వైదిక జ్ఞానము

Articles by Satyanarayana DasaComments Off on వైదిక జ్ఞానము

            ప్రాచీన భారత సమాజము ప్రాపంచిక మరియు జీవిత నియమాలను లోతుగా మరియు పరిపూర్ణంగాపై విశ్లేషించగల ఋషులచే వ్యవస్థీకరించబడింది. బాహ్య జ్ఞానేంద్రియాలు మరియు మనస్సుతో  సామాన్య మానవుడు జ్ఞానం పొందుతాడు. ప్రాచీన జ్ఞానులైన ఋషులు మరియు మునులు ఋతంభరా ప్రజ్ఞ అనే వేరే ప్రక్రియ లేదా సత్యాన్ని తెలిపే దృష్టి(యోగ సూత్రం 1.48) కలిగి ఉండేవారు.  తపస్సు మరియు సమాధి సాధనలతో వారు దానిని సంపాదించేవారు. దృష్టితో వారు జగత్తు కొన్ని మూల సూత్రములుగా చెప్పబడే ఋతము మీద ఆధారపడి పనిచేస్తుందని గ్రహించారు. ఋతములలో ప్రధానమైనది కాలముయొక్క ఆవృత్త స్వభావము. విశ్వమంతా కూడా సృష్టి, స్థితి మరియు లయములను ఆవృత్తములకు లోనయి ఉంటుంది. వేదాంతసూత్రం(1.1.2) మొదట్లో జన్మాద్యస్య యతః “అతని నుండి సృష్టి, స్థితి మరియు లయము సంభవిస్తాయి.” అని చెప్పబడింది. శ్రీ వ్యాసదేవుల ఆఖరి రచన అయిన శ్రీమద్ భాగవత పురాణంలో కూడా ఇదే ఉంది. మన అనుభవంలోకూడా అన్నివిషయాలు మన జీవితంతో సహా ఈ మూడు దశలకు లోనౌతాయని మనకు అర్థమౌతుంది. కావున ఇది ప్రధాన ఋతం లేదా విశ్వము మరియు దానిలో ఉన్న అన్నిటికి వర్తించే ఋతం అని చెప్పవచ్చు.

     ప్రాచీన భారత సమాజము ప్రాపంచిక మరియు జీవిత నియమాలను లోతుగా మరియు పరిపూర్ణంగాపై విశ్లేషించగల ఋషులచే వ్యవస్థీకరించబడింది. బాహ్య జ్ఞానేంద్రియాలు మరియు మనస్సుతో  సామాన్య మానవుడు జ్ఞానం పొందుతాడు. ప్రాచీన జ్ఞానులైన ఋషులు మరియు మునులు ఋతంభరా ప్రజ్ఞ అనే వేరే ప్రక్రియ లేదా సత్యాన్ని తెలిపే దృష్టి(యోగ సూత్రం 1.48) కలిగి ఉండేవారు.  తపస్సు మరియు సమాధి సాధనలతో వారు దానిని సంపాదించేవారు. దృష్టితో వారు జగత్తు కొన్ని మూల సూత్రములుగా చెప్పబడే ఋతము మీద ఆధారపడి పనిచేస్తుందని గ్రహించారు. ఋతములలో ప్రధానమైనది కాలముయొక్క ఆవృత్త స్వభావము. విశ్వమంతా కూడా సృష్టి, స్థితి మరియు లయములను ఆవృత్తములకు లోనయి ఉంటుంది. వేదాంతసూత్రం(1.1.2) మొదట్లో జన్మాద్యస్య యతః “అతని నుండి సృష్టి, స్థితి మరియు లయము సంభవిస్తాయి.” అని చెప్పబడింది. శ్రీ వ్యాసదేవుల ఆఖరి రచన అయిన శ్రీమద్ భాగవత పురాణంలో కూడా ఇదే ఉంది. మన అనుభవంలోకూడా అన్నివిషయాలు మన జీవితంతో సహా ఈ మూడు దశలకు లోనౌతాయని మనకు అర్థమౌతుంది. కావున ఇది ప్రధాన ఋతం లేదా విశ్వము మరియు దానిలో ఉన్న అన్నిటికి వర్తించే ఋతం అని చెప్పవచ్చు.

      మానవ జన్మ సార్థకం చేసుకోడానికి మరియు అత్యంత సుఖానుభవంగా జీవించడానికి మానవులు ఋతముతో అన్యోన్యముగా మెలగాలని  భారతీయ ఋషులు తెలుసుకొన్నారు. అందువల్లే వారు మానవ జీవితాన్ని రెండు స్ధాయిలుగా విభజించారు: వ్యక్తిగతము మరియు సామాజికము. వ్యక్తిగతంగా జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించారు: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము మరియు సన్న్యాసము. మానవ ఆయుస్సు నూరుసంవత్సరాలుగా భావించి ప్రతిఒక్క ఆశ్రమానికి ఇరువది-ఐదు సంవత్సరాలు కేటాయించారు. 

