వైదిక శాస్త్ర జ్ఞానానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య గల వృత్యాసం

GeneralComments Off on వైదిక శాస్త్ర జ్ఞానానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మధ్య గల వృత్యాసం

ప్రశ్న :  ఒక విజ్ఞాన శాస్త్ర పండితుడైన భక్తుడు నాకు శాస్త్రానికి ప్రత్యక్ష జ్ఞానానికి ఘర్షణ వచ్చినప్పుడు, ముఖ్యముగా ఖగోళ శాస్త్రం గూర్చి ప్రస్తావన వచ్చినప్పుడు ఆధునిక శాస్త్రాన్ని నమ్మాలి కానీ  మూఢంగా  అక్షరాలా శాస్త్రాన్ని నమ్మకూడదు అని చెప్పారు. ఇది నన్ను కలవరపెట్టింది. మనం  చంద్రునిమీద కాలుమోపడం గూర్చి, అలానే భూమి ఆకారాన్ని గూర్చి నాసా వాళ్ళు చెప్పే దాన్ని ఎందుకు నిజమని ఒప్పుకోవాలి?

జవాబు : అవును, అవసరం లేదు. కానీ మనకు కనిపించే విషయాలైన రాత్రి , పగలు , ఋతువులు మారే విధానం, సూర్య , చంద్ర గ్రహణాలు మొదలైనవాటిని వివరించగలగాలి. ఇంకో విషయం ఏమిటంటే సంస్కృతములో భూగోళము అనే పదం ఉంది,దానర్ధం భూమి గుండ్రముగా ఉంది అని. 

ప్రశ్న : శ్రీమద్ భాగవతం పంచమ స్కంధములో భూమండలం, జంబూ ద్వీపం, మరియు భారత వర్షములో మన స్థానము గూర్చి వివరించబడింది.  మహాభారతములో అర్జునుడు జంబూద్వీపములోని ఇతర వర్షములలోకి మరియు భూమండలం అంతా శ్రీకృష్ణునితో వెళ్లడం గూర్చి ప్రస్తావన ఉంది. మనం దీనిని కల్పితమని భావించాలా?

జవాబు : కాదు

ప్రశ్న : ఒక భక్తునిగా నేను శాస్త్రాన్ని విశ్వసిస్తాను గానీ , శాస్త్రవేత్తల వివరణలను కాదు. శాస్త్రములో ఎక్కడా కూడా మనం గూఢమైన విశ్వములో ఒక బంతిలా తిరుగుతున్న దాని మీద నివసిస్తున్నామని చెప్పబడలేదు. దానికి పూర్తి భిన్నముగా మనము దక్షిణ భాగ అంచున ఉన్న జంబు ద్వీపాన, తొమ్మిది వర్షములలో ఒకటైన భరత వర్షములో నివసిస్తున్నామని స్పష్టముగా చెప్పబడింది.

జవాబు :  ఇది పూర్తిగా సమ్మతమే, కానీ మీరు వేరే వర్షములు ఎక్కడ ఉన్నాయోకూడా వివరించాలి. ఏనుగు వంటి పరిమాణం గల జంబూ వృక్షం ఎక్కడ ఉంది? ఆ జంబూ ఫలాల రసముతో చేయబడి ప్రవహిస్తున్న జంబూనది ఎక్కడ ఉంది? పాల , సుర సముద్రాలు ఎక్కడ ఉన్నాయి ( భక్తులు పాల సముద్రముతో సంతుష్టులు అయితే భక్తి లేని వారు సుర సముద్రముతో సంతుష్టులు అవుతారు!) 80000 యోజనాల ఎత్తైన మేరు పర్వతము ఎక్కడ ఉంది? రాత్రి, పగలు గా మారే విషయాన్ని అలానే ఋతువులు ఆవిష్కరణకు గురి అయ్యే విధానాన్ని కూడా మనం వివరించాలి. ఇదంతా కూడా విశదీకరించాలి.

ప్రశ్న : ఈ వివరణలు అన్నీ ఉన్నతమైన యోగులకు కలిగిన సాక్షాత్కారాలని మరియు నాసా చెప్పేదంతా చూస్తే హేతుబద్దమైనది అనేది నా విశ్వాసాన్ని పటాపంచలు గావిస్తోంది. ” శ్రీమద్ భాగవతం సూర్యుని వంటి ప్రకాశము కలది, శ్రీ కృష్ణ భగవానుడు తన స్వధామమునకు అంతర్ధానమైన తరువాత ఉద్భవించినది, ధర్మము, జ్ఞానము లను సదా తన అనుంగులుగా కలిగి ఉన్నది. కలి ప్రభావము చేత అంధకారంలో మగ్గుతున్న వారికి భాగవతం  దిశా దివ్వెలను చూపించునది. కలియుగములో భ్రమిస్తున్న వారికి భాగవతములో చెప్పిన వివరణలు నిజాలు కానట్లయితే దిశా నిర్దేశం ఎలా జరుగగలదు?

