ఈ క్రింది వ్యాసం రాబోయే శ్రీమద్ భాగవత పురాణంలోని మొదటి స్కంధము యొక్క అనువాదంలో ఒక భాగము.
ప్రస్థానత్రయములను (పది ప్రధాన ఉపనిషత్తులు, వేదాంత సూత్రములు, భగవద్గీత) అన్ని వేదాంత పాఠశాలలు అంగీకరిస్తాయి మరియు వాటి ఆధారముగా తమ తమ వాదములను ప్రతిపాదిస్తాయి. శ్రీవల్లభాచార్యుడు శ్రీమద్ భాగవతమును ఆ మూడు ప్రమాణాలతో పాటుగా ఇంకో ప్రమాణముగా చేర్చారు. శ్రీల జీవ గోస్వామి ఇంకొక అడుగు ముందుకు వేసి శ్రీమద్ భాగవతమును సర్వోన్నత ప్రమాణమని, ప్రమాణ శిరోమణి అని అన్నారు.
శ్రీమద్ భాగవతము పురాణముల విభాగమునకు చెందినది అయినదియైనప్పటికీ , అధికార పూర్వకముగా చూస్తే వేదములతో సమానముగా చెప్పబడింది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు “వేదములన్నింటి చేత తెలుసుకొనబడు వాడిని నేనే” అని ధ్రువీకరించారు (శ్రీమద్ భగవద్గీత 15.15). శ్రీమద్ భాగవతము నిరద్వందముగా శ్రీకృష్ణ భగవానుని గూర్చి పరమ సత్యాన్ని ప్రత్యక్షముగా తెలియచెప్పే పురాణము. శుకదేవ గోస్వాములవారు పరీక్షిత్ మహారాజుకు చెప్పిన ఉపదేశములలో ఈ విషయాన్ని నొక్కి ఒక్కాణించారు “ఈ విశ్వమునకు మూలాధారమైన భగవంతుడైన హరి (కృష్ణుడు) గూర్చి పదే పదే ఈ గ్రంథములో ప్రస్తావించడం జరిగింది”( శ్రీమద్ భాగవతము 12.5.1)
శ్రీమద్ భాగవతం చివరి అధ్యాయం మునుపు సూత గోస్వాముల వారు మొత్తము విషయ సారాంశాన్ని క్లుప్తముగా విశదీకరిస్తారు. “ఇచ్చట (శ్రీమద్ భాగవతములో పాపములన్నింటినీ ప్రక్షాళన గావించే నారాయణుడు, హృషికేశుడు మరియు సాత్వతుల పతియైన, కృష్ణుని గూర్చి ప్రత్యక్షమముగా చెప్పపడింది. ( శ్రీమద్ భాగవతం 12.12.3).
శ్రీమద్ భాగవతము వేదములతో సమానమైనదనే విషయము ప్రత్యక్షంగా గ్రంథములోని ఈ వివరణల ద్వారా కూడా అవగతమవుతోంది “భాగవతమనే ఈ పురాణము వేదములకు సమానం (సమ్మితం)” (శ్రీమద్ భాగవతం 1.3.40). సమ్మితమ్ అనే పదానికి అర్ధం “సమానం”, “పోలిన”, “లాంటిది”, “సరి సమానమైనది” అనేవి . కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోదగ్గ విషయం భాగవతం వేదములకు సమానమైనది లేక సరి సమానమైనది అనేది. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం శ్రీమద్ భాగవతం యొక్క అధికారం వేదములతో సమానమైనది మరియు వేదసారమైన సర్వోత్కృష్ట కృష్ణుని గూర్చి జ్ఞానాన్ని మనకు తెలుపుతుంది.
సూత గోస్వాముల వారిని సందేహ నివృత్తి కొరకు ప్రశ్నిస్తూ శౌనక ఋషి శ్రీమద్ భాగవతమును వేదములకు పర్యాయ పదమైన శృతి అనే పదంతో పిలుస్తారు.
