ప్రతిష్ఠ అంటే “కీర్తి, ఖ్యాతి, ప్రాముఖ్యత, ఉన్నత స్థానం” మొదలైనవి. మనందరికీ దాని యందు ఆసక్తి ఉంటుంది. మనం దానికొరకు పని చేస్తాం, అలానే దానిని పొందటంలో ఎంతో సంతోషానికి గురి అవవుతాము. కొంతమందికి వారి జీవితంలో ఇదే ప్రధాన చోదక శక్తి. వారు వారి జీవితాలను సయితం వారి ప్రతిష్ఠకో, దేశ ప్రతిష్ఠకో, వారి క్రీడా జట్టు కొరకో పణంగా పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు.
అయితే వైష్ణవ జీవితాల్లో, ముఖ్యముగా గౌడీయ వైష్ణవ సమాజములో “ప్రతిష్ఠ” అనేది ఒక భయంకరమైన పదం. ప్రతిష్ఠ గురుంచి జన బాహుళ్యములో బాగా పరిచయమైన సామెత “ప్రతిష్ఠా –సూకరీ విష్ఠా” అంటే ప్రతిష్ఠ పంది మలంతో సమానం అని అర్థం. ఇక్కడ పంది అంటే వీదుల్లో తిరిగే పంది. ఈ పందులు మానవ విసర్జనాలను తిని జీవిస్తుంటాయి. మలం శరీరం యొక్క అత్యంత అసహ్యకరమైన ఉత్పత్తి, కాబట్టి ఇతరుల విసర్జనను తిని బ్రతికే పంది–మలం కంటే అసహ్యకరమైనది ఏమి ఉందగలదు?
ప్రతిష్ఠను వైష్ణవులు ఎందుకు అసహ్యించుకుంటారు? కీర్తి, ప్రాముఖ్యత మరియు ప్రతిష్ఠలో తప్పేంటి? అవి చాలా అసహ్యకరమైనవి ఎందుకంటే అవి వైష్ణవ స్వభావానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. వైష్ణవులు తమను తాము అందరికీ దాసునిగా (సేవకుడు) గా భావిస్తారు. వైష్ణవులు తమను తాము దాసానుదాసులుగా అభివర్ణించడానికి ఇష్టపడతారు.
వైష్ణవులు ఎందుకు అలా ఉంటారు? ఎందుకంటే వారు భక్తిని కోరుకుంటారు, మరియు భక్తి వినయం మీద ఆధారపడివుంటుంది కనుక. వినయం (స్వీయ–ప్రాముఖ్యత లేనిది) అనేది భక్తి లేదా ప్రేమకు మొదటి అవ్యక్త పునాది వంటిది. అందువల్లనే శ్రీ చైతన్య మహాప్రభు మనం నామ–సంకీర్తనలో సమర్థవంతంగా పాల్గొనాలనుకుంటే, అతి ముఖ్యమైన అవసరం వినయం అని సలహా ఇచ్చారు. వినయం లేకుండా చేసే నామ సంకీర్తన, సేవకు బదులుగా బూటకమే అవుతుంది.
ప్రతిష్ఠ అనేది గతంలో కంటే నేటితరంలో చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే గతంలో, ప్రసిద్ధి పొందడం అంత సులభమైంది కాదు, కానీ నేటి సామజిక మాధ్యమాలవల్ల రాత్రికి రాత్రి ఒకరు ప్రసిద్ధి చెందవచ్చు. ఒకరు తన అభిప్రాయాలను ప్రకటించడానికి మరియు అనుచరులను ఆకర్షించడానికి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతర ప్రోగ్రామ్లను ఉపయోగించవచ్చు. మనము యూట్యూబ్లో వీడియోలను పోస్ట్ చేయవచ్చు మరియు చందాదారులను ఆకర్షించవచ్చు. ప్రజలను భౌతికంగా సంప్రదించే ప్రయత్నం లేకుండా, మన గదిలో మనం కూర్చుని ప్రపంచవ్యాప్తంగా మన ప్రశంసలు వినవచ్చు.
