ప్రశ్న : నాకు మీ పరంపరలో గౌర గదాధరుల ఉపాసనకు చోటుందా అని తెలుసుకోవాలని ఉంది. మనకు వారివురును కలసి పొగడుతూ ఎన్నో పాటలను వ్రాసిన నదియా భక్తులు తెలుసు. భక్తి వినోద ఠాకూరుల వారు మరియు ఆయన అనుంగులు కొంతమంది కూడా గౌర గదాధరులపై ధ్యానించే వారు. ఇంకో విషయం ఏమిటంటే, మీ పరంపర ప్రకారం గౌరగదాధరుల పూజ అనేది గోస్వాముల మరియు కవిరాజుల వంటి వారి భావముల ప్రకారం అనుసరణీయమైనదేనా? గోస్వాములు గదాధరుని రాధారాణిగా అంగీకరించారు అనే విషయం గూర్చి కొంత సాక్ష్యం ఉంది. కానీ నా ప్రశ్న వారు గౌర గదాధరులను కలిపి పూజించారా అని. నాకు తెలిసిన సంగతులను బట్టి (పద్యావళి / గ్రంథములు), వారివురూ కలిసి ఉన్నప్పుడల్లా గౌర మహాప్రభుని రాధా -భావము పెంపొందలేదు, అందుకే ఈ ప్రశ్న. నా ప్రశ్న సరైనది అని భావిస్తున్నాను.
జవాబు: మా పరంపర భూగర్భ గోస్వాముల వారినుండి వచ్చినది మరియు మేము గౌర గదాధరుల ఉపాసకులము. మహాప్రభుని రాధా భావమనేది గదాధరుని సమక్షములో ఉత్పన్నము అయ్యేది కాదు అనేది నిజము కాదు. మీకు ఈ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. నిజానికి జరిగింది దానికి పూర్తి విరుద్ధమైనది. అందుకే మహాప్రభుల వారు గదాధరుని జగన్నాథ పూరిలో ఉంచారు అలానే శ్రీ నిత్యానంద ప్రభుని తనని కలవవద్దని, బెంగాలంతటా భోధనలు చెయ్యమని చెప్పారు. మహాప్రభును “గదాధర-ప్రాణము” అనిఅంటారు. అయన ఎప్పుడూ గదాధరులతో ఉంటారు. ఆయన సమక్షములో రాధా భావము ఉత్పన్నము కాకపోతే ఇంకెవరి సమక్షంలో అది ఉత్పన్నమవుతుంది? మహాప్రభు వన్తావన్కు వెళ్లాలని అనుకున్నప్పుడు, ఆయన గదాధరులను తనతో రావద్దని అన్నారు ఎందుకంటే ఆయన కేవలం రాధా-భావంలో లీనమై పోకుండా యాత్ర కూడా చెయ్యాలి కనుక.
ప్రశ్న: నేను గౌర గదాధరులు ఒకే చోటన్నప్పుడు, మహాప్రభుని కృష్ణభావము లేక వ్రజ లీల ప్రత్యక్షమైనట్లు లేక ఆయన భక్తి భావమునకు లోనైనట్లు గల ఉదాహరణలను విన్నాను. ఈ విషయం గూర్చి ఇంకా చెప్పాలంటే, చైతన్య చరితామృతం అంత్య లీలలో మహాప్రభు రాధాభావ రసానుభూతి పొందు తున్నప్పడు గదాధరుడు తెరవెనుకనే వుంటూ, తోటా -గోపీనాథుని మందిరంలో విరహ వేదనను చెందటాన్ని చూస్తాము. ఆ సమయంలో మనం స్వరూప దామోదరుడు మరియు రామానందరాయ మహాప్రభుని అనుంగులుగా ఉంటూ వారుకూడా ఆనంద డోలికల్లో మునగడాన్ని మనం చూస్తాము. అందువల్ల గదాధరుడు మహాప్రభునితో ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ, మహాప్రభువు భక్తి పారవశ్యంతో మునిగి ఉండే కీలక సమయాల్లో ఆయన సాంగత్యం లేకుండా ఉండటాన్ని మనం చూస్తాము. కవిరాజ గోస్వాముల వారు మహా ప్రభుని మూడున్నర ఆప్త అంతరంగికుల ప్రస్తావనలో గదాధరుని పేరుని చెప్పరు.
జవాబు: గదాధర ప్రభు వెనుక వైపుకు పరిమతం కావటానికి కారణం ఆయన ఉనికి సైతం మహాప్రభునిలో రాధా భావాన్ని ప్రేరేపిస్తుంది కనుక. అయన మహాప్రభునికి ఉద్దీపనము లాంటి వారు. అందుకే ఆయన మహాప్రభువుకి దూరం అయ్యి ఆ విరహ బాధను అనుభవించేవారు. ఇంకోవిషయం ఏమిటంటే, స్వయంగా గదాధరులే మహాప్రభుని దర్శనములో కృష్ణుని దర్శిస్తూ భావోద్వేగాన్ని చెందేవారు. మహాప్రభుని అనుంగులకు ఆయన భావాన్ని అర్థం చేసుకోవటము కష్టతరంగా మారింది మరియు ఆయన్ని శాంతపరిచేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో గదాధరులు కూడా ఆయనతో చేరితే పరిస్థితి ఇంకా అంతకన్నా కష్టతరముగా ఉండేది.
