పరంపర నుండి వచ్చే జ్ఞానము

PhilosophyQuestions & AnswersComments Off on పరంపర నుండి వచ్చే జ్ఞానము

ప్రశ్న : పరంపర అనేది రెండు వైపుల దారా ? చాలా సార్లు నేను మన వ్యక్తిగత గురువును అతిక్రమించి నేరుగా పరంపరలో ముందున్న ఆచార్యుల రచనల వైపు  వెళ్లరాదని విన్నాను. మనము  మన గురువును అతిక్రమించరాదని  విషయం నేను అర్థం చేసుకొన్నప్పటికీ నా స్వీయ అనుభవంలో గ్రహించినది ఏమిటంటే పూర్వపు ఆచార్యుల బోధనలను అర్ధం చేసుకోవడం వల్ల మనం మన గురువు యొక్క బోధనలను సరైన కోణంలో చూడగలుగుతాము. అందువల్ల పరంపర  అనేది రెండు వైపుల దారిలాంటిదని ఎందుకంటే పూర్వపు ఆచార్యులను అర్ధం చేసుకోవడానికి మనకు ఒక వ్యక్తిగత గురువు కావాలి, అలానే వ్యక్తిగత గురువును అర్ధం చేసుకోవడానికి మనకు ఆచార్యుల అవసరం ఎంతైనా ఉంది. పరంపర పనిచేసే విధానాన్ని నేను సరిగ్గా అర్ధం చేసుకొన్నానా ?

జవాబు : ఇది సరైన అవగాహన కాదు ఎందుకంటే పరంపర అనేది రెండు వైపుల దారి కాదు కనుక. పరంపర అనేది ఒక మూల స్థానం నుండి జ్ఞానం  ప్రవహించే  ప్రవాహిక వంటిది , అది ఎలా ఉంటుందంటే నీరు ఒక పైపు నుండి, విద్యుత్శక్తి దాని మూలాల నుండి వస్తున్నట్లు.

Sri Haridas Shastri Maharajji

  శ్రీ హరిదాస శాస్త్రి మహారాజు గారు

మన గురువు యొక్క భోధన పూర్వ ఆచార్యుల కన్నా భిన్నమైంది కాదు, అలానే తక్కువైనది కాదు. గురువనే వారు పూర్వ  ఆచార్యులందరినీ కలిగి ఉన్న పరంపరకు ప్రస్తుత ప్రతినిధి.పరంపర అనే పదంలోనే జ్ఞానం గురువు నుండి శిష్యునికి ప్రవహిస్తుందని తెలుస్తోంది.  అలానే వ్యవస్థాపక ఆచార్యుని నుండి ఒక విడతెగని గొలుసు క్రమములో గురువు నుండి శిష్యునికి ప్రవహించే జ్ఞానమునకు గురువు చిహ్నము. ఒకరు పూర్వ ఆచార్యుల రచనలను చదువుతున్నారంటే, వారి వ్యక్తిగత గురువు విశేషముగా వాటిని చదవ వద్దు అని ఆదేశిస్తే తప్ప వారు తమ వ్యక్తిగత గురువును అతిక్రమిస్తున్నారని అర్ధం కాదు.  

Sri Vinod Bihari Gosvami

  శ్రీ వినోద బిహారీ                గోస్వాముల వారు

     మనం పూర్వ ఆచార్యుల బోధనలను మన గురువు ద్వారా అర్ధం చేసుకొంటాము. నిజానికి పూర్వ ఆచార్యుల బోధనలను తెలియచేయటం అనేది ప్రస్తుత గురువు యొక్క బాధ్యత కూడా. గురువు ఆ జ్ఞానాన్ని పంచేవాడు మరియు ఇది రెండు వైపుల దారి కాదు. ఒక వేళ మీరు పూర్వ ఆచార్యులను కేవలం గ్రంథ పఠనం ద్వారా తెలుసుకోగలిగినట్లయితే గురువు అవసరంఏమున్నది? కనుక  ఎవరైనా మొదట తమ  పరంపరలోని ప్రాధమిక విషయాలను తమ గురువు నుండి తెలుసుకోవాలి, దానికి అనుబంధముగా పూర్వ ఆచార్యుల రచనలను చదవాలి (ఒకవేళ అలాంటివి ప్రత్యేకముగా నిషేధించబడకపోయినట్లైతే). 