ప్రతిష్ఠ అనేది ప్రాథమికంగా ఒక ప్రతికూలమైన విషయం, కానీ ఇది ఈ పదం యొక్క సాధారణ ఆంగ్ల అనువాదాల నుండి అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. ప్రతిష్ఠ అనే పదం యొక్క మూలం స్థ, మరియు దాని ఉపసర్గ ప్రతి-. మూలం √ స్థ అంటే బలం, స్థిరత్వం, నిలబడటం మొదలైనవి. ప్రతి ఉపసర్గ అర్థం, ప్రతివాదం లేదా మూలం యొక్క అర్ధానికి వ్యతిరేకంగా ఉండటాన్ని సూచిస్తుంది. కాబట్టి, ప్రతిష్ఠ అనే పదానికి “వ్యతిరేకంగా నిలబడగల సామర్థ్యం” అని అర్ధం. ఒక ప్రసిద్ధ వ్యక్తి పోటీదారులకు వ్యతిరేకంగా నిలబడతాడు మరియు వారు పడిపోయేటప్పుడు నిలబడి ఉంటాడు. అలానే, ఇది ఒకరి అనుచరులకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే రాగము (ప్రేమ) మరియు ద్వేషము(ద్వేషం) లనేవి ఒకే నాణానికి వ్యతిరేక వైపులా ఉంటాయి. “ప్రేమించే” అభిమానులు మీ పట్ల ఎంతో కొంత అవ్యక్త అసూయను కలిగి ఉంటారు, వారు పూర్తిగా భక్తులు అయిన పక్షంలో తప్ప. అందుకే మనం చాలా మక్కువ కలిగిన అభిమానులు ఒక ప్రసిద్ధ వ్యక్తి యొక్క బద్ద శత్రువులుగా మారారని మనం తరచుగా వింటుంటాము. అందువల్లే, ప్రతిష్ఠ కలిగి ఉంటే , మీరు ద్వేషం, శత్రుత్వం మరియు అసూయ నుండి విముక్తిని పొందలేరు ఎందుకంటే వాటిని ఎదురొడ్డి మీరు నిలబడాలి.
భౌతిక ప్రపంచంలో, ఈర్ష్య(మత్స్యర్యము) ప్రతిచోటా ఉంటుంది. అందుకే శ్రీమద్ భాగవతము ప్రారంభంలోనే దానిని ఖండించింది మరియు దాని నుండి స్వేచ్ఛను భక్తుడి ప్రాథమిక లక్షణాలలో ఒకటిగా ప్రతిపాదిస్తుంది. అయితే ప్రసిద్ధి చెందడం ఇతరులలో ఈర్ష్యను రేకెత్తిస్తుంది. ఖచ్చితంగా, ప్రేమను వ్యాప్తి చేయాలనుకునే భక్తుడికి ఇది సాధించడం ఒక అద్భుతమైన విషయం కాదు.
ఏదేమైనా, వీటిలోనివి ఏవీ వైష్ణవులు ప్రతిష్ఠకు ఆమడ దూరాన ఉండటానికి అంతిమ కారణాలు కాదు. అంతిమ కారణం ఏమిటంటే, ప్రతిష్ఠ మనలను గర్వంగా మరియు అహంకారులుగా చేస్తుంది, దీనివల్ల మనం ఇతరులపై సదా అపరాధాలను చేసేటట్లు చేస్తుంది . భక్తి మార్గంలో అపరాధాలనేవి ఒక గొప్ప అడ్డంకి. ఎవరైనా ఈ అపరాధ ధోరణిని విడనాడితే భక్తి చాలా సులభమైన, సరళమైన, సంతోషకరమైన ప్రక్రియ. అహంకారమనేది ఈ అపరాధాలకు ప్రధాన మూలం. అలాగే ప్రతిష్ఠ అహంకారానికి ప్రధాన మూలం. ఇందువల్లే ప్రతిష్ఠ చాలా అసహ్యకరమైన పంది-మలం తో పోల్చబడింది .
ప్రతిష్ఠ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు దానిని వదులుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇది మన అత్యంత విలువైన నిధులను పోషిస్తుంది: అవి మెలికలు వేయబడ్డ మన ఆత్మ, లేదా అహంకారము. ప్రతిష్ఠను మనం వదులుకోగలిగే దానికంటే అన్ని రకాల ఆహ్లాదకరమైన విషయాలను చాలా సులభంగా మన జీవితములో వదులుకోవచ్చు. వారి విలాసాలు, ఆనందాలు, ఆస్తులు, మతం, కుటుంబం మరియు మొదలైనవాటిని త్యజించిన వారు కూడా ప్రతిష్ఠకు అతుక్కు పోతారు, ఎందుకంటే వారు వదులుకున్న వాటి వల్ల ఖ్యాతి మరియు గౌరవం కావాలి కనుక.
