాక్షాత్కారము వలే ఉంటుంది. నాకు వ్యాసదేవులు మరియు శుకదేవుల వారు భక్తియోగ దృష్టితో చూసి శ్రీమద్ భాగవతాన్ని వ్రాసారా అని తెలుసుకోవాలని ఉంది.

1) గతంలో జరిగినట్లు చెప్పారా?

జవాబు : అవును.

2) నిరంతరం జరుగుతున్నవి ప్రత్యక్షముగా చూసినట్లు చెప్పారా

జవాబు : అన్ని అవతారాల లీలలకు సంబంధించి ఇది నిజం.

3) కృష్ణ లీలలో పాత్రలుగా ఉండి వ్యాస లేదా శుకదేవ చూసినట్లు చెప్పారా?

జవాబు : అవును

ప్రశ్న : అది వారి యొక్క అనుభవ గ్రంథమా లేక వేరెవరిది అయినా ?

జవాబు : అది వారి స్వంత అనుభవమైనదే. ఇంకా చెప్పాలంటే అది వారి స్వంత అనుభవమైనప్పటికీ సాహిత్య రూపములో చెప్పబడింది. 

ప్రశ్న : భాగవతంలో వ్యాసదేవుడు లేక శుకదేవులవారు కృష్ణ లీలలో భాగమయినట్లు మరియు కృష్ణుడు వారితో సంవాదము చేసినట్లు చెప్పే వృత్తాంతాలు ఏమైనా ఉన్నాయా ?

జవాబు : వాటి గురించి భాగవతములో ఎక్కడా పేర్కొనబడలేదు. కానీ శ్రీమద్ భాగవతం 1.7.11 శ్లోకాల నుండి (ఉదాహరణకు “విష్ణు జన ప్రియః” గుణవాచకంగా నిత్యము అని పేర్కొనబడడం) శ్రీమద్ భాగవతం 10.12.39 (భాగవతీమ్ గతిమ్ అంటే భాగవతుడు అవ్వటం; అఘాసురుడు దానిని పొందినట్లయితే, శుకదేవులవారు దానిని పొందటం గూర్చి ఏమి చెప్పాలి? కైముత్య న్యాయం) శ్రీమద్ భాగవతం 10.12.44 ( శుకదేవులవారు శ్రీకృష్ణుని అవ్యక్త లీలలోకి వెళ్ళటం) శ్రీమద్  భాగవతం 12.12.68 వంటివి.

ఇక్కడ మనం గమనించవల్సిన విషయం శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం మూడవ అధ్యాయములో శ్రీల వ్యాసదేవుల వారు అవతారములలో ఒకరుగా చెప్పబడ్డారనేది.

ప్రశ్న : నాకు దక్ష యజ్ఞసమయములో భగవంతుని రాక మరియు తదనంతర సంఘటనల గూర్చి ఒక ప్రశ్న ఉంది. మీరు దక్షుడు విష్ణువునకు చేసిన ప్రార్థనలలో శివుని పరిహాసం చేసినట్లు చెప్పారు. అటువంటి స్వార్ధ ప్రార్థనలను భగవంతుడు ఎలా వినగలడు అలానే వాటి ఫలితముగా ఎలా  ప్రత్యక్షము కాగలడు ?  అలానే మీరు తన ముందు ప్రత్యక్షమైన భగవంతుని రూపము నిజమైనదని , సర్వోత్కృష్టమైందని నమ్మలేదని దక్షుడు అది మాయా రూపమని భావించాడని చెప్పారు. భగవంతుడు తన సర్వోత్కృష్ట రూపాన్ని ఆ రూపాన్ని నమ్మని మరియు భక్తుని కాని అతనికి ఎందుకు సాక్షాత్కారము గావించారు. ఉంకోవైపునుండి చూస్తే తన సర్వోత్కృష్ట రూపాన్ని భక్తులకు వారు భావాన్ని పొందే వరకు దర్శనం గావించరు. మీరు దయచేసి వివరించగలరా? దక్షుడు ఎటువంటి భావము ఉండటం చేత భగవంతుని ప్రత్యక్ష రూపాన్ని చూడగలిగాడు.

జవాబు : దక్షుడు భక్తుడు కాదు ఒక కర్మ యోగి. కర్మ యోగము కూడా భగవంతునిచే చెప్పబడింది ( శ్రీమద్ భాగవతం 11.20.6 చూడండి). దక్షుడు వేదములలోని కర్మ కాండలను నమ్మి వాటిని నిష్ఠగా పాటించాడు. అందుచేతనే అతను భక్తిని అర్ధం చేసుకోలేకపోయాడు. భగవంతుడు దక్షుని యజ్ఞ ఫలముగా ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే అతను కర్మ విధిని చక్కగా నిర్వర్తించాడు కనుక. కానీ దానర్ధం ఆయన దక్షునకు తన అనుగ్రహము ప్రసాదించాడని కాదు. అతనికి కేవలం ప్రాకృతిక హితము మాత్రమే జరిగింది, ఆధ్యాత్మిక హితము కాదు. అలానే ఈ భౌతిక జగత్తులో చాలామంది జనులు తమ తమ మంచి కర్మల వల్ల ప్రాకృతికముగా వృద్ధి చెందుతారు. 

మనం భక్తికి కర్మకు మధ్య గల వృత్యాసాన్ని అర్ధం చేసూకోగలగాలి. దక్షునికి భక్తి భావం లేకపోవటం చేత అతను ఆధ్యాత్మిక హితాన్ని పొందలేదు. కానీ కర్మ మార్గంలో చూస్తే అతను ఎంతో ఉన్నతుడు. దక్షుడు లాంటి వారు భగవంతుని చూసినప్పుడు ఆయన నిజరూపాన్ని చూడలేరు. వారు కంసుని వద్ద ఉన్న జనులు చూసినట్లు తమ తమ అవగాహన కొద్దీ చూస్తారు ( శ్రీమద్ భాగవతము 10.43.17 చూడండి). కృష్ణుని దేహము గట్టి రాయి వంటిది కాదు కానీ కంసుని మల్ల యోధులు ఆయన్ని అలా చూసారు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ప్రేమ మరియు భక్తితో జీవించాలనుకుంటున్నామా లేదా అసూయ మరియు ద్వేషపూరిత జీవితాన్ని గడపాలనుకుంటున్నామా అని ఎంచుకునే అవకాశం మనకు ఉంది. కాని ఈ ఎంపిక మరియు చర్యలు మన హృదయంలో ఉన్న భావముల అనుగుణంగానే జరుగుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.