         సామాజికంగా వర్ణమను భావాన్ని రూపొందించారు. మనుష్యులందరూ సమానంకాదని వారు గ్రహించారు. ప్రతి మనిషికి ప్రత్యేక లక్షణం ఉంటుంది దానినే వ్యక్తియొక్క  ప్రకృతి అంటారు. ప్రతి మనిషి అతని లేదా ఆమె ప్రకృతికి అనుగుణంగా శిక్షణ పొంది వారి ప్రకృతిప్రసాద సామర్థ్యాలతో వారు సమాజంలో పనిచేయడం మంచిది. అందుకు, ప్రతి మనిషికి ప్రత్యేకతఉన్నప్పటికీ సమాజాన్ని ఏర్పాటుచేయుటకు కొన్ని విశాల వర్గములు అవసరమని భావించారు. ఇవే వర్ణములుగా పిలవబడుతున్నాయి. ఋషులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు సూద్రులను నాలుగు వర్ణములను భావించారు. వ్యవస్థీకృత ప్రమాణం‌గా పనిచేసే ప్రతి సమాజం దాని జీవనోపాధి, ప్రచారం మరియు శ్రేయస్సు కోసం ఈ నాలుగు రకాల ప్రజలను కలిగి ఉండాలి. ఈ నాలుగు వర్గాలు తప్పవు, మరియు అవి ప్రపంచంలోని సమాజాలలో తెలియకుండానే బయటపడతాయి. ఏదేమైనా, భారతీయ ఋషులు దీనిని గుర్తించి, నాలుగు వర్ణాల వెనుక ఉన్నసిద్ధాంతాన్ని అందించారు. 

       అంతేకాక విశ్వముయొక్క ఋతముతో సామరస్యంగా ఉండడానికి ప్రతి వ్యక్తి మరియు సమాజము నాలుగు పురుషార్థములకోసం ప్రయత్నించాలని ఋషులు అర్థం చేసుకున్నారు. నాలుగు పురుషార్థములు: ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము. ఈ పురుషార్థములు వ్యక్తి జీవితాన్ని మరియు సమాజమును సృష్టి, స్థితి మరియు లయల ప్రధాన ఋతముతో సామరస్యము చేయడంకోసమే. అర్థము కామము సృష్టికోసం, ధర్మము స్థితికోసం మరియు మోక్షము లయకోసం. ఇది ఉద్దేశించి శ్రీ కృష్ణుడు సమాజములో నాలుగు వర్ణాలను సృష్టించానని గీత 4.13లో చెప్పాడు. క్లుప్తంగా, ఇది వేలాది సంవత్సరాలుగా దీనిపై ఆధారపడి శాంతియుతంగా పనిచేసిన భారతీయ సమాజ వ్యవస్థను వివరిస్తుంది. 

        ఐతే , ప్రతి వ్యవస్థకూ సంరక్షణ మరియు సర్దుబాట్లు కావాలి. పరిస్థితులు సమతుల్యంగా లేనప్పుడు వాటిని సరిదిద్దుటకు భారతదేశ చరిత్రలో ఎందరో మహానుభావులు జన్మించారు. నిజానికి, శ్రీ కృష్ణ భగవానుడు సమాజంలో వ్యవస్థ వికృతము పొందినప్పుడు తాను దాన్ని సవరించడానికి అవతరిస్తాని తానే స్వయంగా గీత(4.7)లో ప్రకటిస్తాడు. 

          కానీ, ఈ వ్యవస్థ 326బి.సి లో అలెగ్జాండర్ మొదలు పాశ్చాత్యులు భారత సమాజంపై చేసిన దాడుల వలన ఛిన్నాభిన్నం అయింది. అప్పటినుండి పతనమౌతూనే ఉంది. అదృష్టముగా వ్యవస్థ స్థితిస్థాపకత కలిగిఉంది. 1192ఎ.డి లో విదేశీ పాలన వచ్చినాకూడా విద్యావ్యవస్థ జోలికి రాలేదు. మొఘలాయీల సుదీర్ఘ పాలనలో కూడా వ్యవస్థ తట్టుకొని నిలబడింది. కానీ, 1850లో బ్రిటీష్ పాలకులు నిర్దాక్షిన్యంగా భారత విద్యావ్యవస్థను తీసివేయడంతో గట్టిగా దెబ్బతింది. పెద్ద దేశమును స్వాధీనపరచుకోవాలనే స్వార్థంతో గుమాస్తాల తయారీకోసం దానిస్థానంలో పాశ్చాత్య విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టారు. దౌర్భాగ్యంగా, పాశ్చాత్య విద్యావ్యవస్థకు మానవ జీవితంపై పరిజ్ఞానమే లేదు ఇక విశ్వముయొక్క ఋతము గురుంచి చెప్పాల్సినఅవసరం లేదు. దురదృష్టకరంగా, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినాకూడా ప్రాచీన ఋషుల పూర్వ సంస్కృతిని తిరిగి పొందలేకపోయారు. బదులుగా, భారతీయ మనసుకు సరిపడని పాశ్చాత్య విద్యావ్యవస్థను మరియు రాజ్యాంగాన్ని  పుణికి పుచ్చుకొన్నారు.