జవాబు : మీరు పేర్కొన్న శ్లోకం అజ్ఞానంతో అంధకారంలో ఉన్న వారికి శ్రీమద్ భాగవతం వెలుగును ప్రసాదిస్తుందని చెప్పేందుకు వాడినది. ఇక్కడ ఖగోళ శాస్త్రం గూర్చి ఎక్కడా ప్రస్తావనలేదు. శ్రీకృష్ణుడు విశ్వము పుట్టుక గూర్చి చెప్పేందుకు రాలేదు. ఆయన ధర్మాన్ని(భగవద్గీత 4. 7, 4. 8) సంస్థాపన చేయడానికి వచ్చారు. ఆయన ఖగోళ శాస్త్రము లేక విశ్వ ఆవిర్భావ విషయాలను భోదించేదుకు వచ్చారని నేనెక్కడా చదవలేదు. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ధర్మాన్ని భోదించడమే దాని ఆవిర్భావ ముఖ్య ఉద్దేశం.  మీరు ధర్మశాస్త్రాన్ని గూర్చి చెప్పే పుస్తకంనుండి ఖగోళ శాస్త్రం నేర్చుకోవాలని ప్రయత్నిస్తే నిరాశ చెందుతారు. అది జీవ శాస్త్రం పుస్తకం నుండి భౌతిక శాస్త్రాన్ని నేర్చుకొనాలని అనుకోవటం లాంటిది. వ్యాస దేవుడు శ్రీమద్ భాగవతం

1.1.2 లో వేద్యం వాస్తవం అత్ర వస్తు మరియు 1.1.3 లో పిబత భాగవతం రసమాలయం అని అంటారు. ప్రతి శాస్త్రం ఆ శాస్త్రంలోని విషయాన్ని మరియు దానిలోంచి వచ్చే ప్రయోజనాన్ని మొదట్లోనే వివరిస్తోంది.  మనం దాన్ని శ్రద్ధగా చదివి, ఆ రెండు విషయాలను పరిగణనలోనికి తీసుకుంటూ శాస్త్రాన్ని చదవాలి. వ్యాసదేవుడు మొదటి అధ్యాయంలోని మూడు శ్లోకాలలో దాని గూర్చి చెప్పారు. ఇంకా ఈ రెండు విషయాల గూర్చి క్షుణ్ణముగా తెలుసుకోవాలంటే వ్యాస దేవుని సమాధి గూర్చి తెలిపే శ్లోకాలు 1.7.4-7 దయచేసి చదవండి.

శ్రీమద్ భాగవతం శ్రీ వ్యాసదేవుడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు పొందిన అనుభూతికి వివరణే. దీన్ని బాగా అర్ధం చేసుకోవాలంటే, శ్లోకాలు 2.10.1 మరియు 2.10.2 దయచేసి చదవండి. ఇక్కడ భాగవతంలో వివరించిన పది అంశాల గూర్చి వివరించబడింది. దీనిలో ఖగోళశాస్త్రం గూర్చి గానీ లేక విశ్వావిర్భవం గూర్చి గానీ చెప్ప లేదు. ఇంకా చెప్పాలంటే మొదటి తొమ్మిది విషయాలు అప్రధానమైనవి. అవి పదవ అంశమైన శ్రీకృష్ణుని గూర్చి విశదీకరించేందుకు మాత్రమే ఉపయోగపడేవి. శ్లోకం 2.10.2 లో చివరి అంశం గుర్తు ఉంచుకోదగినది. అది మనకు ఈ విషయాలు ప్రత్యక్షంగా కానీ లేక పరోక్ష్యంగా గానీ చెప్పబడ్డాయి అని వివరిస్తుంది. అంటే దానర్ధం భాగవతం లోనిదంతా అక్షరాలా వర్ణన కాదు. ఇది శ్రీమద్ భాగవతం 12.3.14 లోని వాచో విభూతీర్ న తు పారమార్థ్యం లో స్పష్టముగా చెప్పబడింది. భాగవతం ఏది వివరిస్తోందో చెప్పాలంటే, 12.13.12, 12.13.18,12.5.1 శ్లోకాలను పరిగణన లోనికి తీసుకోండి. పరీక్షిత్ మహారాజు నిజమైన సర్పము చేత లేక సంసార సర్పం చేత కాటు వేయ బడ్డాడా?( శ్రీమద్ భాగవతం 12. 13. 21). ఇవి స్వయంగా  భాగవతంలోని వివరణలే.

