ప్రశ్న : సాలోక్యమును పొందగలిగే సామాన్య భక్తిని దీక్ష లేకుండగా కూడా పొందవచ్చని మీరు అంటుండగా నేను విన్నాను. సామాన్య భక్తి ఈలోకంలో ఎలా ప్రస్ఫుటం అవుతుంది మరియు దానిని సాధన చేసే సాధకుడిని అది ఏ స్థితి వరకు తీసుకు వెళ్లగలదు?
జవాబు: సామాన్యమనే పదానికి సాధారణమని అని అర్ధం. ఆ పదానికి గల అర్ధం బట్టి అది ఏ తరహాకు చెందనిది అని అర్ధం వస్తుంది. “తరహా” అని అంటే భగవంతునితో గల ప్రత్యేక సంబంధం. సామాన్యమంటే మరొక అర్ధం ప్రాధానికమైనది లేక సాధారణమైనది అని. ఆ విధముగా, భక్తికి గల సహజ లేక సాధారణ లక్షణమైన శరణాగతిని అది సూచిస్తుంది.
ప్రశ్న : అది దాస్యము కూడా కావచ్చా లేక అది కేవలం శాంతమేనా?
జవాబు: సామాన్యం దాస్యము కాదు. ఐదు రకాలైన ప్రాధమిక భక్తి రకాలలో అది కేవలం శాంతమే అవుతుంది.
ప్రశ్న : సామాన్య భక్తి అనేది దీక్ష (గురువు నుండి ఒక ప్రత్యేక భావమును స్వీకరించుటకు పూర్వభావిగా ఉండేది) లేకుండా పొందగలిగితే, నిష్కళంకమైన భక్తిని చేయాలి అనే ప్రేరేపణను ఒకరు ఎలా పొందగలరు?
జవాబు: భక్తి చేయుటకు ప్రేరేపణ, భక్తుల సాంగత్యమువలన వస్తుంది. సామాన్య భక్తికి ప్రేరణ ఇతర సామాన్య భక్తుల సాంగత్యము వలన వస్తుంది.
ప్రశ్న : అంటే దానర్ధం భక్తి వివిధ రూపాలలో ఉన్నదని, అలానే అవన్నియూ కృష్ణుని స్వరూప శక్తిలో స్థాపితమై ఉన్నాయని కదా. ఈ అవగాహన సరైనదా?
జవాబు. అవును. అన్ని రకాల భక్తి భగవంతుని అంతరంగ శక్తులే. కపిల దేవుడు భక్తిని సాత్విక,రాజసిక లేక తామసిక మని చెప్పినప్పుడు దానర్థం భక్తి తామసికమని, రాజసికమనీ, లేక సాత్వికమనీ కాదు. భక్తి సాధన చేసేవారి ఉద్దేశ్యము అటువంటిదని అర్ధము. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశ్యం సత్వ, రాజసిక లేక తామసిక గుణాల మీద ఆధారపడి ఉంటుంది కనుక భక్తికి ఆపేరు ఆపాదించడం జరుగుతుంది. కానీ నిజానికి భక్తి స్వతహాగా ప్రాకృతిక గుణాలకు ఆవల ఉంటుంది.
ప్రశ్న: మరైతే ఇటువంటి భక్తికి గల అధికారము ఏమిటి ?
జవాబు: దానికి శ్రద్ధయే అధికారము.
ప్రశ్న: ఇటువంటి భక్తిలో కూడా ఒకరు శాస్త్రీయ శ్రద్ద కలిగి ఉండాల్సిన అవసరం ఉందా?
జవాబు: ఆ అవసరం లేదు.
ప్రశ్న : బృందావనంలో సామాన్య భక్తితో పరిపూర్ణత పొందిన శాంత భక్తులు ఉన్నారా? లేక అది కేవలం వైకుంఠం లోని వారికి మాత్రమే పరిమితమే?
జవాబు : శ్రీ రూపగోస్వాముల వారు భక్తి రసామృత సింధువులో దాన్ని నిర్వచించారు మరియు మూడు లేక నాలుగు సంవత్సరాల వయస్సు గల బాలికలను ఉదహరించారు. సాధనతో దాన్ని పొందిన వారి ఉదాహరణ నాకు తెలియదు. ఇది ప్రాథమికంగా వైకుంఠమునకు వర్తిస్తుంది.
ప్రశ్న : మరి అలా అయితే వృందావనములో శాంత రసమును ఎలా పొందవచ్చు?
జవాబు: వృందావనములో ఉన్న ఇతర శాంత భక్తుల సత్సంగముతో మరియు వారి ఉపదేశ్యముతో.
ప్రశ్న : సామాన్య భక్తితో వైకుంఠమును పొందిన వారి ఉదాహరణలు శాస్త్రాలలో ఉన్నాయా?
జవాబు: బ్రహ్మ మానసపుత్రులైన సనకాదులు శాంత భక్తికి ఉదాహరణగా చెప్పబడ్డారు. శ్రీమద్ భాగవతము ఆరవ స్కంధములో అజామిళుని ఉదాహరణ కూడా సామాన్య భక్తికి చెందుతుంది. తొమ్మిదో స్కంధములోచెప్పబడిన రాజులు కూడా ఈ తరహాకు చెందుతారు.
ప్రశ్న : నాకు భక్తియోగ మరియు శరణాగతి గూర్చి ఒక ప్రశ్న ఉంది. శ్రీ సాంప్రదాయములో భక్తి యోగము మరియు శరణాగతి రెండుగా విభజన చేయబడ్డాయి. అలానే శ్రీ సాంప్రదాయములో బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులు, శూద్రులు మినహా మాత్రమే భక్తియోగమును చేయటానికి అర్హులు అని చెప్పబడింది. అలానే శ్రీ సాంప్రదాయములో మహిళలు భక్తి యోగమును చేయుటకు అనర్హులుగా చెప్పబడింది. శరణాగతి మాత్రమే అందరూ మోక్షమును పొందుటకు మార్గమని శ్రీ సాంప్రదాయములో చెప్పబడింది.
కానీ గౌడీయ సాంప్రదాయములో, భక్తి మార్గము లేక భక్తి యోగము అందరికీ అర్హమైనదని చెప్పబడినది. అలానే గౌడీయులు భక్తిని శరణాగతినుండి వేరు చేయడాన్ని నేనెప్పుడూ చూడలేదు.
జవాబు : లేదు ,గౌడీయులు శరణాగతిని మరియు భక్తిని ఎప్పుడూ వేరు చేయరు. మనకు శరణాగతి భక్తిలో భాగమే. మనం పుట్టుక, లింగ లేక సామాజిక స్థితిని బట్టి వృత్యాసము చూపించము. భక్తిని చేయుటకు అందరూ అర్హులే. దానికి కావాల్సిన అర్హత శ్రద్ద లేక శాస్త్రము మీద నమ్మకం. ఎవరికైతే శ్రద్ద ఉంటుందో వారు భక్తిని చేయగలరు.
శ్రీ సాంప్రదాయములో భక్తిని శరణాగతి నుండి వేరు చేయుటకు గల కారణం భక్తి వర్ణాశ్రయ ధర్మములో ఉన్నవారికి మాత్రమే అని చెప్పుట. వారికి వర్ణాశ్రమ ధర్మమములను త్యజించుట సూచించబడలేదు. వర్ణాశ్రమ ధర్మములో లేని వారు శరణాగతిని స్వీకరించవచ్చు. వారి దృష్టిలో గౌడీయులు సాధన చేసే భక్తి, భక్తి యోగము కాదు శరణాగతి మాత్రమే.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.