శ్రీమద్ భాగవతము యొక్క బోధనాతత్త్వం (2)

Articles by Satyanarayana DasaComments Off on శ్రీమద్ భాగవతము యొక్క బోధనాతత్త్వం (2)

కథల ఉద్దేశ్యము: 

                                 శ్రీమద్ భాగవతములో  శ్రీల వ్యాసదేవుని ఉద్దేశ్యము చారిత్రక విషయాల గూర్చి తెలియచేయడం కాదు, మనకు సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని ఇవ్వడమే. కానీ ఆ విధముగా చేసే మార్గములో ఎన్నో చారిత్రక విషయాలు కూడా కొన్ని సార్లు జోడించడం జరుగుతుంది. దీని గూర్చి శుకదేవ గోస్వామి ఈ క్రింది శ్లోకములో స్పష్టము చేస్తారు.  

కథా ఇమాస్తే కథితా మహీయసామ్ 

వితాయ లోకేషు యశః పరేయుషామ్ 

విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో 

వచో విభూతీర్ న తు పారమార్థ్యం

             ఓ రాజా! నీకు ఈ లోకంలో తమ యశస్సుని ప్రసరింపజేసి, గతించిన గొప్ప కీర్తిగల రాజుల గూర్చి చెప్పాను. ఆ కథల ముఖ్య ఉద్దేశ్యం సర్వోత్కృష్ట జ్ఞానాన్ని తెలిపి, వైరాగ్యాన్ని  ఉద్దీపన చేయడమే. ఈ కథలలోని వర్ణనలలు రసభరితముగా ఉంటూ వాస్తవికతకు కొన్ని సార్లు దూరముగా ఉండవచ్చు. (శ్రీమద్ భాగవతం 12.3. 14)

ఈ శ్లోకములోని చివరి పదాలు చెప్పినట్లు “ఈ కథలు కేవలం కావ్యాత్మక వర్ణనలు” మాత్రమే, వచో-విభూతి, చెప్పినదంతా యథాతథమైన దృష్టితో చూడరానిది. అప్పుడప్పుడు వర్ణనలు రమ్యంగా, అద్భుతముగా, అనిర్వచనీయముగా ఉండేదుకు అతిశయోక్తితో చెప్పటం జరుగుతుంది.  

చిత్రకేతు మహారాజు మరియు అతని భార్యలు 

                      ఉదాహరణకు, ఆరవ స్కంధములోని పద్నాల్గవ అధ్యాయములో, విద్యాధరుల చక్రవర్తి, వారసుడు లేని  చిత్రకేతుని గూర్చి ఒక కథ ఉంది. వర్ణాశ్రమ వ్యవస్థలో వైవాహికునకు తన వంశ వృద్ధికి, శ్రాద్ధ కర్మలు చేయటానికి ఒక కొడుకు అవసరం ఎంతో ఉండేది. అందువల్ల, ఆ రాజు పుత్ర ప్రాప్తికై, ఈ శ్లోకములో చెప్పినట్లు  ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ కోటి మంది భార్యలను పెళ్లాడాడు.

తస్య భార్యా సహస్రాణాం 

సహస్రాణి దశాభవన్ 

సాంతానికశ్చాపి నృపో 

న లేభే తాసు సంతతిమ్

           “ఓ రాజా, ఆయన ఒకరి తర్వాత ఒకరిని కోటి మంది భార్యలను పెళ్లాడినా వారిలో ఒక్కరితోనైనా సంతానం కలుగలేదు.” (శ్రీమద్ భాగవతం 6.14.11)