“ఓ నా ప్రియ సూతగోస్వామి!, ఋషి పుంగవుడు లాంటి పాండవ వంశోద్భవుడైన పరీక్షిత్ మహారాజుకు మరియు మితభాషియైన శుక గోస్వామికి మధ్య వైష్ణవ శృతిని గూర్చి తెలిపే సంవాదము జరిగింది?” ( శ్రీమద్ భాగవతం 1.4.7 ).
శ్రీ శుకదేవుల వారు పరీక్షిత్ మహారాజుకు తన స్వాధ్యాయము గూర్చి తెలుపుతూ భాగవతమును వేదములతో సమానమైనదని పేర్కొంటారు : “ఈ భాగవతమనే పురాణం వేదములతో సమానమైనది. నేను దీనిని నా తండ్రి అయిన ద్వైపాయన వ్యాసుని నుండి ద్వాపర యుగాంతములో నేర్చుకున్నాను.” (శ్రీమద్ భాగవతం 2.1.8). ఇక్కడ కూడా భాగవతం వేదములతో సమానమైందనే విషయం తెలిపేందుకు సమ్మితం అనే పదం వాడబడింది. ద్వాపర -ఆదౌ అనే పదానికి సాధారణ అర్ధం “ద్వాపరము మొదటిలో” అనేది , కానీ బహువ్రిహి ప్రకారం దాని ఆవల అని. ఆ విధముగా ఆ పదానికి “ద్వాపరాంత కాలానికి మొదటిలో” అనేది అర్ధం. ఇక్కడ ఆదౌ మరియు ద్వాపరం అనేవి యోగ్యతను చూపుతాయి అలానే “ఆ కాలమనేది” బాహ్య సంకేతాలను సూచిస్తుంది.
సూతగోస్వాముల వారు శ్రీ శుకదేవుని మరియు పరీక్షిత్ మహారాజు మధ్య సంవాదన గూర్చి తెలుపుతూ భాగవతమును వేదములతో సమానమైనదని అంటారు: “ఆయన భాగవతమనే వేదములతో సమానమైన మరియు బ్రహ్మ కల్పము మొదటిలో భగవంతునిచే బ్రహ్మకు చెప్పబడిన పురాణాన్ని పఠించిరి ( శ్రీమద్ భాగవతం 2.8.28).
పైన చెప్పిన ఉదాహరణలచే, మన పురాణాలలో శ్రీమద్ భాగవతము వేదములతో ఒకటి లేదా సమానముగా ఉండటంచేత దానికి గల వైశిష్ట్యత తేటతెల్లమవుతోంది. ఇంకాచెప్పాలంటే, వేద వృక్షం నుండి వచ్చే పరిపక్వమైన ఫలముగా భాగవతం నిర్ధారించబడింది. కాబట్టి దాని ప్రాముఖ్యత మరిన్ని రెట్లయింది. ఒక చెట్టుకు ఫలమనేది ఎంతో గుర్తించదగ్గ సంపద మరియు మిగతా అంగములకన్నా స్పష్టముగా ఎంతో రుచికరమైనది కూడా. రచయిత దానిని ఈ విధముగా పొగుడుతారు.
“ఓ భక్తులారా! శ్రీ భగవానుని దివ్య ప్రేమ రసానుభూతిలో శ్రేష్టులారా మరియు భావజ్ఞులు ఐన భక్తవరేణ్యులారా మరల మరల భాగవతమనే మహాఫల వేదమనే కల్పవృక్షం నుండి వచ్చిన రసాన్ని మీ జన్మ చరితార్థం అయ్యే వరకు తాగుతూనే ఉండండి. శుకముఖ సుధాద్రవంతో ఇది ఈ ధరిత్రిలోకి వెలసింది.” (శ్రీమద్ భాగవతం 1.1.3)
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.