నిజంగా చెప్పాలంటే, ఒకరు చదివేది ఏది అయినప్పటికీ అది గురువు ఉపదేశం/ఆజ్ఞాపనతోనే చెయ్యాలి. పరంపర సిద్ధ జ్ఞాన ప్రాప్తికి ద్వారాన్ని తీసే  తాళం చెవి లాంటివాడు గురువు. ఒకరు ఏదైనా ఒక విషయం స్వతంత్రముగా  చదివితే, వారి భౌతిక సంస్కారముల ప్రేరేపణఅనుగుణముగా మాత్రమే అర్థం  చేసుకోగలడు. శాస్త్రాలు మనకు మన భౌతిక జీవితంలో అనుభవ ప్రాప్తి చెందని విషయాల గూర్చి జ్ఞానాన్ని ఇస్తాయి. మనం శాస్త్రాలను నిజమైన గురువు ఉపదేశము లేకుండా చదివితే, మనం మన భౌతిక భావనల  అనుగుణముగా అన్వయించుకోవడం జరుగుతుంది అలా మనం వాటిని తప్పుగా అర్ధం చేసుకోవడం తథ్యము. మనకు కేవలం భౌతిక బుద్ధి, జ్ఞానం ఉన్నాయి. వాటిద్వారా నిజమైన శాస్త్ర భాష్యాలను మనం అర్ధం చేసుకోలేము. అందువల్లే ఆత్మ జ్ఞానము అంటే  స్వీయ మరియు భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని మనం స్వీయ సాధనతో పొందలేము ఎందుకంటే అనాదిగా ఉన్న అజ్ఞానమనే అంధకారము మనల్ని కప్పి ఉంది కనుక. కేవలం సత్యాన్ని ఎరిగిన గురువు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనకు ఇవ్వగలడు(శ్రీమద్ భాగవతం 11.22.10).

దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రహ్లాదుడు ఒకరు తమ మనస్సును కేవలం తన యథాశక్తితో గానీ లేక అర్హతలేని వారి తోట్పాటుతో గానీ కృష్ణుని యందు స్థిరముగా నిలుపలేరని అంటాడు(శ్రీమద్ భాగవతం 7.5.30). కృష్ణుని వైపుకి మన ఆసక్తి కేవలం భక్త శిఖామణుల కృప చేతనే సాధ్య పడుతుందని ఆయన పేర్కొంటారు( శ్రీమద్ భాగవతం 7.5.32). ఇదే విషయాన్ని నవ యోగేంద్రులలో ఒకరైన ప్రబుద్ధ స్వామి కూడా ఒకరికి  పరమ సత్యాన్ని తెలుసు కోవాలనే ఆసక్తి ఉంటే, యోగ్యుడైన గురువును ఆశ్రయించి ఆయన నుండి ఆ విషయాలను అధ్యయనం చేయాలని అంటారు( శ్రీమద్ భాగవతం 11.3.21-22).

తస్మాద్ గురుమ్ ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్

శాబ్దే పరే చ నిష్ణాతమ్ బ్రహ్మణి ఉపశమాశ్రయం

తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేద్ గుర్వాత్మ దైవతః

మాయయానువృత్యా యైః తుష్యేద్ ఆత్మాత్మదో హరిః 

అదే విధముగా కృష్ణుడు కూడా భగవద్గీతలో(4.3. 4)  జ్ఞానాన్ని పొందటానికి కేవలం యోగ్యుడైన గురువును ఆశ్రయించాలని అంటారు.

తద్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినః  తత్వ దర్శినః

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    పురుషులు మరియు మహిళలు వేర్వేరు స్వభావాలు, భావాలు, కోరికలు మరియు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోవడం మరియు వారు అన్ని విధాలుగా సమానమని భావించడం విఫలమౌతున్న సంబంధాల వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.