భాగవత పరంపర
నామరస దాసతో బాబాజీ వారి పోడ్కాస్ట్ ముఖాముఖి తర్వాత ఈ క్రింది ప్రశ్నలు అడుగబడ్డాయి.
ప్రశ్న: మన సాంప్రదాయములో భాగవత పరంపర అనేది తరచుగా వాడే మాట, కానీ మీరు దాన్ని సందేహిస్తున్నారని అగుపిస్తున్నది. నాకు శిక్షా పరంపర, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని హరికథ లేక ఆధ్యాత్మిక సూచనల ద్వారా పొందే విధానం మరియు భాగవత పరంపర మధ్య వ్యత్యాసం లేదని అనిపిస్తుంది. మీరు దయచేసి దీని గూర్చి వివరణ ఇవ్వగలరు.
సమాధానం : భాగవత పరంపర అనే పదం వాడటం శ్రీమద్ భాగవతం ఆవిష్కృతం అయ్యే సందర్భములో నేను చదివాను. శ్రీమద్ భాగవతంలో అలాంటి రెండు ప్రస్తావనలు పరంపర గూర్చి చెప్పడం జరిగింది. వీటిలో మొదటిది శ్రీకృష్ణుని నుండి వస్తుంది. శ్రీకృష్ణుడు చతుశ్లోకీ భాగవతాన్ని బ్రహ్మకు చెప్పడం జరిగింది. ఆయన దాన్ని తన కుమారుడైన నారదునికి చెప్పారు. శ్రీ నారదుడు శ్రీ బాదరాయణ వ్యాసులకు దాన్ని బోధించడం జరిగింది. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు భాగవతం ఆవిష్కృతమైనది. అదే మనందరికీ నేడు లభ్యమైనది. వ్యాసుడు తన కుమారుడైన శుకదేవులకు దాన్ని చెప్పడం జరిగింది. శుకదేవుల వారు గంగా తీరములో పరీక్షిత్ మహారాజుకు దాన్ని చెప్పడం జరిగింది. సూత గోస్వాముల వారు అక్కడ ఉన్న శ్రోతలలో ఉన్నారు. ఆయన నైమిశర్యాణాయంలో శౌనక ఋషి నేతృత్వంలో ఉన్న మునులకు దాన్ని మరలా చెప్పడం జరిగింది.
ఇక రెండవ భాగవత పరంపర శ్రీ సంకర్షణనుని నుండి వచ్చేది. ఆయన భాగవతాన్ని బ్రహ్మమానసపుత్రులైన సనకాదులకు భోదించారు. నేను ఈ రెండు పరంపరల గూర్చి పండితులచే రచించిన కొన్ని వ్యాసాలు చదివాను. కానీ, వేరే విధముగా ఈ వాక్యాన్ని వాడటం చూడలేదు. నేను కొందరు ఇస్కానుకు చెందిన భక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి పరంపర విషయములో ఈ వాక్యం వాడటం వినడం జరిగింది. మీరు ఇప్పుడు మళ్ళా “మన సాంప్రదాయం” అని చెప్తూ ఈ వాక్యం వాడటం చూస్తున్నాను. మీ దృష్టిలో “మన” అంటే ఇస్కాన్ /గౌడీయ మఠమని నాకు అర్ధం అవుతుంది. ఒక వేళ మీరు “మన” అంటే గౌడీయ సంప్రదాయం అని అంటే అది నిజం కాదు. నేను ఇస్కాన్ వారితో ఈ వాక్య అర్ధం గూర్చి వివరణ కోరినప్పుడు సరైన సమాధానం రాలేదు. ఇదే నేను నా ముఖాముఖిలో కూడా చెప్పాను : “వారి అర్ధం ఏమిటో నాకు తెలియదు”. శ్రీపాద స్వామి బీవీ త్రిపురారి మహారాజుల వారు దీని గూర్చి ఒక పుస్తకం వ్రాసినట్లు ఎవరో చెబితే విన్నాను కానీ నేను దానిని చదవలేదు. కనుక నేను మీరు శిక్ష పరంపర మరియు భాగవత పరంపర గూర్చి వివరణ కోరుతూ అడిగే ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేను. ఒక వేళ మీరు చెపుతున్న విధముగా ఆ రెండిటికి వృత్యాసము లేనట్లయితే రెండు వేరు వేరు పేర్లు ఎందుకున్నాయి? ఖచ్చితముగా వాటి మధ్య భేదము వుండే అవకాశం ఉంది.
