ప్రశ్న : నేను శ్రీ జీవ గోస్వాముల వారు వ్రాసిన సందర్భములలో శ్రీకృష్ణుడు జీవుల కర్మ క్రియలలో ప్రత్యక్షంగా పాలు పంచుకోడని అది నిజానికి ఆయన అంశమైన పరమాత్మ ద్వారా జరుగుతుందని చదివినట్లు గుర్తు. అది నిజమేనా? అయినట్లయితే దాని గూర్చి సమాచారమును ఇవ్వగలరు.
ఒక వేళ అది సిద్ధాంతమైతే, మనం కృష్ణుని ప్రార్థిస్తే, మన ప్రార్థనలను స్వయముగా కృష్ణుడే వింటాడా లేక పరమాత్మా?
జవాబు: జీవులు రెండు రకాలు: భక్తులు, భక్తులు కానివారు. భక్తులు కాని వారు పరమాత్ముని పరిధిలో ఉంటారు ఎందుకంటే పరమాత్మ తటస్థ శక్తికి అధ్యక్షుడు. ఒకరు భక్తి మార్గాన్ని అనుసరించడం ప్రారంభిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు (లేక వారి వారి ఇష్ట దైవం) స్వయముగా పరమాత్ముని భాధ్యతను తీసుకొంటాడు, ఎందుకంటే భక్తి అనేది అంతరంగ శక్తి మరియు దాని నిర్వాహణ అధికారి శ్రీకృష్ణుడే. అందుకే భక్తులు కర్మ ఫలం నుండి ముక్తులు అని అంటారు. కర్మ అనేది పరమాత్ముని పరిధిలో ఉండేది. భక్తులు చూడటానికి బాధ లేక సుఖమును ఇతరులు పొందినట్లే పొందుతున్నప్పటికీ అది కర్మ వల్ల వచ్చేది కాదు అది కృష్ణుడు తన భక్తులు భక్తిలో పరిపక్వతను పోందేందుకు చేసే సదుపాయము మాత్రమే.
కానీ ఆయన అది కర్మ వలే అగుపించేటట్లు చేస్తాడు, అలా చేయడం భక్తిని అసాధారణమైనదిగా చూపించాలని కాదు, అర్హత లేని వారు భక్తి మార్గములోనికి ప్రవేశం లేకుండా చెయ్యడం కోసం. ఇది మీరు ప్రార్థన గూర్చి అడిగిన ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినదని నేను భావిస్తున్నాను. దీనికి మూలం పరమాత్మ సందర్భము మొదటలో ఉంది
చాలామంది భౌతిక విషయాలలో చాలా చాకచక్యంగా ఉంటారు కానీ ఆధ్యాత్మికవిషయాలలో మందకొడిగా ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక విషయాలలో చాకచక్యంగా ఉండి భౌతికవిషయాలలో మందకొడిగా ఉంటారు. రెండు విషయాలలో నేర్పుగా ఉండడం కోరదగినది, కానీ ఒకవేళ రెండింటిలో ఏదోఒకదాన్ని ఎంచుకోవలసివస్తే రెండవది ఉత్తమము.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.