                  ఈ శ్లోకం ప్రకారం మహారాజుకు కోటిమంది (సహస్రాణాం సహస్రాణి దశ , పది వేల వేలు) భార్యలు ఉండేవారు, వారందరూ గొడ్రాళ్ళు కావటం చేత ఆయనకు సంతాన ప్రాప్తి కాలేదు. పేర్కొన్న సంఖ్య నిజమైతే, రాజుకు ఒక్కో భార్యను ఒక్కో రోజు వివాహం చేసుకోవటానికి ఆయనకు దాదాపు 27,397 సంవత్సరాలు పడుతోంది. అలాంటి విషయం జరగడం అనేది అసంభవం కాబట్టి, మనం అది ఒక కావ్య వర్ణన అని అర్థం చేసుకోవాలి. దీనిని అతిశయోక్తి అలంకారము అంటారు. సాహిత్య దర్పణం(10.46)లో అతిశయోక్తితో పాటు ఐదు రకాలుగా విభజించబడిన అనేక అలంకారాలకు నిర్వచనం ఇవ్వబడింది.

             ప్రఖ్యాత కవి దణ్డిన్ అతిశయోక్తి గూర్చి వివరణకు ఉదాహరణను పేర్కొన్నారు

            ” శ్వేత ధవళ వస్త్రాలు, తెల్లని మల్లెల మాలికలు ధరించి, అంగములు చందన చర్చితమై ఉన్న మగువలు తమ ప్రియుని కలయికకై  పున్నమి కాంతిలో కనుమఱుగై రహస్యముగా వేచియుండిరి“.

             ఇక్కడ మగువల వస్త్రధారణలోని తెలుపు కాంతిని గూర్చి ప్రస్తావించడానికి దాన్ని ఎక్కువ చేసి పున్నమి వెన్నెలలో మాయమగునని చెప్పడం జరిగింది. సరిగ్గా అదేవిధముగా చిత్రకేతుని పదిలక్షల పత్నుల ప్రస్తావన  రాజుకు గల పుత్ర కాంక్షను తెలియ జేసేందుకు చెప్పడం జరిగింది. పైన చెప్పిన విధముగా కథలోని ముఖ్య ఉద్దేశ్యము పాఠకుని మనస్సులో పరిత్యాగ భావన నాటడంమన మనస్సు ఎల్లప్పుడూ కోరికల మయంవేద శాస్త్రాల ప్రకారము, మూడు రకాల ముఖ్య కోరికలు ఉంటాయి, సుఖ ప్రాప్తికై కోరిక, భవిష్యత్తులో మంచి జీవనానికై కోరిక, మంచి సంతానము కోరి కోరిక ప్రస్తుత కథలో రాజు మంచి సంతానము విషయములో సఫలీకృతుడు కానట్లు, కోరికలు ఒక్కటీ  పూర్తిగా సఫలము అవ్వవు. 

                           అంగీర మహర్షి చిత్రకేతు మహారాజుకు హర్ష శోక ప్రదుడను(సుఖ దుఃఖాలను ఇచ్చేవాడు) కొడుకు పుడతాడని వరమిచ్చాడు. రాజు, కొడుకు జన్మించినపుడు ఆనందభరితుడయ్యాడు, కానీ ఆ బాలుడి సవతి తల్లులు ఈర్ష్యతో బాలుడ్ని విషమిచ్చి విగత జీవుడిని చేసారు. అప్పుడు రాజు దుఃఖ సముద్రములో మునిగిపోయాడు. విధముగా రాజు ఎప్పటికీ సంతృప్తి చెందలేదు.

   భావార్ధాల నుంచి మనం నేర్చుకోగలిగేది 

              ఈ కథలో ఉన్న భావార్ధము ఒక వ్యక్తి పదివేల లక్షల మంది పత్నులు ఉండి కూడా జీవితములో సంతృప్తి చెందకపోతే, ఏక పత్నీ వ్రతుడైన ఒక సాధారణ వ్యక్తి ఎలా సంతృప్తి పొందగలడు. చిత్రకేతు ఒక సామ్రాజ్యా ధిపతి, అతని  సేవలో లక్షల మంది పత్నులు ఉండి, అతని కోరిక ఫలించినప్పటికీ  కూడా అతను తృప్తి లేనివాడయ్యాడు. అలాంటప్పుడు, ఏకపత్నీ వ్రతుడైన, అనేక  కోరికలున్న, ఒక సాధారణ వ్యక్తి  ఎలా తృప్తి చెందగలడు?

