ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఎక్కడైనా కలుసుకుని మాట్లాడుకుంటుంటే, ఆ మాటల్లోని విషయము తరచుగా మూడో వ్యక్తి గూర్చి అయి ఉంటుంది. ఏప్పుడో అరుదుగా తప్పితే వ్యక్తి విమర్శని తప్పించుకోలేము. ఒకరిని విమర్శించటం మనకు చాలా ప్రీతిపూర్వకమైనది. ఒక్కోసారి అది ఎంతగా రూపాంతరం చెందుతుందంటే అది మన అలవాటుగా మారిపోయినా దాన్ని మనం గమనించలేము. మనం ఒకరిని గూర్చి అంతగా చెడుగా ఆలోచించేందుకు ఎందుకు మన కాలాన్ని వెచ్చిస్తాము?
అందుకు ప్రధాన కారణం ఏంటంటే, మన కున్న భౌతిక భాంధవ్యాలు, వీటిని మనం ప్రేమగా తప్పుగా భావిస్తాము. ఇది వినడానికి చాలా అసంబద్ధముగా ఉండొచ్చు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు వారిలో ఎటువంటి తప్పు మనకు కనపడదు. కానీ మనం ప్రేమగా భావిస్తున్న ఈ భౌతిక బాంధవ్యాలు వక్రీకరించినప్పుడు అవి కోపం, ద్వేషం, అసూయ, నెపం, నీలాపనిందనలకు దారితీస్తాయి. ఈ చెడు భావోద్వేగాలు నిజానికి తలక్రిందులైన సంబంధ బాంధవ్యాలే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు “కామాత్ క్రోధోభిజాయతే”, ” తీవ్రమైన బాంధవ్యాల వల్ల కోపం ఉత్పన్నమవుతుంది. అందుకే బాంధవ్యం (ప్రేమ) మరియు ద్వేషం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివి. ఇవి రెండునూ స్వీయం లేదా అహం మీద ఆధారభూతమైనవి. ఒక సంబంధ బాంధవ్యం (ప్రేమ) లో మనం మనకు ఇష్టమైన దానికి దగ్గరౌతాము అలానే ద్వేషంలో దానికి దూరమౌతాము.
నింద మన అహాన్ని సంతోషపరుస్తుంది
యాజ్ఞవల్క్య మహాముని ” ఆత్మనః కామాయ ఏవ సర్వం ప్రియః భవతి” అంటారు. అంటే మన అహానికి తగ్గట్లుగా ఏదైనా తప్పుగానో లేక ఒప్పుగానో గోచరిస్తుందని అర్థం. అందుకే ఒకరు వేరొకరిని నిందించినప్పుడు అది వారి సంబంధ బాంధవ్యాల వ్యక్తీకరణం. లేకపోతే ఎవరైనా ఎందుకు నిందిస్తారు. ఒక వ్యక్తి గూర్చి మనకున్న బాంధవ్యాన్ని వదిలుంచుకోవటం అంత సులువైనదికాదు. ఒక వ్యక్తిని మనం నిజంగా ఇష్టపడకపోతే వారికి దూరంగా మళ్లి, వారి గూర్చి పూర్తిగా మర్చిపోవడం ఉత్తమం. ఇది ఎలా ఉండాలంటే, మనం అడవిలో వెళ్తుంటే దారిలో పూర్తిగా చెడిపోయిన కళేబరం ఎదురైతే తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు. నిందించటం అనేది మన కాలాన్ని వృధా చేస్తోంది. ఇది మనకు కానీ మనము నిందించే వ్యక్తికి కాని ఎటువంటి ఉపయోగం చేకూర్చదు. కానీ మనము దీనిలో పాల్గొంటాము ఎందుకంటే ఇది మన అహాన్ని సంతోష పరుస్తుంది కాబట్టి.
మనం ఇతరుల నిందలని ప్రశ్నించకుండా స్వీకరించే స్వభావం ఉన్నవారిని కూడా చూస్తుంటాము. పొగడ్తల్ని మాత్రము అనుమానాస్పదంగా చూస్తాము. పొగడ్త అనేది మన అహానికి సవాలు విసురుతుంది అదే విమర్శ అయితే మాత్రం ఆనందాన్నిస్తుంది.