ప్రశ్న : గౌర-నితాయిలను మరియు గౌర-గదాధరులను పూజించే భావము, అర్హత మరియు లక్ష్యములో ఉన్న వ్యత్యాసం ఏమిటి ?
జవాబు: పంచతత్వాలలో మహాప్రభుని కుడివైపున నిత్యానందుల వారు ఉంటారు. ఆయన స్వయంగా బలరాముడే. బలరాముడు సఖ్య భావాన్ని వాత్సల్య మరియు దాస్య భావాలతో పాటు కలిగి ఉంటారు.
మహాప్రభుని ఎడమ వైపున గదాధర పండితుల వారు ఉంటారు, ఆయన శ్రీమతి రాధారాణి కన్నా భిన్నమైన వారుకారు. శ్రీమతి రాధారాణి మాధుర్య రసానికి మూలము. అందువల్ల గౌరలీలలో, మాధుర్య రసములో మునిగి ఉండే భక్తాగ్రేసరులకు ఆయన నాయకత్వం వహిస్తూ ఉంటారు. అందుచేత ఎవరి లక్ష్యం కృష్ణ ప్రేమను మాధుర్య భావనతో పొందాలని అనుకొంటారో వారు గౌర-గదాధరులని పూజిస్తారు.
ఎవరైతే పంచతత్వ మంత్రాన్ని పఠిస్తారో లేక పంచతత్వ విగ్రహ మూర్తులను పూజిస్తారో అట్టివారు సహజముగానే గౌర-గదాధరులను పూజిస్తున్నట్లే. అయితే వారు అవగాహన లేకుండా చేస్తుండవచ్చు.
గదాధర పండితుల వారు మహాప్రభువు అంటే మిక్కిలి ప్రేమకలిగి ఉన్న వారు. ఆయనకు మహాప్రభువు మీద ఉన్న ప్రేమ నిత్యానందుల వారు మరియు అద్వైత ఆచార్యుల కన్నా స్పష్టముగా ఎక్కువైనది. అందుచేతనే పంచతత్వముల అందరిలోకి ఆయనే మహాప్రభుని స్థిరమైన అనుంగుడు. ఆయన నవద్వీప లీలలో అలానే నీలాచల లీలలో రెండు చోట్లా ఉంటారు. ఆయన రాధారాణి కన్నా భిన్నము కాదు కాబట్టి, కృష్ణుండంటే అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. ఆయన భక్తిశక్తికి ప్రతిరూపము. శ్రీ గదాధర గోస్వాముల వారు మహాప్రభుని ఆంతరంగిక భక్తులలో ముఖ్యులు.
అయితే దాని ఉద్దేశ్యము గౌర-నితాయిల పూజను అలక్ష్యము చేయాలనో లేక గౌర- పూజించేవాళ్లను అవహేళన చెయ్యాలనోకాదు. అటువంటి మనస్తత్వం గర్హనీయమైనది. అటువంటి మనస్సు కలిగి ఉండటాన్ని శ్రీ గదాధర పండితులవారు ఆహ్వానించరు.
చైతన్య భాగవతములో ఇలా చెప్పబడింది:
గదాధర-దేవేర సంకల్ప ఎయ్ రూప
నిత్యానంద నిందకేర న దేఖేన ముఖ
నిత్యానందుల వారిని అవమానించిన ముఖాన్ని చూడను అనేది గదాధరుల వారి ప్రతిజ్ఞ.
నిత్యానంద స్వరూపురే ప్రీతి యర నని
దేఖ ఓ న దేన తరే పండిత గోసాయి
నిత్యానందుల వారంటే ప్రేమలేని వారిని చూడటానికి కూడా గదాధర పండితుల వారు ఇష్టపడరు.
(చైతన్య భాగవతం, అంత్య లీల 124-125)
గదాధర శుభ దృష్టి కరేన యహరే
సే జనితే పరే నిత్యానంద స్వరూపేరే
ఎవరైతే గదాధరుని కృపాకటాక్షాలను పొందగలుగుతారో వారు నిత్యానందుని స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు.
నిత్యానంద –స్వరూపో యహరే ప్రీత మనే
లావోయయేన గదాధర జనే సెయ్ జానే
ఎవరితోనైతే నిత్యానందులవారు సంతుష్టి చెందుతారో అట్టి వారు గదాధరుల వారిని తెలుసుకోగలరు.
(చైతన్య భాగవతం, అంత్య లీల 7,161-162)
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.