                   ఈ కథలో భార్య అనే పదము కోరికలను సంతృప్తి పరచుకోవాలనే భావనకు చిహ్నముగా ఉంటుంది. అందువల్ల పైన శుకదేవ గోస్వామి (శ్రీమద్ భాగవతం 12.3.14) చెప్పినట్లు, ఇక్కడ చెప్పిన అంశాలు భాగవత పాఠకులలో, శ్రోతలలో  పరిత్యాగ భావనను చొప్పించడానికి మాత్రమే వాడడం జరిగింది.  

              “కోటి మంది భార్యలు” అనే పదమును అలంకారంగా భావిస్తే, దానర్ధం అతనికి అసలు భార్యలు లేరని అర్ధము కాదు- ఆ రాజుకు తప్పనిసరిగా అనేకమంది భార్యలు ఉండేవారు. కోటి మంది భార్యలు అనే సంఖ్య మానసిక స్థితుల(వృత్తులు)కి తార్కాణము. శ్రీమద్ భాగవతములో మనస్సును, దాని చలనాలను(వృత్తులను) భార్యలతో  పోల్చే ఉదాహరణలు 4.29.5వ శ్లోకమువలె చాలా ఉన్నాయి. ఈ అధ్యాయములో నారదుడు ప్రాచీనబర్హి అనే రాజుతో మాట్లాడుతూ, ఉపమానముగా పురంజన మహారాజు, తన రాణి పురంజని వ్యామోహములో ఎలా మునిగి ఉండేవాడో తెలిపే ఒక కథ చెప్తాడు. ఇక్కడ పురంజనిని మనం ఆ రాజు బుద్ధిగా అర్ధము చేసుకోవచ్చు అలానే అదే సమయములో దాని సాహిత్య భావములో దాన్ని అతని భార్యగా మనము భావించవచ్చు. జడ భరతుడు రహూగణకి ఇచ్చిన ఉపదేశములలో లక్షల కొలది వృత్తులు ఉన్నట్లు పేర్కొంటాడు. ఆయన నిజానికి పదకొండు వృత్తులు ఉన్నాయని అవి వేలు, లక్షల కొలది వృత్తులుగా రూపాంతరముగా చెందుతాయని తెలుపుతారు (శ్రీ భాగవతం 5. 11. 11). చిత్రకేతు అనే పేరు మనస్సు కోరికలతో నిండి ఉండటాన్ని(చిత్ర) సూచిస్తుంది. చిత్రకేతు కథలో ముగింపు మనము అనంతమైన కోరికలను సంతృప్తి పరచుకొంటూ భౌతికంగా సుఖంగా ఉండలేము. సుఖము లేదా తృప్తిని కేవలము మన వృత్తిని భగవంతునికి శరణాగతి చేసినప్పుడు లేదా అయన సేవలో వినియోగించినప్పుడు మాత్రమే పొందగలము. ఇదే చిత్రకేతుడు తరువాత చేసాడు.

          అందువల్ల భాగవతములో ఉన్న ప్రతి విషయాన్ని అక్షరాలా తీసుకోకూడదు, మన బుద్ధి కుశలతను వినియోగించి ప్రత్యక్షముగా, పరోక్షముగా కూడియున్న భావములను అర్థము చేసుకోడానికి మనం ప్రయత్నించాలి.  

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ఇద్దరు మనషులు ఒకే విధంగా ఆలోచించలేరు. అవతలి వ్యక్తి మీ మనస్సును నూరుశాతం తెలుసుకోలేరు మరియు మీ కోరిక ప్రకారం నూరుశాతం ఎప్పడూ పనిచేయలేరు. అవతలి వ్యక్తికి వారి స్వంత కోరికలు, ఆశలు మరియు పరిమితులు ఉన్నాయి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.