ప్రశ్న : మనం భిన్న అభిప్రాయాలను పరిష్కరించుకొనేందుకు ఏ ఆచార్యులను శిరోధార్యమైన ప్రామాణికంగా తీసుకోవాలి?
జవాబు : చైతన్య మహాప్రభువు మన సంప్రదాయానికి స్థాపకులు. అందువల్ల శ్రీ చైతన్య మహాప్రభువుల వారు శిరోధార్యమైన ప్రామాణికమైన వారు. కానీ ఆయన ఇతర సంప్రదాయాలలోలాగా, ఉదాహరణకు శ్రీ రామానుజాచార్యుల వలే తత్వశాస్త్రాన్ని బోధించే రచనలు చేయలేదు. ఆయన స్వయంగా శ్రీ రూప , సనాతన గోస్వాముల వారికి బోధించారు, వారు ఆ బోధననుల అనుసరించి చాలా గ్రంధాలు రచించారు. అందువల్ల వారు మన నిజమైన ప్రామాణికులు. వారి తర్వాత శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి మరియు శ్రీ జీవ గోస్వామి వారిని అనుసరించారు. వీరందరూ ఏమి చెప్పారో అదే మన సిద్ధాంతము ఎందుకంటే వారు శ్రీ చైతన్యా మహాప్రభువుల వారితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు కనుక. శ్రీ జీవ గోస్వామి చైతన్య మహాప్రభువును ప్రత్యక్షముగా కలవలేదు కానీ ఆయన శ్రీ రూప గోస్వాముల వారి శిష్యుడు అలానే స్వయాన సోదరుని కుమారుడు కూడా. వారితో కలసిఉన్నవారు ఎవరైనా ఉదాహరణకు శ్రీ కృష్ణ దాస కవిరాజుల వంటి వారు కూడా ప్రామాణికంగా అంగీకరించబడ్డారు.
ప్రశ్న: షడ్ గోస్వాములు మహాప్రభుని అప్రకట లీల గూర్చి ఏమి అనలేదు, మరట్లయితే మీరు చెప్పిన వివరణను ఎలా అన్వయించుకోవాలి? గోపాల గురు , ధ్యానచంద్ర, విశ్వనాథ చక్రవర్తి లాంటి సాధువులెందరో అప్రకట లీల గూర్చి ప్రస్తావించారు కానీ షడ్ గోస్వాములు ఈ విషయం గూర్చి ఏ విధమైన ప్రకటన చేసినట్లు నాకు తెలియదు. అద్వైత పరివారములోని భక్తులు అభావ ప్రమాణము ఆధారముగా గౌర అప్రకట లీల లేదని అనే వారు నాకు తెలుసు. మీరు గోస్వాముల గ్రంధములు ఉత్కృష్ట ప్రమాణముగా తీసుకొంటే, వారు దీని గూర్చి బహిరంగముగా మాట్లాడ లేదు కాబట్టి గౌర అప్రకట లీల ఉన్నట్లు మనము ఎలా నిరూపించగలము?
జవాబు : రూప , సనాతన మరియు జీవ గోస్వాముల వారు గౌర ప్రకట లేదా అప్రకట లీలల గూర్చి ఏవిధమైన రచనలు చేయలేదు. వారు చైతన్య మహాప్రభువును స్తుతిస్తూ కొన్ని శ్లోకాలు రచించారు కానీ మహాప్రభుని లీలను వివరిస్తూ ఏ గ్రంధము వ్రాయ లేదు. కానీ వారి రచనల నుండి రామ మొదలైన అవతారాలన్నింటికీ వారి ఆధ్యాత్మిక నివాసము ఉన్నదని మనకు తెలుస్తుంది. అవతారమనే పదానికి దిగిరావటం అనేది అర్ధం, అంటే వారు భౌతిక జగత్తులోనికి దిగి వచ్చారు అని స్ఫురిస్తుంది. అంటే వారు ఆధ్యాత్మిక జగత్తులో ఉండబట్టే ఇది సాధ్యపడింది. ఎన్నో శ్లోకాలలో గోస్వాములు మహాప్రభువు అవతార స్వరూపుడు అని చెప్పటం జరిగింది. అంటే దానర్ధం , ఆయనకు స్వీయ నివాసము ఉందనే, అలాకానట్లయితే అవతారమనే పదం పెడదారి పట్టించేది లేక అర్ధం లేనిది అవుతుంది.
