పని మరియు ఆధ్యాత్మిక జీవనము మధ్య సమతుల్యత సాధించండం ఎలా

Articles by Satyanarayana DasaComments Off on పని మరియు ఆధ్యాత్మిక జీవనము మధ్య సమతుల్యత సాధించండం ఎలా

       తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించడం అనేది మనిషికి గల సర్వ సాధారణమైన  ప్రాథమిక స్వభావం. ఇది రెండు రూపాలుగా కనపడుతుంది. మొదటిది తన  భౌతిక శరీరాన్ని కాపాడుకోవలసిన అవసరంగా, రెండవది సంతానోత్పత్తి చేయవలసిన అవసరంగా రెండిటి ద్వారా అతను తన శరీరం యొక్క మనుగడను దాటి తన ఉనికిని/అస్తిత్వవాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఐతే   రెండు ప్రాథమిక అవసరాలు తీరడానికి  తినడానికి ఆహారంనిద్రపోవడానికి సానుకూలమైన  వాతావరణం, శత్రువులు, భయంకరమైన జంతువులు మరియు వ్యాధి కలిగించే కీటకాలు వంటి పర్యావరణ కారకాల నుండి  రక్షణ  వంటివి అవసరము. ఇవన్నీ సాధించడానికి అతనికి డబ్బు కావాలిదాన్ని పొందుటకొరకు అతను ఏదోఒక విధమైన  పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

      అతను స్వయం ఉపాధి పొందవచ్చు లేదా మరొకరి వద్ద ఉపాధి కోసం పని చేయవచ్చు. ఏదైతేనేం  అందరూ తప్పక పనిచేయాల్సి ఉంటుంది . సాంకేతిక పరిజ్ఞానం రాకముందుమానవ జీవితం చాలా సరళముగా ఉండేది, జీవితంలోని ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి అంతగా  కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా సమాజాలు వ్యవసాయ ఆధారితమై ఉండేవి. కుటుంబ సభ్యులు కలిసి పనిచేసే వారు. అందువల్ల  వారు తమ  కుటుంబంతో కలిసి ఉండటానికి చాలా సమయం ఉండేది. మనుగడ కోసం పనిచేయడంతో పాటు జీవితంలోని ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కూడా అతనికి సమయం ఉండేది.

మరో మాటలో చెప్పాలంటే, మన అవగాహనను భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు  మరియు శరీర మరియు శారీరక ఉత్పత్తుల నుండి స్వీయ జిజ్ఞాస వైపు  మార్చినప్పుడు మాత్రమే మన జీవితం సమతుల్యమవుతుంది. సాధనప్రక్రియను క్రియా యోగము  లేదా భక్తి యోగము  అంటారు. ఒకరు  జీవితంలో సమతుల్యతను సాధించడానికి తమ పనిని లేదా కుటుంబాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. ఇది ఒకరి ప్రస్తుత స్థితిలో ఉండే సాధించవచ్చు మార్పు అనేది బాహ్యమైనది కాదు, ఇది ఒకరి స్పృహలో కలిగిన మార్పుగా ఉంటుంది. తమ తమ స్పృహలను స్వీయ జిజ్ఞాసాన్వేషణ  స్థాయికి పెంచకుండా మనం పనిలో కాని  మరియు జీవితంలో కానీ సమతుల్యతను సాధించలేము.

       సాంకేతిక పరిజ్ఞానము  ప్రారంభమవడంతో, మానవ  జీవితాన్ని సౌకర్యవంతంగా చేయడానికి అనేక సాంకేతిక ఆవిష్కరణలు  కనుగొనబడ్డాయి అలానే  వాణిజ్యపరంగా ఉత్పత్తి కూడా  చేయబడ్డాయి. ఉత్పత్తులను కైవసం చేసుకొనడానికిమనిషికి ఎక్కువ డబ్బు అవసరమైందిఅందువల్ల  ధనార్జన కొరకు తీవ్రంగా శ్రమించాల్సిన  అవసరం వచ్చింది. మనిషి డబ్బు యావలో పడి  తన కుటుంబ సభ్యులకు కూడా సమయాన్ని కేటాయించ లేకపోతున్నాడు. ఇది మొత్తం సమాజంలో  ఒక పెనుమార్పును తీసుకు వచ్చింది.

        ఉత్పత్తుల తయారీ కొరకు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. పరిశ్రమలకు వారి తయారీ యూనిట్లలో పనిచేయడానికి శ్రమశక్తి అవసరమైంది. ఇందుకోసం ప్రజలు తమ సొంత పట్టణాలను లేదా గ్రామాలను వదిలి ఉత్పాదక కర్మాగారాల పరిసరాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. లేదంటే, వారు ఉత్పాదక పరిశ్రమలలో పని కొరకు గంటల కొద్దీ  ప్రయాణము చేయాల్సి వచ్చింది. ఇది మునుపటి  సరళమైన జీవన వ్యవస్థలో  భారీ మార్పును  తెచ్చింది.

