మహాప్రభువును శాస్త్రాధ్యయనముతో అర్థము చేసుకోవడానికి ప్రయత్నించండి

Questions & AnswersComments Off on మహాప్రభువును శాస్త్రాధ్యయనముతో అర్థము చేసుకోవడానికి ప్రయత్నించండి

ప్రశ్న : ఒక్కోసారి భక్తులు శాస్త్రాధ్యయనము చేయవలిసిన అవసరం లేదని వాదిస్తుంటారు మరియు తమ వాదనను సమర్ధించుకొనేందుకు చైతన్య చరితామృతములోని శ్రీమద్ భగవద్గీతను చదవడం కూడా రాని ఒక సామాన్య భక్తుడు, దానిని తిరగ త్రిప్పి చదువుతూ, రోదిస్తూ ఉన్నప్పుడు మహాప్రభువు అతనిని చూసి సంతసించిన విషయాన్ని ఉదహరిస్తుంటారు.

జవాబు: ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం మనం నిరక్షరాస్యులుగా ఉండి పోయి భగవద్గీతను చదవలేకుండా ఉండమని కాదు. ఇక్కడ ముఖ్యోద్దేశం ఆ భక్తుని వలే భావాన్ని పొందగలగాలి అనేది. మహాప్రభువు ఆ వ్యక్తి నిరక్షరాస్యతను మెచ్చుకోవడం లేదు ఆయనకు గల భావాన్ని మెచ్చుకొంటున్నారు. కానీ జనులు ఆ విషయాన్ని అర్థం చేసుకోరు ఎందుకంటే వారు శాస్త్రాధ్యయనము చెయ్యాలనుకోరు అలానే నిరక్షరాస్యులుగా వారు మిగిలి పోతారు. అధ్యయనం చేయాలంటే కొంత ప్రయత్నం కావాలి. మీరు మీ లక్షణానికి తగ్గ అర్థాన్ని గ్రహిస్తారు.

కొంతమంది చైతన్య మహాప్రభువు ఆ వ్యక్తి నిరక్షరాస్యుడు కాబట్టి ఆయనను ప్రశంసించాడు అంటారు. కానీ అది నిజం కాదు. ఒక వేళ అదే నిజం అయినట్లయితే ఆయన నిరక్షరాస్యులైన ఎంతోమందిని ప్రశంసించాలి . ఆయన పండితులైన రూప, సనాతన గోస్వాములను ఎందుకు ప్రశంసించారు? జనులు నిరక్షరాస్యుడైన ఈ భక్తుడినే ఎందుకు ఉదాహరణగా చెప్తారు? వారు చైతన్య మహాప్రభువు రూప, సనాతన, సార్వభౌమ భట్టాచార్య, కవి కర్ణిపుర మరియు అనేకమంది పండితులను ప్రశంసించడమును ఎందుకు చూడరు? మహాప్రభువు తన హృదయాన్ని ఆ నిరక్షరాస్యుడైన వ్యక్తి సరిగ్గా అర్థం చేయూసుకొన్నాడన్నారా లేక రూప గోస్వాముల వారు అర్థం చేసుకొన్నాడన్నారా? రూప గోస్వాముల వారే మహా ప్రభువు హృదయాన్ని అర్థం చేసుకొన్నారు. మరయితే మీరు చైతన్య మహాప్రభువు హృదయాన్ని అర్థం చేసుకొంటారా లేక నిరక్షరాస్యులుగా మిగిపోవాలని అనుకొంటారా? 

ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఆయన కృష్ణుని మీద ఆ వ్యక్తికి గల అపార భక్తిని ప్రశంసిస్తున్నారు. ఆయన ఎక్కడా మీరు అధ్యయనము చేయ వద్దనలేదు. ఒక వేళ అలా ఆయన అనినట్లయితే ఆ భక్తుని నీ చేతిలో భగవద్గీత ఎందుకు ఉంది అని అడిగి ఉండేవారు.  అక్కడ విషయం ఆ వ్యక్తి చదివేందుకు ఉత్సుకతో ఉండి ఉన్నాడు కానీ చదవలేక పోయాడు. ఆ ఉత్సుకతే మహా ప్రభువును ఆకర్షించింది. ఒక వేళ నిజముగా ఆ వ్యక్తి చదవ గలిగి ఉండి ఉంటే ఇంకా ఎంత ప్రయోజనం ఉండి ఉండేది?

