ప్రశ్న: సాధారణ వ్యక్తికి అసూయ ఉంటుంది, దీన్ని జయించడం ఎలా?
సమాధానం: అసూయ అజ్ఞానం వలన మరియు మనకు శరీరం లేదా ఆత్మపై ఉన్న అనురాగం వస్తుంది. మనం మొదట అసూయ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఈర్ష్య అసూయ అనే పదాలకు సదృశమైన అర్థాలున్నప్పటికీ సూక్ష్మవ్యత్యాసం ఉంది. వేరొకరికి మన కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వారికున్నది మనం కోరుకోవడాన్ని ఈర్ష్య అంటారు. దానివల్ల ఆ వ్యక్తిపట్ల మనం ఈర్ష్యాభావము కలిగిఉంటారు. మీకు సంబంధించిన వ్యక్తి లేదా వస్తువు వేరెవరికైనా దక్కుతుందేమో అనుకోవడం అసూయ. ఈ రెండిటికి మూల కారణం ఒకరి ఆత్మపై ఉన్న అజ్ఞానమే. ప్రతిఒక్కరు భిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటాము. ప్రతి ఒక్కరికీ వివిధ కర్మలు మరియు సామర్థ్యాలు ఉంటాయి. కొంతమందికి మీకన్నా ఎక్కువ ఉండచ్చు మరొకొందరికి తక్కువ ఉండచ్చు. మన ఆధీనంలో లేని అంశాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. మన ఆధీనంలో లేని వాటిగురించి బాధపడి ఈర్ష్య మరియు అసూయలకు లోనయ్యేబదులు వాటిని అంగీకరించడమే వివేకము.
కేవలం మీరు మాత్రమే ఎవరినైనా పొందాలనుకొన్నప్పుడు అసూయ అనేది పుడుతుంది. ఉదాహరణకు అది మీ భాగస్వామి, సన్నిహితుడు లేదా మీ ఆధ్యాత్మిక గురువు కావచ్చు. ఇది భౌతిక అనుబంధం వలన కలుగుతుంది. నిజానికి మనకు మన శరీరంతో సహా ఏదీ స్వాధీనంలో లేదు. “మీకు ఇలాంటి శరీరం కావాలా? మీకు స్త్రీ లేక పురుషుని శరీరం కావాలా?” అని ఎవరూ మిమ్మల్ని అడగలేదు. మీరు దాన్ని కోరుకోలేదు, అది లభించిందంతే. ఐతే, “నాకు ఇలాంటి శరీరం ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పొడుగు లేదా బలమైన లేదా సన్నని శరీరం కావాలి!” అని మీరు కృంగిపోవచ్చు. ఇలా మీరు అకారణంగా దుఃఖపడుతూ ఉంటారు. ఇవన్నీ మీ పూర్వ కర్మ ఫలితాలుగా మీరు అర్థం చేసుకుంటే దానిని అంగీకరించగలుగుతారు. అప్పుడు మీరు కలతచెందరు, అసూయ చెందరు లేదా ఈర్ష్యకు లోనవ్వరు.
అంతిమంగా, ఈర్ష్య అసూయలు మీ మనస్సుకు మాత్రమే కాకుండా ఇతరుల మనస్సులకు కూడా శాంతి లేకుండా చేస్తాయి. నాకు మరియు ఇతరులకు బాధలను సృష్టించడం వల్ల ఉపయోగం ఏమిటి? నా జీవిత గమ్యం మరియు నా పరిస్థితులను చక్కగా అర్థంచేసుకుంటే ఈ అనవసర బాధలను నేను తొలగించవచ్చు. మనం మనల్ని “నేను ఎందుకు ఈర్ష్య మరియు అసూయ కలిగి ఉన్నాను? వీటి వల్ల నాకు కలుగుతున్న లాభమేంటి?” అని ప్రశ్నించుకోవాలి.
ఒకరిని ప్రేమిస్తున్నంతమాత్రాన వారు మనకి సొంతం కాదు. వారికి వారి స్వయం అభిప్రాయాలు మరియు అభిరుచులు ఉంటాయి. కానీ ప్రేమ పేరుతో మనం ప్రేమిస్తున్న వారిని ఒక బొమ్మలాగా మార్చి వారిని సొంతంచేసుకోవాలని మరియు నియంత్రించాలనుకుంటాము. తన బిడ్డను ఆటబొమ్మలాగా భావించే ఒక తండ్రివలె. అతడు తన బిడ్డ అనుభవాన్ని పట్టించుకోకుండా గాలిలో ఎగరవేసి పట్టుకోవడం ఆస్వాదిస్తాడు. కానీ ఇది ప్రేమ కాదు. ప్రేమంటే నియంత్రణ మరియు స్వాధీనం కాదు. ప్రేమంటే మనం ప్రేమిస్తున్న వారిని ఆనందింపజేయాలని మరియు సేవించాలని కోరుకోవడం.