      గ్రామీణ నేపథ్యాలు పట్టణాలుగా మారాయిదానివల్ల  ప్రజలు ప్రకృతి నుండి దూరమయ్యారు. వ్యవసాయం కూడా యాంత్రికమైంది అందుమూలముగా శ్రామికుల  అవసరం తగ్గి పోయింది. అంతే కాదు, చాలా మంది వ్యవసాయేతర సేవల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉన్నందున వ్యవసాయం ప్రధాన ఉపాధనడం నిన్నటి మాటగా  మిగిలిపోయింది. కార్యాలయ పనిలో లేదా వ్యాపారంలో మాత్రమే మునిగిపోవాల్సిన ఆవశ్యకత పెరగడముతో ప్రజలకు తమకు లేదా తమ కుటుంబానికి  కేటాయించడానికి స్వల్ప సమయం మాత్రమే దొరికిందిమొత్తం సమాజం వినియోగదారుల మార్గదర్శక సూత్రాలపై ఆధారితమై ఉండడం  ప్రారంభమైంది.

ప్రస్తుత పరిస్థితి

   మానవ జీవితానికి కొన్ని ఉన్నత  లక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం లక్ష్యాలు తమకు మరియు తమ  కుటుంబానికి సమయం కేటాయించలేని  యాంత్రిక మానవ కార్మిక సముదాయమనే  దుమ్ము పొరతో పూర్తిగా  కప్పబడి పోయాయి. జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని వినడానికి ఎవరికీ సమయం లేదు మరియు ఎవరికైనా సమయం ఉంటే, ఆధునిక ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి కోసం ఎలుగెత్తి అరిచే గొంతుకల సమూహములో శబ్దాలు వినికిడికి నోచుకోలేవు కూడా .

     ఇటువంటివారు  పురాణాలలో  అసురులుగా (విధ్వంసకులు ) వర్ణించబడ్డారు. శ్రీమద్భాగవతములో హిరణ్యాక్ష అనే రాక్షసుడి కథ ఉందిఅతను కేవలం  తన ఆనందం కోసం భూమండలాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతన్ని హిరణ్యాక్ష (హిరణ్య = బంగారం లేదా సంపద మరియు అక్ష = దృష్టి) అని ఎందుకు  పిలుస్తారంటే అతని దృష్టి సంపద లేదా ఆర్థికాభివృద్ధిపై మాత్రమే ఉండేది. కేవలం విలాసం  కోసం సంపదను సంపాదించడం చాలా పాపాత్మకమైన చర్యగా పరిగణించబడుతున్నందున అతన్ని ఆదిదైత్యునిగా (మొదటి రాక్షసుడు) పిలుస్తారు.

         జంతువులకు దాచిపెట్టటము అనేది తెలియదు. నేడు చాలా మంది భారతీయులు తమ స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ట్రిలియన్లు మరియు ట్రిలియన్ డాలర్లను దాచి  ఉంచారు. వారు నిజానికి హిరణ్యాక్ష వారసులు. తత్వశాస్త్రం ప్రకారం, ఒక మనిషి ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం శ్రద్ధ వహించకుండా తన ఆర్థికాభివృద్ధికి మాత్రమే పనిచేస్తే, అతను హిరణ్యాక్ష మనస్తత్వాన్ని అనుసరిస్తున్నాడు, దీనివల్ల మన భూతలం నాశనమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ మరియు పర్యావరణ కాలుష్యం యొక్క ప్రస్తుత పరిణామాలు వినియోగదారుల సమాజంలోని హిరణ్యాక్ష మనస్తత్వం వల్ల సంభవిస్తున్నవే.

         వీటివల్ల జీవితం అసమతుల్యమైంది. సమాజంలో విజయవంతమైన వ్యక్తిగా పరిగణించబడే ఒకరు నాకు తెలుసు. వ్యక్తి  సామాజిక నిచ్చెనలో ఉన్నత పదవులను కలిగి ఉన్నాడుఅతను విశాలమైన బంగ్లాలో నివసిస్థాడు, ఫాన్సీ కారు నడుపుతాడు మరియు సెలవులకు  విదేశాలకు వెళ్తాడు. అతని జీవితంలో భాగం గొప్పది మరియు ప్రశంసనీయం. కానీ నిశితంగా పరిశీలిస్తే, అతని కథ చాలా దయనీయమైనది.