ఇంకా చెప్పాలంటే, అధ్యయనం అవసరం లేదని వాదించేవారికి, అసలు ఈ సంఘటన ఎలా తెలిసింది. చదవడం వల్ల కాని నిరక్షరాస్యత వల్ల కాదు. వారు ఒక వేళ చైతన్య చరితామృతమును చదివి ఉండక పోతేవారికి వారికి ఈ కథ తెలిసి ఉండేది కాదు. ఆ విధముగా వారు తమ వాదాన్ని తామే వ్యతిరేకించుకుంటున్నారు.

ప్రశ్న :  అది తెలుసుకోవడానికి  ఎంతో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం లేదు….. 

జవాబు : అవును, అధ్యయనము అంతవరకన్నా చేసివుంటారు కదా? మీరు అంతవరకే చదివారు కనుక, మీరు కథలోని ముఖ్యోద్దేశాన్ని తెలుసుకోలేక పోయారు. ఒక వేళ అధ్యయనం చేయ అవసరం లేదనేది నిజమైనట్లయితే కృష్ణ దాస కవిరాజ గోస్వాముల వారు “మీరు అధ్యయనం చేయవద్దు. దాన్ని చెప్పడం కోసమే నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను, అది నిర్ధారణ చేసేందుకు ఈ ఉదాహరణను  నేను ఇస్తున్నాను” అని అనేవారు. దానికి భిన్నముగా ఆయన పుస్తకం మొదటినుంచి మీరు చైతన్య మహాప్రభువును అర్థము చేసుకొనేందుకు ఈ పుస్తకాన్ని వ్రాసానని చెప్తారు. మీరు పుస్తకాన్ని తల క్రిందులుగా పట్టుకొని కళ్ళల్లో నీళ్లు పొందేందుకు ఆయన ఈ పుస్తకాన్ని వ్రాయలేదు.

   ఆయన శాస్త్ర అధ్యయన విషయములో ఒకరు బద్ధకంతో ఉండరాదని వ్రాసారు. ఆయన ఈ పుస్తకములో ఎన్నో మిగతా శాస్త్రములను ప్రస్తావిస్తారు మరియు గుహ్యతరమైన శ్రీ చైతన్య మహాప్రభుని లీలలను వాటి ద్వారా వివరించేందుకు ప్రయత్నించారు. ఇవి పుస్తకాన్ని చదివిన తర్వాత కూడా అర్థం చేసుకొనడం చాలా కష్టం ఇక చదవ ఉండకుండా ఉంటే ఇక చెప్పనవసరంలేదు. అందుచేత ఈ పుస్తకం మొత్తము నుండి ఈ అంశాన్ని ఉదాహరణగా తీసుకొని   చదవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తే కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు శ్రీ చైతన్య మహాప్రభువును గూర్చి మనకు వివరించేందుకు చేసిన ప్రయతన్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

ఈ వాదమే నిజమయినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు స్వయముగా ఎందుకు అధ్యయనం చేసారు మరియు ఆయన స్వరూప దామోదరుని తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఆయన వద్దకు ఎవరైనా వచ్చి ఒక పద్యాన్ని చదవాలంటే ఆయన మొదట పండితుడైన స్వరూప దామోదరుని వద్దకు పంపించేవారు ఎందుకంటే ఆయన పద్య రచనలో ఎటువంటి తప్పులను ఒప్పుకోరు కనుక. అలా చైతన్య మహాప్రభువుల వారు స్వరూప దామోదరుల వారిని ఆ పద్యాలను వడకట్టింప చేసి ఆ తర్వాత ఆయన ఎన్నిక చేసిన ఆణిముత్యములను ఆస్వాదించేవారు.

ప్రశ్న : కానీ దురదృష్టవశాత్తు భక్తులలో అధికులు అధ్యయనం అంటే ఇష్టపడుటలేదు ……

జవాబు: అవును, అది నిజమే. నాకు చదవాలనే ఆసక్తి లేకపోతే నేను శాస్త్రములో ఏదో ఒక సంఘటనను ఆధారముగా చేసుకోని నా అభిప్రాయము సరైనది అని భావిస్తాను. శాస్త్రమనేది మన కోరికలను తీర్చే కల్పతరువు. మనం దేనినయితే నమ్ముతామో దానికి సమర్థనీయమైన దానిని శాస్త్రములో పొందుతాము. కానీ నిజానికి శాస్త్రము యొక్క ప్రయోజనం అది కాదు. శాస్త్రము యొక్క ప్రయోజనం మీ అభిప్రాయాలకు మద్దతు పలకడం కాదు వాటిని సమూలంగా పెకళించడమే.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ఇతరులను నియంత్రించే ధోరణి వల్ల సంబంధాలు నాశనమవుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.