కలియుగాన్ని సైతం కీర్తించదగినదిగా చేయగల శక్తి కీర్తనకు ఉంటే, దానిని ఇతర యుగాలలో ఎందుకు తెలుపలేదు? కేవలం కలియుగంలోనే కీర్తన ఎందుకు ప్రచారం చేయబడుతుంది? కలియుగంలో ఉన్న బద్ధజీవులను మాత్రమే ఉద్ధరించగల శక్తి కీర్తనకు ఉందా? ఒకవేళ అలా ఐతే, దానికి కారణము ఏమిటి? ఒకవేళ అలా కాకపోతే, ఇతర యుగాలలో మానవాళి కీర్తనను ఎందుకు ఆశ్రయించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం భక్తి సందర్భములో 272వ అనుచ్ఛేదములో లభిస్తాయి, వాటిని క్రింద మనము పరిశీలిద్దాము.
272వ అనుచ్ఛేదము
తరువాతి శ్లోకంలో కరభాజన ముని ప్రత్యేకంగా కీర్తన యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తారు:
ఈ భౌతిక జగత్తులో పరిభ్రమించే మనుష్యులకు, పరమ శాంతిని చేకూర్చి జననమరణ సంసారంనుండి విముక్తి కలుగజేసే సంకీర్తన కంటే ఉత్తమమైన హితము మరొకటి లేదు. (భాగవత పురాణం 11.5.37)
అతః “దీని కంటే” అను సర్వనామానికి అర్థం, భగవంతుని నామములను గానం చేయడం(కీర్తన). యతః “దేనితో ఐతే” అంటే కీర్తనతో అని అర్థం. పరమామ్ శాంతిమ్ “పరమ శాంతి” అనే పదాలు శ్రీ కృష్ణుడు వివరించిన ఈ స్థితిని సూచిస్తున్నాయి: “స్థిరమైన మానసిక శాంతి(శమము) నాయందు బుద్ధిని నిలుపుట” (భాగవత పురాణం 11.19.36). ఈ నిర్వచనం ప్రకారం పరమామ్ శాంతిమ్ అంటే కీర్తనవలన ఒకరికి ధ్యానాది సాధనముల ద్వారా కూడా సాధ్యంకాని స్థిరమైన భావం(భవగన్-నిష్ఠ) భగవంతునిపై కలుగుతుందని. తద్వారా ఒకరి భౌతిక బంధనాలు(సంసారం) కూడా అంతమౌతాయి. కాబట్టి, సత్యయుగంలో మనుషులుకూడా, ధ్యానావస్థలో స్థిరంగా ఉన్నప్పటికీ భగవంతునిపై నిష్ఠను సాధించలేకపోయారు.
స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది: “కలియుగంలో ఉన్నత అనుభవముగల భక్తులు(మహా భాగవతులు) నిరంతరముగా కీర్తన చేయుదురు.” ఈ వాక్యం ప్రకారం, భగవంతునిపై అలాంటి నిష్ఠకు కారణం కీర్తన. ఇతర యుగాలలో భౌతిక కోరికలులేని దీనులకు ప్రత్యేక అనుగ్రహం ప్రసాదించే భగవంతుడు ఆ యుగాలలో మనుషులకు ఉన్న శక్తిసామర్థ్యముల వలన కీర్తన యొక్క ప్రాముఖ్యతను చూపలేదు. అందుకని, ఆ యుగాలలో ధ్యానాది సాధనలకు అర్హులైన మనుషులు కేవలం నాలుక మరియు పెదవుల కదలికలతో చేసే కీర్తనను ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించేవారుకాదు, తద్వారా వారికి దానిమీద శ్రద్ధ ఉండేదికాదు.
వ్యాఖ్యానం
సవాళ్ళను ఎదుర్కోవడం అహానికి సహజమైన లక్షణం. కష్టతరమైన మరియు సాహసమైన పనులు సాధించుటద్వారా అది తుష్టి పొందుతుంది. మనుషులకు అసాధారణ భౌతిక మరియు మానసిక సామర్థ్యములు ఉన్నప్పుడు వినయంతో ఉండడం సులభంకాదు. వారి అహంకారము కీర్తన వంటి సులభమైన ఆధ్యాత్మిక సాధనతో సంతృప్తి చెందలేదు. కీర్తన ఒక ఆధ్యాత్మిక సాధనమని కూడా వారు నమ్మలేరు. ఈ కారణంచేత ఇంతకముందు యుగాలలో కీర్తన ప్రచారం చేయబడలేదు. ఇంతకముందు చెప్పినట్లు, కలియుగంలో మనుషులకు మునుపటి యుగంలోవారివలె శారీరక మరియు మానసిక సామర్థ్యములు లేవు. వారు కఠోర తపస్సు చేయడానికి లేదా శ్రద్ధగా విస్తృతమైన వైదిక కర్మకాండ చేయడానికి అసమర్దులైనందున తమ శ్రద్ధను కీర్తనయందు ఉంచవచ్చు.
నేను ప్రపంచవ్యాప్తంగా పర్యటించాను మరియు చాలా మందిని కలిసాను కానీ నిజమైన ఆనందం కలిగిఉన్న వ్యక్తిని ఇంకా ఒక్కరిని కూడా కలవలేదు. ఆనందం భక్తిద్వారా లభిస్తుంది. ఆనందం మీలోనుండి వస్తుంది. ఆనందం కృష్ణుడినుండి వస్తుంది.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.