ప్రశ్న : ఈ భౌతిక జగత్తులో మనము గందరగోళంలో మునిగి ఉన్నాము , శ్రీమద్ భాగవతం కూడా ఇంకా గందరగోళాన్ని పెంచుతుందనే ఆలోచనను  నేను తట్టుకోలేను.

జవాబు : శ్రీమద్ భాగవతం ఎలాంటి గందరగోళానికి దారి తీయటంలేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసినది, భాగవతం మీ విశ్రాంతి సమయంలో  మీరు చదివి అర్ధం చేసుకొనే ఒక నవల కాదు. అది వ్యాసుల వారి చిట్ట చివరి రచన మరియు ఆయనకు కూడా ఉపశమనాన్ని ఇచ్చినది. సంస్కృత పండితులలో “విద్యావతాం భాగవ తే పరీక్షా” –  శ్రీమద్ భాగవతాన్ని ఎలా వివరించగలరు అనే దానిమీద ఒకరి విద్వత్త్వాన్ని పరీక్షించవచ్చు అనే నానుడి ఉంది. భాగవతం వేదాంత సూత్రాలకు వివరణ ఇచ్చేది అని చెప్పబడింది. వేదాంత సూత్రాలు ఉపనిషత్తుల సారాంశమును అద్భుతముగా వివరించే ఒక మహా రచన. అందుచేత అది స్వీయ అధ్యయనం చేత అర్ధమయ్యేది కాదు. అలానే భాగవతం యొక్క సందేశాన్ని అర్ధం చేసుకోవాలంటే ఒక అర్హుడైన గురువు వద్ద అధ్యయనం చేయాలి. శ్రీ జీవ గోస్వామి వారు భాగవతం యొక్క అర్ధాన్ని వివరించడానికి ఆరు సంపుటాల భాగవత్ సందర్భాన్ని రచించడం జరిగింది. ఆయన రచనలు కూడా ఇంకా విశదీకరించ వలసి ఉంది. అందుచేత భాగవతం గందరగోళమునకు దారి తీయటం లేదు, మనం దాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం సరిఐనది కాక పోవటం వల్ల మనం గందర గోళానికి గురి అవుతున్నాము.

ప్రశ్న : భరత వర్షమునకు ఉత్తరాన మిగతా వర్షములన్నీ నెలకొని ఉన్నాయి. శ్రీమద్ భాగవతం, మహాభారతము లో చెప్పినట్లు  గొప్ప వ్యక్తులు  కింపురుష, హరివర్ష, కేతుమాల మరియు ఇతర వర్షములకు ప్రయాణము చేసారు. ఇది మన పరిమితమైన జ్ఞానేంద్రియాలతో చూడలేము. ఆధునిక విజ్ఞాన శాస్త్రం భూమి యొక్క వక్రత్వాన్ని, భూభ్రమణాన్ని, చంద్రుని పై కాలు మోపడము లాంటి వాటిని  ఋజువు చేయలేదు. వీటికి ప్రత్యక్ష సాక్షం లేదా ఋజువు లేవు. నాకు అర్ధమైన దానిని బట్టి శ్రీమద్ భాగవతములో విశ్వానికి  గూర్చి చెప్పబడిన  వివరణలు, కొలతలు అన్నీ నిజాలే కానీ అవి మానవ మాత్రుని తర్కానికి అంతుపట్టలేనివి.

జవాబు : నేను మిమ్మలను మిగతా వర్షాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగినప్పుడు, నేను శాస్త్రాలను ఉటంకిస్తూ వచ్చే సమాధానాన్ని ఊహించలేదు, నేను అవి భౌగోళికంగా ఎక్కడ ఉన్నాయో వినాలి అని అనుకున్నాను. విమానాలు మరియు అంతరిక్ష నౌకల ఆవిష్కరణలతో మనకు భౌతిక శాస్త్ర నిజాల గూర్చి మనకు చాలా విషయాలు తప్పకుండా తెలుసు.

అర్జునుడు వేరే వర్షములకు వెళ్లినట్లు చెప్పబడినా, భరత వర్షము కానీ లేక వేరే వర్షములు ఏదైనా కానీ మనకు ఎందుకు  అగుపించటంలేదు . భారత దేశానికీ ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయని మనకు తెలుసు, అలానే వాటిని మనము చూడగలం మరియు హిమాలయాలకు ఉత్తరాన చైనా ఉంది. అదికూడా మనకు కనిపిస్తుంది. మీరు చెప్పిన ముఖచిత్రములో చైనా ఎక్కడ ఉంది ? అలానే ఆ కనిపించని వర్షాలు ఎక్కడ మొదలవుతాయి?  నేను అనేది ఏమిటంటే కొన్ని కనిపించే భాగాలు ఉన్నాయి, మరి కనబడనివి ఎక్కడ మొదలవుతాయి? అవి సరిగ్గా హిమాలయాల తర్వాత ఉన్నాయా? అయితే చైనా మీరు చెప్పిన దానిలో ఎందుకు లేదు? ఒక వేళ అది కాకపోతే చైనా భరత వర్షం లోని భాగమా? కాకపోతే అది ఎవరి భాగం?