ద్వేషంలో నిమగ్నమవడం తీవ్రంగా ఉంటుంది
మనము ఎవరిలానైనా ఉండాలనుకొని ఉండలేకపోతామో, వారంటే మనకు అసూయ కలుగుతుంది. వాళ్ళలా మనం హోదా, పరువు, డబ్బు, దర్పం కలిగిఉండాలని అనుకుంటాము. వారి స్థితి మనల్ని అసోకర్యాన్ని కలిగిస్తుంది. మన స్థితి వారి ముందు తక్కువగా కనిపిస్తుంది. వారు మన కంటిలో నలుసు లాగా మారతారు. మన అహం బాగా దెబ్బ తింటుంది, దానివల్ల వారి మీద తప్పులు మోపడమో లేక నిందించడమో చేసి ఇతరులు భావించినట్లు వారు మంచివారు కాదని నిర్ధారణ కావించడానికి మనం ప్రయత్నిస్తాతాము. ఇది మనకు ఒక రకమైన సంతృప్తినిస్తుంది. ఇదే కనుక లేకపోతే, అసూయ వల్ల మన హృదయం భగ భగ మండుతుంది. నిజానికి, అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏమి కలిగిఉన్నాడనేది మనకు అనవసరం, కానీ మనం సదా దాని గూర్చే ఆలోచిస్తూ లేదా మాట్లాడుతుంటాము ఎందుకంటే అవతలి వ్యక్తి గూర్చి మనం ప్రతికూల బాంధవ్యముతో ఉన్నాము కాబట్టి. మనం ప్రేమిస్తున్న వాళ్ళ గూర్చి ఆలోచించకుండా ఉండలేనట్లే, ద్వేషిస్తున్నవారిని కూడా మన మదిలోనుండి తొలగించలేము. నిజానికి, ద్వేషిస్తున్న వస్తువు మీద ధ్యాస ప్రేమిస్తున్న వారిపైన ఉన్నదానికన్నా తీవ్రంగా ఉంటుంది.
అసూయ వల్ల చేసే విమర్శ, విమర్శించబడే వ్యక్తులకు, అలానే విమర్శించేవారికి కూడా ఉపయోగపడదు. ఆపైన విమర్శించేవారు దీనివల్ల ఎంతో కోల్పోతారు. మనం దీనివల్ల మనతోపాటు మనం మాట్లాడే వారి ఎంతో విలువైన కాలాన్ని, శక్తిని వృధా చేస్తాము. అలానే విమర్శల చర్చ వల్ల మన మనస్సు కూడా మలినమవుతుంది. మనం స్వీయ పొగడ్తల వల్ల మన యోగ్యతను, పుణ్య కర్మలను నాశనం చేసుకొంటాము. అలానే వేరొకరిని విమర్శించటం వల్ల వారికిగల అయోగ్యతలను, పాప కర్మలను పొందుతాము. వాటివల్ల మనం మన హృదయములో అనవసర సంస్కారములను యేర్పరచుకొంటాము, అవి మనల్ని సదా ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. అందుకే, శ్రీకృష్ణుడు విమర్శని త్యజించమని సలహా ఇస్తాడు.
విమర్శవల్ల జరిగే దుష్ప్రభావం
విమర్శ వేరొకరిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని మీరు వాదించవచ్చు. ఇది వేరొకరికి సహాయ పడాలనే ధోరణి ఉన్నప్పుడు మాత్రమే నిజము అవుతుంది, అసూయతో చేసే విమర్శల విషయాలలో కాదు. ఇంకా చెప్పాలంటే అవతలి వ్యక్తి మన విమర్శలను ఎలా స్వీకరిస్తున్నాడన్న దానిమీద ఇది ఆధార పడి ఉంటుంది. వేరొకరిని నిందించండంవల్ల లేదా విమర్శించడం వల్ల మనం వారిని మెరుగు పరచలేము. ప్రేమ, ఆప్యాయత, నిజాయతీ వల్ల మాత్రమే అలా చేయగలుగుతాము. విమర్శల వల్ల వేరొకరిని సరిచేయడం అనేది వినడానికి బాగున్నా, జరగడమనేది అసాధ్యం.
అసూయ వల్ల వచ్చే విమర్శలు ఎప్పటికీ నిర్మాణాత్మకంగా ఉండవు. అవి కేవలం ఇతరుల తప్పులు లెక్కిస్తూ మన అహాన్ని తృప్తి పరుస్తాయి. ఇంకా చెప్పాలంటే అసూయ వల్ల అసూయే ఉత్పన్నమవుతుంది. మనం ఇతరులలో మంచైనా లేదా చెడైనా మనం వారితో వ్యవహరించే శైలి వల్లే తీసుకు వస్తాము. సాధారణముగా విమర్శను ఎవరైనా ఖండనాత్మక ధోరణితోనే చూస్తారు. వారు విమర్శ వల్ల కలత చెందుతారు మరియు దాని నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. కేవలం యోగులు మాత్రమే విమర్శను సదృష్టితో చూడగలరు. అలానే వారు విమర్శలో నిజం ఉంటే, తమను మార్చుకోగలరు కూడా. లేకపోతే వారు దీన్ని సమానత్వపు దృష్టికి పరీక్షగా పరిగణిస్తారు. కానీ అలాంటి యోగులు ఉండటం చాలా అరుదు. కాబట్టి విమర్శలు ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించవు.
