శ్రీల వేదవ్యాసుల వారు ప్రస్తుతమున్న భాగవతపురాణమును ఎలా రచించారనే విషయాన్ని మనకు మొదటి స్కంధములోని నాలుగు నుండి ఏడు అధ్యాయములు విశదీకరిస్తాయి. వేదమును నాలుగు భాగాలుగా విభజించిన పిమ్మట, మొదటి రూపాంతరమైన భాగవత పురాణంతోసహా అష్టాదశ పురాణములను, మహా భారతాన్ని, వేదాంత సూత్రాలను ఆయన రచించారు.
అంతటి మహత్ రచనల తర్వాత కూడా శ్రీల వ్యాసదేవులు అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రతిగా, తన గురువైన శ్రీల నారద మునీంద్రుని ఉపదేశమును అనుసరించి ఆయన రచనా కార్యసిద్ధికి మణిహారమైన శ్రీమద్ భాగవతమును రచించారు. అసలు భాగవతమునకు సవరణా రూపమైన ఇది ఆయన సమాధి స్థితిలో పొందిన భావుకకు ప్రతిరూపము.
శ్రీమద్ భాగవతము యొక్క పరమార్ధము పరమ సత్యమైన శ్రీకృష్ణుని సమస్త మానవాళి క్షేమము కోరి స్తుతించడమే. శ్రీల వ్యాసదేవుడు ఈ పురాణాన్ని వేదమనే వృక్షానికి పరిపక్వమైన ఫలముగా వర్ణిస్తారు, అలానే దాన్ని భక్తి రసాన్ని పూర్ణంగా పొంది, జిహ్వకు మధురముగా ఉండే దానిగా అన్వయిస్తారు. దీని రసామృతాన్ని భావుకులైన భక్తులు, అలానే తమ హృదయాంతరాలలో సాత్విక భావన నిండుగా ఉన్న సహృదయులు తప్పక ఆస్వాదించాలి.
అందువల్లే శ్రీమద్ భాగవతం అష్టాదశ పురాణములలో ఒకటైనప్పటికీ, అదనంగా రస భావుకను కలిగి ఉండటం చేత దాన్ని కావ్యముగా కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారిచే రచించిన సాహిత్య దర్పణంలో కావ్యమంటే, రసమే దాని మూలముగా ఉన్నది “వాక్యం రసాత్మకం కావ్యం” అని చెప్పబడింది. రసాత్మక భావన లేకుండా ఒక సాహిత్యం కావ్యంగా పరిగణించబడదు.
బోధనా పద్ధతులు
శ్రీమద్ భాగవతము పరమ సత్యాన్ని తెలియచేసే పరమోత్తమ ప్రమాణముగా నిరూపించబడిన శ్రీ జీవ గోస్వామి రచించిన తత్త్వ సందర్భములోని శ్లోకములో( అనుచ్ఛేదము 26, హరి లీలామృతము 1. 9) ఇది ఒక కావ్యమని కూడా వ్యక్త పరచబడింది.
వేదాః పురాణం కావ్యంచ ప్రభుర్ మిత్రం ప్రియేవచ
బోధయన్తీతి హి ప్రాభుస్ త్రివృద్ భాగవతం పునః
ఈ వాక్యములు ఒకరు తమ పాలకుల చేత, స్నేహితుల చేత, లేదా ప్రేమించువారి చేతనైనా గాని ఉపదేశించబడతారు అనే సనాతన భారతీయ అవగాహనను దృవీకరిస్తాయి. వేదములు భగవంతుని పోలిన విధిపూర్వకమైన స్వరాన్ని అనుసరిస్తాయి: సత్యం వద ధర్మం చర. ” సత్యాన్ని చెప్పండి మరియు ధర్మాన్ని ఆచరించండి” ( తైత్తిరీయ ఉపనిషద్ 1. 11). వేదాలు అలా బోధించటానికి వెనుక గల తార్కిక కారణాలను తెలియజేయవు, ఎందుకంటే మనం వాటిని ప్రశ్నించకుండా అనుసరించడమే విధి కాబట్టి. పురాణములు మనకు ఒక మిత్రుని వలే కధల రూపములో ఉపదేశములను, నీతి నియమాలను చెప్తూ అలానే అవసరమైనప్పుడు వాటికి గల కారణాలను కూడా చెప్తాయి. కావ్యములు మనకు ప్రేమలో ఉన్న ప్రేయసి వలే, ముద్దు ముద్దు మాటలను వాడుతూ ఉపదేశములను పరోక్షంగా చేస్తాయి. అలాంటి ఉపదేశాలు శ్రోతలకు లేదా పాఠకులకు ఇంపుగా ఉండే విధముగా ఉంటాయి. శ్రీమద్ భాగవతం తన బోధనలో ఈ మూడు విధానాలను వినియోగిస్తుంది.
