ఇప్పుడు అందరూ కరోనావైరస్ గురించి మాట్లాడుతున్నారు. మరే ఇతర చర్చనీయాంశం ఉన్నట్లు మనకు అనిపించుటలేదు. సామాజిక మాధ్యమాలు కరోనా వార్తలతో నిండి ఉన్నాయి. అందరూ కరోనా స్పృహలో ఉన్నట్లు అనిపిస్తుంది. గాలిలో వైరస్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చాలా చర్చలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయని మాత్రం నాకు తెలుసు.
నేను వార్తాపత్రికలు చదవను, టీవీ చూడను, కాబట్టి కరోనావైరస్ గురించి నా జ్ఞానం ఎక్కువగా నేను ఇతరుల నుండి విన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా దాని గురించి మూడు సిద్ధాంతాలు ఉన్నట్లు అనిపిస్తుంది:
1: ఇది వుహాన్ లోని ఒక మార్కెట్లో కొన్ని జంతువుల నుండి వ్యాపించింది.
2: ఇది అనుకోకుండా వుహాన్ లోని ఒక జీవ ప్రయోగశాల నుండి బయటపడింది.
3: ఇది వుహాన్ కేంద్రీకృతమైన 5 జి యొక్క దుష్ప్రభావం.
# 2 మరియు # 3 తో పాటు, ఇంకా ఎక్కువ కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా సంక్లిష్ట సిద్ధాంతము ఏమిటంటే, ఐరోపా దేశాలలో వృద్ధులను చంపడానికి ఇది ఉద్దేశపూర్వకంగా ఇంజనీరింగ్ చేయబడినది, ఎందుకంటే వారు పన్ను చెల్లింపుదారునికి పెద్ద భారం.
కారణం ఏమైనప్పటికీ, వైరస్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అగుపిస్తోంది. సాధారణ ప్రజలు, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. భారతీయులు దాని గురించి అంతగా ఆందోళన చెందటంలేనట్లు అనిపిస్తుంది, అయినప్పటికీ సమయం మారుతున్న కొద్దీ ఇది మారుతోంది. ఇప్పుడు భారతదేశంలో కూడా మరిన్ని కేసులు కనుగొనబడుతున్నాయి. ఇటువంటి అలజడులను మనం తట్టుకొని నిలబడగలటం బహుశా ఈ వ్యాధి గురించి పూర్తి జ్ఞానం లేక పోవడం వల్ల కావచ్చు లేదా అలాంటి అలజడులను మనం మెరుగ్గా ఎదుర్కొనగలడం ఐనా ఉండవచ్చు. నేను కూడా ఈ వైరస్ను చాలా సీరియస్‌గా తీసుకోలేదు, అందువల్లే మార్చి 22న సుమారు వెయ్యి మంది సాధువుల కోసం ఒక పెద్ద వార్షిక విందును ఏర్పాటు చేసాను. కానీ అంత పెద్ద సామూహిక కార్యక్రమాల యొక్క భయంకరమైన పరిణామాల గురించి తెలుసుకున్న తర్వాత నేను దానిని రద్దు చేసాను.
అనేక ఇతర విషక్రిములు వేలాది మందిని చంపినప్పటికీ, కరోనావైరస్ గురించి ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు , ఎందుకంటే దీనికి ఇంకా పరిష్కారం కనుగొనపడలేదు. అన్ని భయాలలోకెల్లా మరణ భయం అత్యంత ప్రాథమికమైనది.
మనకు చాలా ప్రీతిపాత్రమైనదాన్ని కోల్పోతామని భయం కలుగుతుంది. మనం కోల్పోయే విషయానికి మన అనుబంధం యొక్క తీవ్రతతో భయం యొక్క ప్రమాణ తీవ్రత ముడిపడి ఉంటుంది. మన స్వాధీనంలో ఎంత విలువైనది ఉంటే, దాన్ని కోల్పోయే భయం అంత తీవ్రంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న అత్యంత విలువైన విషయం మన స్వంత జీవితం, ఎందుకంటే మనం దాన్ని కోల్పోతే మిగతావన్నీ కోల్పోతాం. అందువలన, మరణ భయం గొప్ప భయం.
కరోనావైరస్ ఘోరమైనది. ఇది అదృశ్యమైనది, కాబట్టి అది ఎవరి వద్ద ఉందో మనకు తెలియదు. దీని ప్రారంభ లక్షణాలు ఇతర జలుబు మరియు ఫ్లూల నుండి భిన్నంగా కూడా లేవు. కాబట్టి మనకు అసలు కరోనా ఉందో లేదో కూడా తెలియదు. అంతేకాక, దీనికి చికిత్స చేయడానికి ఇంకా ఔషధము కూడా అందుబాటులో లేదు.
వైరస్ భయంతో పాటు, దానికి సంబంధిత ఆందోళనలు కూడా ప్రబలంగా ఉన్నాయి. అవి ఆహార కొరత కావచ్చు. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణించలేక పోవటము, షాపింగ్ చేయలేక పోవటము లేదా ఇకపై వారు తమ ఉఫాధి కూడా కోల్పోవటం వంటివి. వీటి ఫలితముగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవచ్చు. ప్రజలు గొప్ప నిరాశవంతమైన రాబోయే కాలాన్ని అంచనా వేస్తున్నారు. ఇది 1930 నాటి మాంద్యం కంటే కూడా ఘోరంగా ఉండొచ్చని అంటున్నారు. భవిష్యత్తు గురించి ఒక అనిశ్చితి ఉంది మరియు మొత్తంగా చాలా దిగులు కూడా కనిపిస్తుంది.