విజయవంతమైన వ్యక్తి, ఇప్పుడు తన నలభైల చివరి వయస్సులో, అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు, మధుమేహం కలిగి ఉన్నాడు మరియు నిద్రలేమితో బాధపడుతున్నాడు. అతని బాధలు ఇక్కడ ముగియవు. అతని వివాహం విఛ్చిన్నమవడానికి దగ్గరగా ఉంది మరియు అతని కుమారుడు మద్యపానానికి బానిస అయ్యాడు. కార్పొరేట్ ప్రపంచంలో విజయాల నిచ్చెనను ఎక్కడంలో అతను బిజీగా ఉన్నప్పుడు, అతను తనకు మరియు, తన భార్య మరియు పిల్లలకు స్పష్టంగా సమయం కేటాయించలేదు.

ఇది దురదృష్టవశాత్తు, ప్రస్తుత సమాజంలో చాలా మంది విజయవంతమైన వ్యక్తుల కథ. చాలా మంది సాధారణ పురుషులు మరియు మహిళలది కూడా ఇదే పరిస్థితి. జీవితంలో   పనిచేయడమే ప్రధాన లక్ష్యంగా మారింది. 

మనుషుల పరిస్థితి జంతువులకంటే తుచ్ఛము 

అందరూ పని చేయాలి. దానిని ఖండించడం లేదు. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీత 3.8 లో ఇలా అన్నాడు:

శరీర నిర్వహణ కొరకైనా పనిచేయకుండా నీవు బ్రతకలేవు.

మనుగడ కోసం కనీసం పని చేయాలి. మరియు ప్రస్తుత సమాజంలో, మనుగడ చాలా ఖరీదైనది. ఒక దేశం ఎంత  అభివృద్ధి చెందితే అక్కడ  కనీస జీవిత సౌకర్యాలను కలిగి ఉండటం అంత ఖరీదైనదిగా మారుతోంది. జంతువులు మరియు పక్షులు  వాటి  మనుగడ కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మానవ పురోగతికి విరుద్ధం.

       శ్రీకృష్ణుడు పని చేయవలసి ఉందని చెప్పినప్పుడు, పని కేవలం ఒకరి మనుగడ కోసమే కాదని , ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే కాదని హెచ్చరించాడు. జంతువులు మరియు పక్షులు కూడా ఆహారాన్ని సంపాదించడంలో బిజీగా ఉన్నాయి, మంచి నిద్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటాయి, వాతావరణం యొక్క వినాశనం నుండి తమను తాము రక్షించుకుంటాయి మరియు సంతానం ఉత్పత్తి చేస్తాయి.

          ఆ కోణంలో నుండి చూస్తే మానవులు జంతువులకు  భిన్నంగా లేరు. వారి కార్యకలాపాలు కూడా ఆహారం, ఆశ్రయం, రక్షణ, సంతానోత్పత్తి మరియు ఇంద్రియ ఆనందానికి సంబంధించినవే . కానీ మానవులకు అంతకన్నా ఎక్కువ చేయగల సామర్థ్యం ఉంది. వారు తమను ఆధ్యాత్మిక జీవులుగా గ్రహించగలరు. జంతువులకు సౌకర్యం లేదు. మానవులు తమకు లభించిన సదుపాయాన్ని ఉపయోగించుకోకపోతే, వారు జంతు సమానులుగా బేరీజు వేయబడతారు. అదనపు ప్రతికూలతతో వారు కష్టపడి పనిచేస్తూ వారు ఎక్కువ బాధపడవలసి వస్తుంది . ఇది  వారిని జంతువుల కన్నా తక్కువ స్థాయికి దిగజార్చి జంతువులచే గేలి చేయబడేట్లు చేస్తుంది!

ప్రత్యుపాయం

  దుర్భరమైన పరిస్థితికి పరిహారం ఏమిటి? దీనికి భగవద్గీత (3.9) లో సమాధానం ఇవ్వబడింది:

ఓ కౌన్తేయా, భగవంతునికి సమర్పించిన కర్మలు తప్ప మిగిలిన కర్మలచేత వీరు బంధిచబడుతున్నారు. కావున, రాగములేకుండా నీ విధిని ఒక యజ్ఞకార్యమువలె చేసి భగవంతునికి అర్పించుము.

   చర్య లేదా పనిని విడనాడటం కాదు, సరైన స్పృహతో చేయటం అవసరము . అప్పుడు, మనము చర్యకు కట్టుబడి ఉండము. ‘చర్య ద్వారా బంధంఅంటేఫలితంతో బాధపడటం మరియు తరువాత బాధలకు పరిష్కారం కనుగొనటానికి ప్రయత్నించడంఅంటే ఇది మరింత బాధలకు దారితీస్తుంది. దీనినే  సంసారం (క్యాచ్ -22 యొక్క తప్పించుకోలేని చక్రం) అంటారు.

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    సత్త్వము, రజస్సు మరియు తమస్సు ఒకదానికొకటి పోటీ అయినాకూడా అవి కలిసి ఉండి కలిసి పనిచేస్తాయి. సహకారభావంతో ఎలా ఉండాలో మనకు చెప్పే ఒక మంచి ఉదాహరణ.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.