ప్రశ్న : రాగానుగ భక్తిలో రెండు రకాల సాధనలు ఉంటాయి అని నేను అర్ధం చేసుకొన్నాను.
1) సాధక రూప సేవ – జపము, గురు సేవ
2) సిద్ధ రూప సేవ – గురువు సిద్ధరూప జ్ఞానమును ఇస్తే శ్రీ రాధా రాణిని, శ్రీ లలితను సేవించడం.
రాగానుగ భక్తి మొదటి దశ(సాధక రూప సేవ), దీక్షతో ఆరంభవుతుంది. రెండవ దశ (సిద్ధ రూప సేవ)ను ఈ జీవిత కాలములో చేరుకోలేము. నేను అర్ధము చేసుకొన్నది సరిగ్గానే ఉందా?
జవాబు: అవును, కానీ ఇక్కడ గ్రహించాల్సినది ఏమిటంటే రెండవ దశ అనేది అనివార్యము కాదు. మొదటి దశ ఒక్కటే లక్ష్యాన్ని చేరటానికి సరిపోతుంది. రెండవ దశ గూర్చి కొందరిచే చాలా అసంబద్ధ ప్రేరేపణలు చేయబడ్డాయి. ఎందుకంటే దాని మానసిక లక్ష్యం తమ స్వతంత్రతను నిలుపుకోవాలనుకోడం. కానీ అలాంటి వారు సాధక రూప సేవ లేకుండా సిద్ధ రూప సేవ పని చేయలేదు అనే విషయాన్ని గ్రహించలేరు.
ప్రశ్న : లీలా స్మరణమనేది ప్రాపంచిక వాంఛలను ధ్వంసం చేస్తుందనే విషయం గూర్చి దయచేసి మీ భావనను తెలియచేయ గలరు, ఒక వేళ అది నిజమైతే దాన్ని మనం అవలంబించ వచ్చా?
జవాబు : మొదట భక్తి అంటే ఏమిటి అనే విషయాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. భక్తి అంటే మీరు మీ దేహ స్పృహ ( సూక్ష్మ మరియు స్థూల)ను కృష్ణుని పైకి మరల్చడం. ఇది గురు కృప లేకుండా సాధ్య పడదు. దీన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక గురువు యందు శరణాగతి లేకుండా, ఆయన కృప లేకుండా లీలా స్మరణమనేది ఎంత చేసినా దాని ప్రయోజనం లేదు. గురువు శరణాగతి లేనిదే , లీలా స్మరణమైనా లేక ఏ ఇతర సాధనైనా మీ అహంకారమును బలపరుస్తుంది. ఇది మీకు తొందరగా అగుపించక పోవచ్చు. మాయ అనేది చాలా కుయుక్తులు గలది. మామ్ ఏవ ప్రపద్యంతే …. ఒకరు తమల్ని తాము కోరికలను జయించినట్లుగా, గొప్పగా భావించవచ్చు. కానీ కోరికలనేవి మళ్ళా చాలా శక్తివంతముగా వారి మీద దండ యాత్ర చేస్తాయి. సౌభరి ముని విషయాన్ని చూడండి. ఆయన తనకు ఎటువంటి కోరికలు లేవనుకొన్నాడు. యమునా నదీ తీరములో నెలల తరబడి ధ్యానములో కూర్చొన్నాడు. కోరికలనేవి ఏమీ లేవు. కానీ ఒక రోజులో దాన్ని మొత్తాన్ని పోగుట్టుకొన్నాడు.
రాగానుగ అనే పదములోనే “అనుగ” అనే పదం ఉంది. గురువు లేకుండా లీలా స్మరణం అనేది చేస్తే, మీరు ఎవరి అనుంగులు? మీరు ప్రేమను ఎలా పొందగలరని అనుకుంటున్నారు? శాస్త్రములో చెప్పిన గురు పాదాశ్రయస్ తస్మాత్ …….. , తస్మాద్ గురుమ్ ప్రపద్యేత ……. , మొదలగు బోధనలను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, అలాంటప్పుడు దీన్ని రాగానుగమని ఎలా పిలుస్తారు? జనులు శాస్త్రాలను ఎంచుకొని చదువుతారు, దానిలో వారికి కావలసినది మాత్రమే స్వీకరించి కష్టమైనదాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ విధమైన సాధన ఫలితాన్ని ఇవ్వదు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.