ఏదైతేనేమిగానీ మీరు ఒక ముఖ్య అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పారు “అవి మన పరిమితమైన జ్ఞానేంద్రియాలతో చూడలేము”. ఇదే శాస్త్రానికి మరియు వైజ్ఞానానికి మధ్య గల వృత్యాసానికి పరిష్కారాన్ని చూపుతుంది.

ప్రశ్న : నేను పురాణాల్లో ఖగోళ శాస్త్రమును గూర్చి ఇవ్వబడిన వర్ణనలు ఆదిదైవికమైనవి అని విన్నాను, మీరు మీ వెబ్సైట్లో భాగవత పురాణము కావ్య రచనలను కలిగి యుందని వ్రాసారు. అందువల్ల దాని లోని కొన్ని భాగాలు సాహిత్య పరికరాలు కావచ్చు. ఆచార్యులు లేదా భాగవతులు కానీ పురాణ ఖగోళ శాస్త్రాన్ని ఆదిదైవికమని అన్నట్లు ఏదైనా ఉదాహరణలు ఉన్నవా ?

జవాబు : భాగవతంలో ఎక్కడా అలాంటి ప్రకటన చేయబడలేదు. అలా అని ప్రస్తావన కూడా లేదు. పరిశేషన్యాయం – శేషంగా మిగిలేదని అనే సూత్రము ప్రకారం దాన్ని అర్ధం చేసుకోగలం. అక్కడ చెప్పిన వర్ణనలు ఆదిభౌతికము కానే కాదు ఎందుకంటే అవి మన అనుభవాలకు ఏ మాత్రం సరి తూగవు. ఆదిభౌతికమంటే మన ఇంద్రియాలతో చూడతగ్గది. అలానే భాగవతం ప్రమాణం- యదార్ధమైన విజ్ఞానాన్ని ఇచ్చేది  కనుక అది తప్పు కానే కాదు. అందువల్ల ఈ వర్ణనలు ఆదిదైవికం లేదా ఆధ్యాత్మికం కావచ్చు.  అవి ఆధ్యాత్మికం కాదు ఎందుకంటే అవి ఈ భౌతిక జగత్తునకు సంబందించినవి కనుక. అందువల్ల శేష సూత్రం ప్రకారం అవి ఆది దైవికం మాత్రమే కావచ్చు. 

శ్రీమద్ భాగవతం ఒక వస్తువును గూర్చి మూడు స్థాయిలలో వివరిస్తుంది  మరియు వాటి గూర్చి పరోక్షంగా చెబుతుంది , అది మనం శ్లోకం 2.10.2 వంటి వాటిలో చూడవచ్చు. విశ్వము గూర్చి పంచమ స్కంధములో చేసిన వర్ణనలు యోగ దృష్టితో  చూసినప్పుడు కలిగిన జ్ఞానము. అవి యోగిపుంగవులైన శ్రీ శుకదేవుల వారిలాంటికి కలిగిన అనుభూతులు, సామాన్యులైన మనలాంటి వారికి కాదు. ఇది పతంజలి యోగసూత్రం (3. 26) భువన జ్ఞానం సూర్యే సంయమాత్, అనే దాని లో నొక్కి ఒక్కాణించబడింది. ” సూర్యుని పైన సయమము చేయడం వల్ల యోగులు అటువంటి జ్ఞానాన్ని పొంది విశ్వాన్ని చూడకలుగుతారు”. ఇక్కడ సయమము అంటే ధారణ, ధ్యాన మరియు సమాధి. అవి అష్టాంగ యోగములోని మూడు చిట్టచివరి ప్రక్రియలు. వ్యాసులవారు పంచమ స్కంధంలో చెప్పపడిన దాని గూర్చి  ఈ సూత్రము లాంటి ఒక పెద్ద వివరణ ఇచ్చారు.  ఇది భాగవతములోని వర్ణనలు మన సామాన్య ఇంద్రియములతో ఉహించలేనవని నిర్ధారణన చేస్తుంది. అందువల్ల భాగవతములో చెప్పిన దానినికాని అలానే ఆధునిక వైజ్ఞానానిక శాస్త్రం చెప్పేది కాని  తప్పని నేను భావించను. అవి రెండూ  రెండు భిన్న రంగాలకు చెందినవి.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    జీవితంలో విజయం సాధించడానికి ఇతరుల సహాయం మనకి కావాలి. అంటే ఇతరులను మనం నమ్మాలి. కానీ అనర్హమైన వారిని మనం నమ్మకూడదు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.