ఉదాహరణకు మీకు ఇంట్లోగానీ లేక కార్యాలయంలో గానీ ఎవరైనా మార్చలేనంతగా తారసపడితే అది మిమ్మల్ని అసహనానికి గురి చేస్తుంది. మీ అమ్మగానీ, నాన్నగానీ, భార్యగానీ, భర్తగానీ, పిల్లలుగానీ, సహోద్యోగిగానీ, ఉన్నతోద్యోగిగానీ మీతో నొప్పించుకొనేటట్లు ప్రవర్తిస్తే మీరు ఏం చేస్తారు. మీరు ఆమెను లేక ఆయనను నిందిస్తారా. వారిని ఇలాంటి నిందన స్థితికి గురి చేయటం వల్ల ఒక వికల్పమైన వైఖరి ఆ వ్యక్తి పట్ల మీరు ఏర్పరచుకుంటారు, దాని వల్ల మీరు వారిలో మంచి అనేదే చూడలేకపోతారు. మీ నిందన మీకు ప్రతిగా ఎటువంటి మేలు చేకూర్చదు, దాని పర్యవసానంగా ఇబ్బందులు తప్ప. దాని వల్ల మీ సంబంధాలు కూడా చెడవచ్చు. వీటి వల్ల ఎదుటి వ్యక్తులను కలవాల్సినప్పుడుల్లా మీరు ఇబ్బంది పడవచ్చు. వారిని నిందించడం కన్నా, అలాంటి పరిస్థితి ఎదురైతే అది మీ సహనానికి పరీక్షగా మీరు భావించండి. మీరు ఆ వ్యక్తిపట్ల కృతజ్ఞతతో ఉండండి ఎందుకంటే వారు మీ బలహీనతను తెలుసుకొనేందుకు అవకాశాన్ని ఇచ్చారు.
సహనాన్ని కోల్పోకుండా సమస్థితిలో ఉండండి
అందరూ మిమ్మల్ని పొగిడితే, అద్భుతంగా చూస్తే మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు. మిమ్మల్ని మీరు సమతుల్యమైన వ్యక్తి అని మీరు భావించవచ్చు. కాని దాని వల్ల అర్ధం లేదు. మిమ్మల్ని వేరొకరు యే కారణంలేకుండా విమర్శించడంవల్లే మీ బలహీనత మీకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ సమతుల్యత కోల్పోకుండా ఉంటే మీరు ఏదో సాధించినట్లే. మీకు అటువంటి అవకాశాలు కావాలి. సాధు కబీర్ ప్రతి ఒక్కరూ తమ ప్రక్క ఒక విమర్శకుడిని పెట్టుకోవాలంటారు. అందువల్ల మనము ఎప్పుడూ అప్రమత్తముగా ఉండాల్సి రావచ్చు. అందువల్ల మీరు ఎల్లప్పుడూ జాగృతతో ఉంటారు. అందుకే అటువంటి విమర్శకుడు మీకు కనపడని ఒక వరం. వారు అటువంటి కృతజ్ఞత లేని పనిచేస్తున్నందుకు మీరు వారికి కృతజ్ఞుడై ఉండాలి. వారు ఉచితంగా చెత్తను తీసి శుభ్రపరిచే శుద్ధి కారకుల వంటివారు.
నిర్మాణాత్మక విమర్శలు చేయటం అనేది ఒక గొప్ప వరం లాంటిది. సంస్కృతంలో ఒక సామెత ఉంది, ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు అరుదు – ఒకరు చేదైన నిజం చెప్పేవారు, రెండవది దాన్ని విని ఒప్పుకొనే వారు.
ఒకరి జీవిత కాలంలో నిందించబడకుండా లేదా విమర్శించబడకుండా ఉండటం అసాధ్యం. కాబట్టి వాటి వల్ల కలత చెందరాదు.
దృఢంగా ఉండండి, కష్టాలనేవి ఒక ఉప్పెనలాగా తీరం దాటతాయి. వేరొకరిని మార్చాల్సివస్తే, కరుణతో నిర్మాణాత్మాక విమర్శ చేయండి. విమర్శకు ఎల్లపుడూ కరుణ, సంరక్షణ జోడించాలి. అప్పుడే అది పని చేస్తుంది. లేకపోతే అది కావాల్సిన ఫలితాన్ని ఇవ్వదు. విమర్శను సాదరంగా స్వీకరించండి, పొగడ్తకు నమస్కరించండి. రెండిట్లలోనూ సమగ్రతతో ఉండండి ఎందుకంటే రెండూ ఆధ్యాత్మిక ప్రయాణానికి అవరోధాలే కనుక.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.