ఈ దిగులుగా ఉన్న పరిస్థితిని ఎలా జీర్ణించుకోవాలో మనం ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే దాని గురించి ఆందోళన చెందుతూ మన శాంతిని కోల్పోవచ్చు లేదా జీవితం యొక్క లోతైన అర్ధాన్ని క్షుణ్ణముగా ఆలోచించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి మేఘానికి వెండి పొర ఉన్నట్లే ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా మన ఎదుగుదలకు పెరుగుదలకు గొప్ప అవకాశము.
భగవద్గీత (2.27) లో, మన నియంత్రణకు మించిన విషయాల గురించి మనం ఆందోళన చెందవద్దని శ్రీకృష్ణుడు చెప్పారు. మనం నియంత్రించగల విషయాల గురించి ఆలోచించడం మంచిదని ఇది సూచిస్తుంది. అనివార్యమైన చింత మరియు భయం మన శ్రేయస్సుకు దోహదం చేయవు. మరణం అనివార్యం, అది మన నియంత్రణకు మించినది. మనం జీవిస్తున్న విధానం మన నియంత్రణలో ఉంది. ప్రాణాంతక వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, కాని మన ప్రశాంతతను కోల్పోకూడదు.
కరోనావైరస్ను మనం మానసికంగా మరియు మేధోపరంగా బలంగా మారడానికి అవకాశంగా చూడవచ్చు. అందువల్ల, దీనిని “కరోనా శాపం” గా చూడటానికి బదులుగా మనం దీనిని “కరోనా కరుణ” గా చూడవచ్చు.
శ్రీ భాగవతము(10.14.8) లో, బ్రహ్మ ప్రతి మంచి లేదా చెడు పరిస్థితిలలోనూ శ్రీకృష్ణుని యొక్క దయను (కరుణ)చూడటానికి ప్రయత్నించాలని, మరియు మంచి లేదా చెడు ఫలితాలు మన స్వంత కర్మ ఫలితమేనని గ్రహించాలని చెప్పారు. మన జీవితంలో అన్ని మంచి మరియు చెడు పరిస్థితులు వ్యక్తిత్వ కర్మ లేదా సమష్టి కర్మ కారణంగా జరుగుతాయి. మన కర్మలు మన చర్యలపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి అవి పాక్షికంగా మన నియంత్రణలో ఉంటాయి. అందువల్ల, మనము తీసుకున్న ఏ వ్యక్తిగత మరియు సమిష్టి చర్యలు కరోనావైరస్ మహమ్మారి వంటి పరిస్థితులకు దారితీశాయని ఆలోచించాలి మరియు భవిష్యత్తులో ఆ చర్యలను ఎలా నివారించాలో కూడా తెలివిగా గుర్తించగలగాలి .
ఉదాహరణకు, కరోనావైరస్ జూనోటిక్ (జంతువుల నుండి మానవులకు బదిలీ చేయబడినది) కాబట్టి, సమాజంగా మనం మన మాంసాహార సాంస్కృతిక ప్రమాణాలను నిశీతముగా పరిశీలించాలి.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా వైరస్ తో పోరాడటానికి యోగా, ప్రాణాయామం, ఆసనాలు మరియు ధ్యానం చేయమని సిఫారసు చేస్తుంది. ఈవిధముగా కాకతాళీయముగా కరోనా మహమ్మారి ఈ విషయాలపై మన ఆసక్తిని మరియు అభ్యాసాన్నిపెంచుతుంది.
మనల్ని గృహ నిర్బందానికి పరిమితవ్వాలని సలహాలు ఇస్తున్నారు. చాలా కంపెనీలు ఇంటి నుండే పనిచేయమని సలహా ఇస్తున్నాయి. రోజంతా కరోనావైరస్ వార్తలను వినడం ద్వారా పూర్తిగా దుఃఖ సాగరములో కొట్టుకుపోయే బదులు “జప నిర్బంధ” ఆచరణతో – ఇంట్లో ఉండి, సాధ్యమైనంతవరకు కృష్ణుని నామాన్ని జపిస్తూ ఇతర ఆధ్యాత్మిక ప్రగతిశీల కార్యకలాపాలు మనము ఎందుకు చేయకూడదు. ఇవి మన ఆందోళనను తగ్గిస్థాయి మరియు బ్రహ్మ సూచించినట్లు ( “తత్ తే అనుకంపామ్ సుసమీక్షమాణో” పైన చెప్పినట్లు ) అన్ని మంచి మరియు చెడు పరిస్థితులలో కరుణ స్పృహతో ఉండటానికి మనకు దోహదపడతాయి. శ్రీకృష్ణుని గుర్తుంచుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు అలానే ఆందోళనలో ఉండటం వల్ల మంచి కూడా జరుగదు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.