కావ్యములు లక్షణ-వృత్తిని అంటే నిర్ధేశిత అర్థాన్ని, మరియు వ్యంజన వృత్తిని అంటే ప్రతిపాదిత అర్థాన్ని విరివిగా ఉపయోగిస్తాయి. పద్యరచనలలో వ్యంజన వృత్తి అనేది పద్య సౌందర్యానికి అత్యంత ఆవశ్యకము. ఒక విషయాన్ని నేరుగా వ్యక్తపరిస్తే కవులు, పండితులు దాన్ని చాలా తక్కువగా మరియు విలువలేనిదిగా పరిగణిస్తారు. కావ్యాల్లో రస ప్రయోగం వ్యంజన వృత్తి మీద ప్రముఖంగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యముగా మాధుర్య రసము. అందువల్లే భారతీయ నాటకాలు మరియు పద్య రూపకములు వ్యంజనతో నిండి ఉంటాయి. శ్రీమద్ భాగవతం మొదట్లో చెప్పినట్లు (శ్రీ భాగవతం 1.1.2) భాగవతం ఒక రస శాస్త్రం. అందువల్ల ఇది లక్షణ మరియు వ్యంజన వృత్తులను విరివిగా వాడుతుంది ముఖ్యముగా దశమ స్కంధములో.
శ్రీమద్ భాగవతములోని పది అంశములు
శుకదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో పది అంశములను తెలుపుతూ, భాగవతము పరోక్ష ప్రతిపాదనలను వాడుతూ ఈ అంశాలను వివరిస్తుందని వివరిస్తారు.
అత్ర సర్గో విసర్గశ్చ
స్థానం పోషణం ఊతయః
మన్వంతరేశానుకథా
నిరోధో ముక్తిర్ ఆశ్రయః
ఈ పుస్తకములో, పది విషయాల గూర్చి వివరించబడింది : సర్గము ( ఆది సృష్టి ), విసర్గము ( విశ్వములో రెండవ సృష్టిగా చేయబడిన వాడు, బ్రహ్మ) , స్థానము( జీవులను సంరక్షించునది ), పోషణము ( తన భక్తుల పాలిట దయతో భగవంతుడు వారిని పోషించడం), ఊతి (ఉపచేతన అవస్థలో మనస్సులో నిగూఢముగా ఉండి లక్ష్యం వరకు నడిపించే సంస్కారాలు మరియు కోరికలు), మన్వంతరము (మను నడిచిన ధర్మ మార్గము, ఈశానుకథా ( భగవంతుడు, అతని భక్తుల గూర్చి వర్ణన ), నిరోధము ( సృష్టి విఘటనము ), ముక్తి ( విడుదల), మరియు ఆశ్రయం (ఒక వ్యక్తికి లేదా వ్యక్తులకు ఆధారభూతుడైన వాడు)”. ( శ్రీమద్ భాగవతం 2.10.1).
ఈ క్రింది భాగవత శ్లోకం మరింత వివరణ ఇస్తుంది.
దశమస్య విశుద్ధ్యర్థం
నవానాం ఇహ లక్షణం
వర్ణయంతి మహాత్మానః
శృతేనార్థేన చాఞ్జసా
మొదటి తొమ్మిది అంశాలు పదవ విషయాన్ని కూలంకషముగా వర్ణించడానికి చెప్పబడ్డాయి. పండితులు ఒక్కో సారి సూటిగా లేదా కొన్ని సార్లు పరోక్షంగా వర్ణన చేస్తుంటారు ( శ్రీ భాగవతం 2.10.2).
శ్రీల జీవగోస్వామి తత్త్వ సందర్భము(56)లో ఇలా వ్యాఖ్యానిస్తారు.
” ఇక్కడ చెప్ప బడిన పదవ అంశం గూర్చి వివరించడానికి, మహోన్నతమైన వారు (ఈ పుస్తకములో ప్రస్తావించిన విదుర, మైత్రేయ వంటి వారు) మొదటి తొమ్మిది విషయాల గుణ గణాలను వర్ణిస్తారు. అవి కొన్ని చోట్ల ప్రత్యక్షంగా, ఆ విషయం గూర్చి ప్రార్ధనతో కీర్తించడ బడే అక్షరాల ద్వారా , మరికొన్ని చోట్ల పరోక్షంగా ఆ అర్థాన్ని సూచించే వర్ణనల ద్వారా(తాత్పర్యం) వివరిస్తారు.
శ్రీమద్ భాగవతం ప్రాధమిక సృష్టితో మొదలుకొని పది అంశాలను చర్చిస్తుంది, కానీ ఋషి పుంగవులు తొమ్మిది విషయాల గూర్చి మొదట చర్చించడం నిజానికి ఒక క్రమబద్ధంగా, సులువుగా అర్ధమయ్యేటట్లు పదవ విషయం, సర్వ చరాచర సృష్టికి ఆధారభూతమైన ఆ శ్రీకృష్ణుని గూర్చి చెప్పటం కోసమే. అయితే కొందరు ఇది నిజం కాదని, తొమ్మిది విషయాలు స్పష్టంగా పదవ విషయాన్ని వివరిస్తున్నట్లు లేవని వాదించవచ్చు. అలాంటి వారికి ఈ విధముగా ప్రత్యుత్తరము ఇవ్వవచ్చు. భాగవతములో మహర్షులు పదవ విషయాన్ని ప్రత్యక్షంగా ప్రార్ధనలు, శ్లోకములు( శృతేన ) ద్వారా , అలానే పరోక్షంగా (అర్థేన) దాని అర్థం వచ్చేట్లు తాత్పర్యంతో చారిత్రక విషయాల ద్వారా చెప్తారు.
( తరువాయి వచ్చే సంచికలో )
పురుషులు మరియు మహిళలు వేర్వేరు స్వభావాలు, భావాలు, కోరికలు మరియు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోవడం మరియు వారు అన్ని విధాలుగా సమానమని భావించడం విఫలమౌతున్న సంబంధాల వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.