కీర్తన అపరాధం చేయకుండా చేయాలి (5)

SandarbhasComments Off on కీర్తన అపరాధం చేయకుండా చేయాలి (5)

        నేటి ఇంటర్నెట్ కాలంలో సామాజిక మాధ్యమాలవల్ల మనుషులు చాలా ప్రభావితమౌతున్నారు. రకరకాల జీవనశైలిలు, ఆహార వ్యవహారాలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడంవల్ల ప్రసిద్ధి చెందుతున్నాయి. వాటిని చదివేవారు లేదా చూసేవారు వాటి ఉపయోగాన్ని నమ్మి వాటిని  వారి జీవితాల్లో ఇముడ్చుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే మనస్సులో ఒక సందేహం కలుగవచ్చు. శాస్త్రంలో కీర్తన చాలా పొగడబడింది. సామాజిక మాధ్యమాలలో కీర్తనకు సంబంధించి కూడా బోలెడు వీడియోలు, వ్యాసములు, ప్రవచనాలు ఉన్నాయి. మరి జనము కీర్తన ఎందుకు చేయడంలేదు? ఈ ప్రశ్నకు సమాధానం భక్తి సందర్భములో ఈ క్రింది అనుచ్ఛేదములో ఇవ్వబడింది.

274వ అనుచ్ఛేదము

           ఈ విధంగా కలియుగంలో భగవంతునియందు పరమ భక్తి(భగవత్-పరాయణత్వ) కేవలం కీర్తన ప్రచార ప్రభావంచేతనే సాధ్యమని చూపించబడింది. కానీ, మతభ్రష్టమైన వారి ప్రభావంతో కొందరు నామానికి అపరాధం చేస్తూ నామకీర్తన చేస్తారు. అలాంటివారు భగవంతునిపట్ల విముఖతతో ఉంటారు(తద్-బహిర్ముఖ). శ్రీ శుకదేవ మహర్షి ఈ విషయాన్ని క్రింద రెండు శ్లోకాలలో వ్యతిరేక అనుమితి(వ్యతిరేకము)తో నొక్కి చెప్తారు.

       ఓ రాజా, కలియుగంలో మనుష్యుల మనస్సులు ధర్మవిరుద్ధమైన ఆలోచనలతో అయోమయంలో ఉంటాయి, కావున త్రిలోకాధిపతులచేత(బ్రహ్మ వంటి) పూజించబడే విశ్వమునకు పరమ గురువైన భగవాన్ అచ్యుతుని వారు ఆరాధించరు.

    కలియుగంలో మనుష్యులు, ఎవరి నామ ఉచ్చారణతో నిస్సహాయతతో మృత్యువడిలో ఉన్నవారు, రోగంతో బాధపడుతున్నవారు, తడబడుతూ లేదా నత్తితో మాట్లాడేవారు కూడా కర్మ బంధవిమోచనులై పరమగతిని పొందుతారో ఆయనను(భగవంతుని) ఆరాధించరు.

ఈ శ్లోకాలకు అర్థం స్పష్టము.

వ్యాఖ్యానం

          కీర్తన చాలా సులభమైన మరియు ప్రబలమైన ప్రక్రియ అయినాకూడా ప్రస్తుత కాలంలో ప్రజలు దానిని చేయడంలేదు. దీనికి కారణం వారు నామ అపరాధం చేయడమే. అపరాధం వలన ప్రక్రియమీద విశ్వాసం లభించదు. అపరాధం యొక్క పర్యవసానం 153వ అనుచ్ఛేదములో వివరించబడింది. సాధారణంగా ప్రజలకు జీవిత ప్రయోజనంపై ఒక అవగాహన ఉండదు. వేదాలకు విరుద్ధముగా అనేక దర్శనాలు ధర్మవిరుద్ధమైన భావాలను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వాటిని అనుసరించే వారు కీర్తనమీద ఆసక్తి చూపరు, ఒకవేళ చూపినా వారి అపరాధ స్వభావంవల్ల కోరుకున్న ఫలితాన్ని వారు పొందలేరు.

           ప్రస్తుత కాలంలో యోగా సంఘాలలో, ఆధునిక ఆధ్యాత్మవేత్తలలో మరియు తత్త్వము నిరాకారమని విశ్వసించే వారిలోనూ కీర్తన ప్రసిద్ధి పొందుతుంది. కానీ, వారిలో చాలా మందికి కీర్తన నియమాలపై అవగాహన లేదు. ఈ రోజుల్లో “కీర్తన ఫెస్ట్” అని పెద్ద సంఖ్యలో ప్రజలు కీర్తనలో పాల్గొంటున్నారు. అలాంటి ఉత్సవంలో పాల్గొనే చాలా మందికి అది కేవలం మంచి అనుభూతి లేదా శాంతి పొందడానికి సంబంధించింది, అది ఒక భక్తి ప్రక్రియకాదు, అలానే  భగవంతుని సంతృప్తి పరచడానికీ కాదు. కీర్తన వల్ల ఉద్దేశించిన ఫలితం పొందడానికి శ్రీ జీవ గోస్వామి ఇక్కడ పొందుపరచిన జ్ఞానం చాలా ముఖ్యమైనది.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    ఒకరిని ద్వేషించడం ద్వారా మీరు అతని స్థాయికి పడిపోతారు. కాబట్టి మీరు ఒకరిని ద్వేషిస్తే, అతని కంటే మీరే గొప్పవారని ఆలోచిస్తూ గర్వపడకండి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.