శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధములో యుధిష్టర మహరాజు రాజసూయయాగం ఆరంభములో శిరచ్చేదన గావింపబడి, ముక్తిని పొందిన శిశుపాలుని గూర్చి శ్రీ శుకదేవ గోస్వాముల వారిచే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయబడ్డాయి. శిశుపాలుడుచుట్టరికముచేశ్రీకృష్ణునునకు వరుసకు బావ అవుతాడు, కానీ అతను పుట్టినప్పడి నుండీ శ్రీకృష్ణుణిపై ద్వేషంతోనే పెరిగాడు. శ్రీకృష్ణుల వారు ఎదురు పడితే చాలు వారిని అవమానించడమే పనిగా పెట్టుకొనేవాడు, కానీ శ్రీకృష్ణులవారు ఎప్పుడూ చాలా సహనంతో వాటిని చూసి మిన్నకుండే వారు, అలానే కలత చెందినట్లు ఎక్కడా ఛాయలు కూడా చూపేవారు కూడా కాదు. కృష్ణుడు తన మేనత్త అయిన శిశుపాలుని తల్లికి “నీ కుమారుడు చేసే వంద అవమానములను సహిస్తాను, కానీ ఆ సంఖ్య దాటిన రోజున తప్పక చర్య తీసుకుంటానని” వాగ్దానం చేసారు.
యుధిష్టర మహారాజు చేసిన రాజసూయయాగంలో ప్రపంచములోని నలుమూలనుండి రాజులు వేంచేసిరి. వైదిక ధర్మం ప్రకారం అతిధులను భగవత్ స్వరూపులుగా భావించి సత్కరించాలి, దానికై ఒక గొప్ప ఉత్సవము నిర్వహించడానికి నిర్ణయం చేయబడింది. అయితే ఆ సమారోహములో మొదటగా ఎవరిని పూజించాలనే ప్రశ్న వ్యక్తమైంది. అక్కడకు వచ్చిన వారందరూ ఒకే రీతిలో పూజించబడినప్పటికీ, ఆ సభలోని వారందరిలో పూజ్యమైన వ్యక్తి ప్రధమ పూజను అందుకొంటారు. ఈ పద్దతిని అనుసరిస్తూ మన భారతీయ దేవాలయాల్లో ఆరతి సమయాన దీపాన్ని మొదట భగవంతునకు చూపించి ఆ పిదప వేరే భక్తులందరకూ చూపించటం జరుగుతుంది. అలానే కుంభమేళాలో కూడా, పరమ పవిత్రమైన గంగా నదిలోకి అందరిలోకి శ్రేష్ఠుడైన మహంతునికి లేదా ఆచార్యునికి ఇతరుల కన్నా మొదట వెళ్లే ఆచారం ఉంది. ఈ విషయం గూర్చి పెద్ద చర్చ జరిగిన తర్వాత, సభలో గొప్ప మునీంద్రులైన నారద,వ్యాస, పరాశర, వశిష్ట, మైత్ర్యేయ, పరశురామ, కశ్యపలు, దేవతలైన ఇంద్రుడు, వరుణుడు, గౌరవనీయులైన భీష్మ పితామహుడు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడే మొదటి పూజకు యోగ్యుడు అని నిర్ణయం తీసుకొనబడింది. శిశుపాలుడు దీనిని వ్యతిరేకించాడు, శ్రీకృష్ణుని నిందించడం, అవమానించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు చాలా సంయమనంతో దానిని ఎదుర్కొన్నాడు, కానీ శిశుపాలుడు క్రోధంతో అడ్డు, అదుపు లేకుండా ప్రవర్తించాడు. శ్రీకృష్ణుడు శిశుపాలునికి అతను హద్దులు దాటి అతని తల్లికి వాగ్దానం చేసిన సంఖ్యకు చేరుతున్నాడని గుర్తుచేశాడు కానీ శిశుపాలుడు దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడైతే శిశుపాలుడు నూరు తప్పులను దాటాడో శ్రీకృష్ణుడు తన సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించి శిశుపాలుని శిరచ్ఛేదమును గావించాడు.
అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శిరచ్ఛేదము గావింపపడ్డ శిశుపాలుని ఆత్మ అతని శరీరములో నుండి బయటకు వచ్చి శ్రీకృష్ణుని ఎడమ కాలిలో కలసి పోయింది, అంటే దానర్ధం శిశుపాలుడు ఈ భౌతిక జగత్తులోని శృంఖలాలను ఛేదించుకొని ముక్తిని పొందాడు అని. యుధిష్టర మహారాజుతోపాటు అక్కడ ఉన్న రాజులందరూ అది చూసి ఆచ్చర్య చకితులయ్యారు.
యుధిష్టర మహారాజు నారదుని ఈ విధముగా అడిగాడు “గొప్ప గొప్ప మునీశ్వరులకు కూడా కష్టమైన ముక్తిని శ్రీకృష్ణుడంటే అసహ్యించుకునే శిశుపాలుడు ఎలా పొందగలిగాడు? విష్ణుని నిందించి, ఋషులచే సంహరించబడ్డ వీణా మహారాజు ముక్తి పొందని విషయాన్ని యుధిష్టర మహారాజు ఉదహరించాడు. అలానే భగవంతుని కానీ లేక ఆయన భక్తులను కానీ నిందించిడం, వినటం కూడా ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధమనేది విదితమే. శ్రీమద్ భాగవతంలో ఈ విధముగా చెప్పబడింది.
నిందామ్ భగవతః శృణ్వమ్స తత్ పరస్య జనస్య వా
తతో నాపైతి యః సో అపి యాత్యధః సుకృతాచ్యుతః
ఎవరైతే భగవతుని లేదా అతని భక్తుల గూర్చి నిందనను విని ఆ జరిగే ప్రదేశాన్ని వీడరో అట్టివారు వారి సమస్త ఉపాధులు పోగొట్టుకొని అధములు అగుదురు. ఇక అట్టి నిందలు చేసే వారికి జరిగే హాని గూర్చి చెప్పనవసరం లేదు. (శ్రీ మద్ భాగవతం 10.74.40).
ఇక్కడ “చెప్పనవసరం” లేదు అంటే భగవంతుని లేదా ఆయన భక్తులను నిందించే వారు తప్పనిసరిగా ముందు ప్రస్తావించినవారి కన్నా దుర్భరమైన ఫలితాన్ని పొందుతారని అర్ధం.
శిశుపాలుడు కృష్ణునిలో మమేకం కావడం కాకుండా నాలుకపై కుష్ఠు వ్యాధిగ్రస్థుడిగా ఎందుకు కాలేదు? లేక అధః పాతాళానికి ఎందుకు తొక్కబడలేదు? అని యుధిష్టర మహరాజు నారదుని ప్రశ్నించాడు. వేదములలో ఒక ప్రాచుర్యమైన వాక్యం “ఒక వ్యక్తి తను చేసిన పాప, పుణ్యాల ఫలమును అదే జన్మలోనే పొందుతాడు” ఉంది. అంటే దానర్ధం శిశుపాలుడు తన కర్మల ఫలాన్ని ఎటువంటి జాప్యం లేకుండా ఈ జన్మలోనే పొందాలి.
శిశుపాలుడు రాగానుగ భక్తికి ఉదాహరణం:
అప్పుడు శ్రీ నారదులవారు యుధిష్టర మహారాజు ప్రశ్నకు బదులిస్తూ రాగానుగ భక్తికి మూలమైన ఒక సమగ్రమైన సమాధానాన్ని తెలిపారు. ఒకరు తమ దేహాన్నే సర్వమనుకుంటేనే నింద, ప్రశంస, గౌరవం లేదా అవమానం అనే దేహానికి సంబంధించిన విషయాలను తమకే జరిగినట్లుగా భావించి ఆనందం లేదా దుఃఖాన్ని పొందుతుంటారు. అయితే భగవంతునికి ఇలాంటి అపసవ్య ద్వివిధ మనస్తత్వం లేదు అందువల్ల భౌతిక జగత్తులోని ప్రజలు చేసే ప్రశంసలు కానీ లేదా నిందలు కానీ ఎటువంటి ప్రభావం చూప జాలవు.