శ్రీ హరిభక్తి–విలాసంలో, శ్రీ గోపాల భట్ట గోస్వామి ఒక వైష్ణవుడు అనుసరించాల్సిన క్రమశిక్షణా ప్రణాళికని వివరిస్తాడు. వైష్ణవ విధుల యొక్క అన్ని అంశాల గురించి చాలా విస్తృతమైన మరియు వివరణాత్మక సూచనలు ఇచ్చిన తరువాత, అవి ధనవంతుల కోసం ఉద్దేశించినవి అని సంపదను త్యజించేవారి కోసం కావని ఆయన ప్రకటించారు. దాని తర్వాత ఆయన సంపదను త్యజించిన వైష్ణవుల యొక్క ప్రాధమిక విధి గురించి ఈ క్రింది విధంగా చెప్పాడు, ఇది ప్రతి సమకాలీన భక్తుడికి చాలా ముఖ్యమైన సూచనగా నేను భావిస్తున్నాను.
సర్వ–త్యాగే‘ప్యహేయాయాః సర్వానర్థ –భువశ్చతే
కుర్యుః ప్రతిష్ఠా విష్ఠాయా యత్నం అస్పర్శనే వరం
“అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిష్ఠ అనే మలం తాకకుండా ఉండటానికి ప్రయత్నించడం. మీరు అన్నిటినీ వదులుకున్నా, అన్ని అవాంఛనీయ విషయాలు దాని నుండి వస్తాయి.” (హరి.భ.వి 20.370).
శ్రీ గోపాల భట్ట గోస్వామి ఇక్కడ “యత్న” అనే పదాన్ని ఉపయోగించడం గమనార్హం. ప్రతిష్ఠను నిజంగా వదులుకోవడం ఎంత కష్టమో ఆయనకు తెలుసు, అందుచేతే దానిని వదులుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అవసరమని ఆయన సూచించారు.
ప్రతిష్ఠకు ఒక వింత వ్యంగ్యం ఉంది. ఒక భక్తుడికి నిజంగా దానిపై ఆసక్తి లేకపోయినా, మరియు అతను స్వచ్ఛమైన, పూర్తిగా లొంగిపోయిన హృదయంతో భక్తిని ఆచరించినప్పటికీ–ఆ అభ్యాసం యొక్క సహజ ఫలితాలలో ఒకటి ప్రతిష్ఠ అవుతుంది. ఎందుకు? గొప్ప వైష్ణవులు శ్రీకృష్ణుని యొక్క లక్షణాలను వెదజల్లుతారు, కాబట్టి ప్రతి ఒక్కరూ సహజంగానే వారిపట్ల ఆకర్షితులవుతారు. దానివల్ల అతను ప్రాచుర్యం పొంది ప్రసిద్దిత మూటగట్టుకుంటాడు.
శ్రీ విశ్వనాథ చక్రవర్తి అనర్థం యొక్క వర్గంగా దీనిని పేర్కొన్నాడు, దీనిని ఆయన భక్త్యోత్త–అనర్థ అని పిలుస్తాడు, అంటే భక్తి వల్ల కలిగే సమస్యలని దానర్థం.
ఎంత విపరీతము! మీకు ఎంత తక్కువ ప్రతిష్ఠ కావాలనుకుంటే, అంత ఎక్కువ వస్తుంది. కానీ శుభవార్త ఏమిటంటే భక్తుడు, దానిని పట్టించుకోడు, గమనించడు అలానే దాని గూర్చి బాధపడడు. నిజమైన వైష్ణవులు సహజంగా వినయంగా ఉంటారు మరియు ఇది వారి ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. వారి వినయం వారి భక్తి యొక్క సహజమైన, స్వయంచాలక ఫలితం, మేధోపరంగా అభ్యసించినది కాదు.
నిజమైన వైష్ణవులు ప్రతిష్ఠ చేత ప్రభావితం చేయబడరు. వారు దానిని ఇష్టపడరు అలానే అసహ్యించుకోరు.
పురుషులు మరియు మహిళలు వేర్వేరు స్వభావాలు, భావాలు, కోరికలు మరియు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోవడం మరియు వారు అన్ని విధాలుగా సమానమని భావించడం విఫలమౌతున్న సంబంధాల వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.