ప్రశ్న: మీరు నామరస దాసతో యూట్యూబ్ ముఖాముఖి సందర్భముగా, భాగవత పరంపర గూర్చి ప్రస్తావించడం జరిగింది. మధ్వ తీర్థ సన్యాసులను మన గౌడీయ సాంప్రదాయములో భాగముగా భావించవచ్చా? నేను ఈ మధ్య శ్యామానంద పండితునకు చెందిన వృందావనములోని రాధా శ్యామసుందర్ మందిరంలో మద్వాచార్య సాంప్రదాయానికీ వారికీ ఎటువంటి సంబంధం లేదని తెలుపుతూ ఇంగ్లీష్, హిందీ మరియు బెంగాలీ లో ఉన్న సూచికను చూసాను. నేను వేరే వైష్ణవ పండితుల వద్ద కూడా దీన్ని వినడం జరిగింది, దీని గూర్చి మీ అభిప్రాయం తెలుపగలరు.
సమాధానం: ఇది ఒక వివాదాస్పద విషయం. దీని గూర్చి భిన్నాభిప్రయాలు ఉన్నాయి, నేను కేవలం నా అభిప్రాయం చెప్తాను. మనం మధ్వాచార్య సాంప్రదాయమునకు చెందుతాము. ఇది వృందావనములో వుండేటి గౌడీయ వైష్ణవులకు గల అవగాహన. వృందావనములో చాలా పురాతనమైన, గుర్తింపు గల అఖిల భారత మాధ్వ గౌడేశ్వర మహాసభ అనేది ఉంది. ఈ సంస్థలో తరచుగా సభలు జరుగుతాయి మరియు శ్రీ మద్వాచార్యుని జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వృందావనములో శోభ యాత్ర కూడా జరుగుతుంది.
కానీ సిద్ధాంత పరముగా మరియు ఆచరణ పరముగా కొన్ని కొన్ని భేదాలు ఉండవచ్చు. వీటిని వ్యతిరేకరించే వారు మనము శ్రీ మధ్వ సాంప్రదాయానికి చెందమని అంటారు. వారి వాదనలో బలం ఉంది.
ఇక్కడ గల అబిప్రాయభేదాలకు నేను అనుకొనే పరిష్కారం ఏమిటంటే శ్రీచైతన్య మహా ప్రభువు కృష్ణ ప్రేమను ఇవ్వటానికి వచ్చారు మరియు ఆయన “గౌడీయ వైష్ణవము” అని ఒక కొత్త మార్గాన్ని స్థాపించారు. ఆయన స్వయముగా కృష్ణుడే అయినప్పటికీ దీక్ష అనే ప్రక్రియను ఆయన స్వీకరించారు. అందుచేత మనం ఆ సాంప్రదాయముతో కొన్ని భేదాలు ఉన్నప్పటికీ శ్రీ మద్వాచార్య సాంప్రదాయమునకు చెందుతాము. మనం మధ్వ సాంప్రదాయమునకు చెందిన ఒక శాఖే. అలా భేద మరియు అభేద రెండూ మనలో ఉన్నాయి – మధ్వ సాంప్రదాయంతో ఏకమే మరియు అదే విధముగా భిన్నమే కూడా.
ఇద్దరు మనషులు ఒకే విధంగా ఆలోచించలేరు. అవతలి వ్యక్తి మీ మనస్సును నూరుశాతం తెలుసుకోలేరు మరియు మీ కోరిక ప్రకారం నూరుశాతం ఎప్పడూ పనిచేయలేరు. అవతలి వ్యక్తికి వారి స్వంత కోరికలు, ఆశలు మరియు పరిమితులు ఉన్నాయి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.