పురుషునికి మరియు ప్రకృతికి మధ్య భేదాన్ని తెలుసుకోలేక మనం మన ప్రాకృతిక దేహంతో తాదాత్మ్యం చెందుతాము. తామసిక, రాజసిక గుణ ఉత్పాదకములైన దేహ లక్షణాలను విమర్శించే వారు వెర్రి జనాలని శ్రీ జీవ గోస్వాముల వారు చెప్తారు. ఇలాంటి నిందన కేవలం ప్రకృతి లేదా భౌతిక గుణాల పరిధిలోకే పరిమితం, అందువల్ల భగవంతుని విషయంలో అది వర్తించదు. ఎందుకంటే ప్రకృతి, దాని నుండి ఉద్భవించే వాటితో భగవంతుడు తాదాత్య్మము చెందడు కనుక. అందువల్లే అటువంటి నిందలు భగవంతుని నొప్పించలేవు. భగవద్గీతలో శ్రీ కృష్ణుల వారు భౌతిక ఇచ్చలతో మునిగియున్న వారికి తాను యోగ మాయ ముసుగులా ఉన్నందువల్ల కనపడనని చెప్తారు ( భగవద్గీత 7.25).
అర్జునుడు ప్రకృతి గుణాలను అతిక్రమించిన వాని లక్షణాలను శ్రీకృష్ణుని అడుగగా, ఆయన “ప్రకృతి గుణాలను అతిక్రమించిన వారు సుఖ, దుఃఖాలలో సమంగా ఉంటారని, మట్టి ముద్దను, రాయిని, బంగారాన్ని సమంగా చూస్తారని, అనుకూలమైన , మరియు ప్రతికూలమైన విషయాలు లేదా వస్తువుల పట్ల సమ భావాన్ని కలిగి ఉంటారని, పొగడ్తను మరియు నిందను ఒకే రకముగా భావిస్తూ గుంభనంగా ఉంటారని, మిత్రుని మరియు శత్రువును ఒకే రకముగా స్వీకరిస్తారని, అన్ని ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉంటారని చెప్తాడు.” (భగవద్గీత 14.24.25).
అది ప్రాకృతిక దేహముతోనున్న ఒక జీవన్–ముక్తుడి విషయములో నిజమైతే శిశుపాలుడు చేసిన ఏ నిందలు ఐయినా భగవంతుడైన శ్రీ కృష్ణుని ప్రభావితము చేయజాలవు.
అయితే కృష్ణుడు శిశుపాలుని ఎందుకు చంపాడు? శిశుపాలుని మాటలు ఆయనను ప్రభావితం చేయలేవు ఎందుకంటే అవి ఆయనకు సంబంధించినవి కావు కనుక. కృష్ణుడు చంపడం వల్ల శిశుపాలుడికి ముక్తి అనే ప్రయోజనం ఉంది కనుక శిశుపాలుడి క్షేమము కోరి వధించాడు. ఇంకా చెప్పాలంటే కృష్ణుని పై నిందలు విని బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి శిశుపాలుని చంపాడు.
ప్రాపంచిక స్థితిలో ఉన్నవారివలె కాకుండా, శ్రీకృష్ణుని నిజస్వరూపం మరియు దేహం కూడా ఒక్కటే, అందువల్ల ఆయనకు భౌతిక దేహం లేదు. అందువల్ల మాములు జీవ రాశులు అవివేకంతో దేహాన్ని తమ నిజరూపంగా భావించినట్లు శ్రీకృష్ణుడు భావించడు. అందువల్ల ఎవరినీ ద్వేషించడు, అలానే ఎవరూ ఆయనకు ఆప్తులు కాదు. అయన భగవద్గీతలో ఈ విషయాన్ని ధృవీకరిస్తారు.
“నేను అందరికీ సమానుడను. నాకు సన్నిహితులు కానీ లేక శత్రువులు కానీ లేరు. కానీ భక్తితో నన్ను పూజించేవారు సదా నాలోనే నెలకొంటారు అలానే నేను వారిలో ఉంటాను“( భగవద్గీత 9.29)
(మిగతాది తరువాయి)
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.