అయితే, ఇక్కడ కొందరు దేవతలైన ఇంద్రుడు లాంటివారు కూడా ఆరాధించ గల వారిగా చెప్పబడ్డారు కదా అని ప్రశ్నించవచ్చు. కానీ వారు భౌతిక కోర్కెలు తీర్చుకోవడానికి మాత్రమే అలా చెప్పపడ్డారు. వారిని ముక్తి లేక కైవల్యం పొందేందుకు ఆరాధించమని ఎక్కడా చెప్పలేదు.
వేదాలు ఉత్కృష్ట ప్రమాణాలు. కానీ వేదాలలో చాలా విషయాలు పూర్తిగా వివరించబడలేదు. అటువంటి విషయాల గూర్చి మనం పురాణాలు మరియు ఇతిహాసాలనుండి నుండి అర్ధం చేసుకొంటాము. అలానే షడ్ గోస్వాముల నుండి అర్ధం చేసుకోలేని విషయాలను మనం వారి తరువాత ఆచార్యులైన శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వంటి వారి నుండి అర్ధం చేసుకోగలం. నేను రూప , సనాతన మరియు ఇతర గోస్వాములు ప్రమాణములంటే దానర్ధం వారన్నది లేక వారన్నదానికి సమానంగా ఉన్నదంతా సరి అయినదే. వారిని విభేదించేది ఏదైనా సరి అయినది కాదు. అందువల్ల తర్వాత ఆచార్యులైన శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వంటి వారు మహాప్రభు ప్రకట లీల ఉన్నదని అంటే, అది ఆమోదయోగ్యమైనదే ఎందుకంటే అది మన పూర్వాచార్యులను ఎక్కడ కూడా విభేదించదు ఇంకా చెప్పాలంటే మిగతా అవతారముల గూర్చి చెప్ప పడిన వ్యాఖ్యలకు సరిగ్గా సరిపోతుంది కూడా.
అభావ ప్రమాణమనే దాన్ని నేను ఎప్పుడూ వినలేదు. కావున మీరు దాన్ని ఎలా వాడాలని అనుకొంటున్నారో అనేదాని మీద నాకు స్పష్టత రాలేదు. నాకు పూర్వ మీమాంస తెలుసు మరియు అద్వైత వేదాంతము అనుపలభ్ది ప్రమాణాన్ని స్వీకరిస్తుంది. కానీ మీరు వాడిన విధము ప్రకారం అది ప్రమాణము కానేరదు. గోస్వాములు గౌర ప్రకట లీల గూర్చి వ్రాయలేదు. అంటే అభావ ప్రమాణం ప్రకారం గౌర ప్రకట లీలను కూడా తిరస్కరించాలి. అది ఎలా ఉంటుందంటే నేను కృష్ణుని చూడలేదు (అభావ ) కాబట్టి కృష్ణుడే లేడు అనడం లాంటిది.
అయితే ఇలాంటి తర్కం కేవలం మన చూపుకు ఆనే వస్తువుల మీద మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు , మనం ఒక పుస్తకాన్ని టేబుల్ మీద చూడకపోతే పుస్తకము కనిపించటం లేదు కాబట్టి మనం అక్కడ పుస్తకం లేదు అనే విషయం అర్ధం చేసుకోగలం. కానీ ఇదే సూత్రాన్ని మన నేత్రాలతో చూడలేని వాటిమీద వాడలేము. ఉదాహరణకు మన గదిలో ఉన్న గాలిని చూడలేము కనుక అక్కడ గాలే లేదని అనలేము. ఎందుకంటే మన కళ్ళకు గాలి కనిపించదు కాబట్టి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.