          ప్రస్తుతం సమాజంలో మనము అర్థకామములను సాధించడం చూస్తున్నాము. ధర్మము మీద అవగాహన లేదా శిక్షణ లేదు. మోక్షమనేది భావనాతీతంగా మారింది. ఫలితంగా మనము చాలా సృష్టి లేదా తయారీని చూస్తున్నాము. ప్రతిరోజూ ఏదోఒక కొత్త వస్తువో లేక ఉన్నవస్తువుయొక్క నూతన సంస్కరణో ప్రచారం చేయబడుతున్నాయి. నిజానికి, ఒక దేశాభివృద్ధి కేవలం జీడీపీ(గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్షన్)తో కొలవబడుతుంది. అధిక సృష్టి వలన సమాజంలో సహజంగా అసమతౌల్యం సంభవిస్తుంది. ధర్మమోక్షాల సాధన ద్వారా స్థితిలయలు చేసి సమతౌల్యం సాధించడానికి యే కార్యక్రమమూ లేదు. అందువల్ల ప్రతి దేశంలో ముఖ్యంగా అసమతౌల్య ఆర్ధిక వ్యవస్థ వల్ల సంభవించిన సంక్షోభాన్ని మనము చూస్తున్నాము. భౌతిక వస్తువులు తయారుచేయబడి మనకు అమ్మబడుతున్నాయి. వీటివల్ల ఆనందం, ఆమోదం, ప్రశంస మరియు ప్రేమ లభిస్తాయని మనము వాటివెంట ప్రాకులాడుతున్నాము. ఉన్నత ఉద్యోగానికో, తళుకుమనే వాహనాన్నో, మేలైన గృహాన్నో లేదా అందమైన భాగస్వామినో పొందడానికి పరుగెడుతున్నాము. మనల్ని అదుపులోఉంచే ధర్మమనే ఒక నియంత్రకం లేదు. మన ప్రకృతితో సంబంధంలేకుండా అధికంగా, మేలుగా అతి తొందరగా వస్తువులని పొందాలనుకుంటున్నాము. మనల్ని మనం కేవలం మన ఇరుగుపొరుగుతో పోల్చుకుంటాము. నిజానికి, మన ఇరుగు పొరుగు వారికంటే ఎక్కువగా ప్రాకులాడినవి దొరికినాకుడా మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా? లేదు, కనీసం చాలా సేపైతే కాదు. తరువాత వస్తువుకోసం పాకులాడడం మొదలుపెడతాము. ఒకవేళ మనదగ్గరున్న ధనం అయిపోతే? నష్టమేంలేదు! క్రెడిట్ కార్డులున్నదందుకేకదా! ప్రాకులాడడం, ఖర్చుచేయడం మరియు క్షణికానందం పొందడం మళ్ళీ వేరే కోరికకోసం ప్రాకులాడడం చేస్తూనే ఉంటాము. ఈ వలయంలో మనం లేమని హేతుబద్ధంగా అనుకోవడంలో మనం ఎంత నేర్పరులమైనా ఈ ప్రక్రియ కొనసాగుతూనేవుంటుంది. మనం చేసే పనులకు అవి ఎందుకు చేస్తున్నామో సమర్థిస్తూ మంచి కారణాలను కనుగొనవచ్చు కానీ సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. 

       మానవులు విశ్వముయొక్క ఋతముతో అనుగుణంగా వ్యవహరించనప్పుడు మరియు దానిని సరిచేయుటకు భగవంతుని అవతారము సమీపంలో లేనప్పుడు ప్రకృతి దానిని సమతౌల్యం చేస్తుంది. ఈ ఆవృత్తాన్ని సమతౌల్యం చేయడం కోసం కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రకృతి ఏర్పాటు చేసినదిగా నేను భావిస్తున్నాను. కావున, ఈ కరోనా వైరస్ యొక్క అతిపెద్ద ప్రభావం దేశ జీడీపీ మీద పడడంలో ఆశ్చర్యం లేదు. వైరస్ నివారించుటకు మనం వ్యాక్సిన్ కనుగొనవచ్చు కానీ అది మూల సమస్యను పరిష్కరించలేదు. నిజమైన పరిష్కారం మనం ఋతముతో సామరస్యంగా ఉండడంలో ఉంది. అందుకే భగవద్గీత(3.16)లో శ్రీ కృష్ణుడు “ఓ అర్జునా, ఈ విధంగా స్థాపించబడిన చక్రమును ఎవడు అనుసరించడో వాడు ఇంద్రియములయందు ఆనందిస్తూ  దుఃఖపూరిత జీవితాన్ని గడుపుతాడు.అలాంటి వాడు జీవితాన్ని వ్యర్థంగా గడుపుతాడు.” అని చెప్తాడు. సమాజంలోని  నాయకులు ఈ విషయాన్ని గుర్తించనంతవరకూ మానవాళికి కష్టాలు తప్పవు.



Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ఇతరులను నియంత్రించే ధోరణి వల్ల సంబంధాలు నాశనమవుతాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.