అసూయ వల్ల మనం కుటుంబ సభ్యులను మరియు ప్రేమిస్తున్న వారిని పెంపుడు కుక్కలలాగా చూస్తాము. మీరు మీ కుక్కని ప్రేమిస్తున్నట్లు చెప్పచ్చు కానీ దాని మెడకి గొలుసుకట్టి దాని స్వాతంత్ర్యాన్ని నిర్బంధిస్తారు. ప్రేమపేరుతో మీ కుక్కను తాడుతో కట్టేస్తారు. ఇది ప్రేమ కాదు. ఇదే రీతిలో మనం ప్రేమిస్తున్నామనుకుంటున్న వారిని అణచివేస్తాము మరియు నిర్బంధిస్తాము, మనం చెప్పినవాటన్నిటికీ వారు తందానపాడాలనుకుంటాము. కానీ, మనుష్యుల మధ్య సంబంధాలు ఇలా ఉండలేవు. అందరికి వారి ఇష్టాలు, కోరికలు మరియు అవసరాలు ఉంటాయి. తప్పకుండా, ఇలాంటి సంబంధార్థకమైన సంబంధములు ఉద్రిక్తత, విభేదాలు, విరోధములకు గురై చివరకు విడిపోతాయి.
అసూయ మరియు ఈర్ష్యలు సరియైన అవగాహనతో నివారించగల మానసిక స్థితులు. మన శరీరానికి జబ్బు చేసినట్లు మన మనస్సుకి కూడా జబ్బు చేయవ చ్చు. కాకపొతే, సూక్ష్మమైన మానసిక రోగాలకంటే శారీరిక రోగాలను నయం చేయడం సులువు. అంతేకాక, మన మనస్సు మన మానసిక సమస్యలను పరిష్కరించడానికి కావాలి. రోగముతో ఉన్న మనస్సు దాని రోగాన్ని గుర్తించి మానసిక సమస్యలను ఎలా తొలగించగలదు? కాబట్టి, మనం సరైన పరిహారానికి ఇతరులనుండి సహాయం పొందాలి.
ప్రశ్న: అసూయ అనే పదానికి సంస్కృత భాషలో పదం ఏమిటి?
సమాధానం: అసూయ సంస్కృతంలో అసూయా అనే పదం. అనసూయా అనే పేరు మీరు వినేవుంటారు. అనసూయా అత్రి ముని భార్య. అనసూయా అంటే “అసూయ మరియు ఈర్ష్య లేనిది” అని అర్థం, అత్రిలో “త్రి” అంటే సత్త్వము, రజస్సు మరియు తమస్సు. “అ” అంటే వ్యతిరేకం. అంటే, ఈ మూడు గుణములకు అతీతుడైనవాడని అర్థం. అత్రి మరియు అనసూయ దత్తాత్రేయ, దుర్వాస మరియు సోమలకు జన్మనిచ్చారు. భగవంతుడు మీకు పుత్రుడిలా కావాలంటే మీరు అనసూయులు కావాలి. అసూయ ఉన్నచోట భగవంతుడు వ్యక్తమవ్వడు.
గోపికలతో ఉన్న కృష్ణుడి చిత్రాలు మీరు చూసేఉంటారు. కృష్ణుడు అనేక మంది గోపికలతో ఉంటాడు. గోపికలమధ్య పరస్పరం అసూయ ఉండదు. అందుకనే కృష్ణుడు వారితో నాట్యం చేస్తాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఇద్దరు స్త్రీలు ఒకే పురుషుడిని ఇష్టపడితే ఒకరంటే ఒకరికి అసూయ కలిగిఉంటారు. పూర్వం రాజులకు అనేకమంది భార్యలు ఉండేవారు, వారు ఒకరినొకరు పరస్పరం ద్వేషించుకొనేవారు. గోపికలు మాత్రం, అసూయ లేని స్త్రీలకు ఒక ఉదాహరణ. అందుకనే కృష్ణుడు వారితో ఆడిపాడుతున్నాడు. మన హృదయం అసూయతో నిండిఉంటే భగవంతుడు అక్కడినుండి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయనకు అసూయ ఛాయ కూడా నచ్చదు.
భావోద్వేగాలు సుగంధాలకు సంబంధించినవి. అరోమా థెరపీ దీని ఆధారంగా పనిచేస్తుంది. ఒక వాసన మీ మనస్సులో ఒక నిర్దిష్ట భావాన్ని ప్రేరేపిస్తుంది. పెర్ఫ్యూమ్ పరిశ్రమ కూడా అదే సూత్రంతో నడుస్తుంది. మీలో రాగాన్ని ప్రేరేపించే రకరకాల సుగంధ తైలాలను కలిపి పెర్ఫ్యూమ్ తయారు చేయడమే వారి వ్యాపారం. కానీ, భగవంతుడికి అలాంటి పెర్ఫ్యూమ్స్ పై అభిరుచి లేదు. ఆయన అసూయ మరియు ఈర్ష్య లేని ప్రేమ అనే సుగంధాన్ని ఇష్టపడతాడు. అసూయ మరియు ఈర్ష్యకు మూలమైన కామాన్ని ఆయన ఇష్టపడడు. భగవంతునికి సేవ చేయాలంటే అసూయ మరియు ఈర్ష్య లేకుండా ఉండాలి. మన మనస్సులో అసూయ ఉంటే భగవంతుడు ఆనందంగా ఉండడు ఎందుకంటే మనం ఎవరిమీద అసూయపడుతున్నారో వారుకూడా ఆయనకు చెందినవారే. ఉదాహరణకు, పరస్పరం అసూయతో ఉన్న ఇద్దరు పిల్లలుగల ఒక తండ్రి లాగ. కాబట్టి, మీరు భగవంతునికి సేవ చేయాలనుకుంటే మరియు అది ఆయన స్వీకరించాలంటే అసూయ మరియు ఈర్ష్యలను మీరు వదిలేయాలి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.