శ్రీమద్ భాగవతం- పురాణములనన్నిటిలోకి శ్రేష్ఠము

Articles by Satyanarayana DasaComments Off on శ్రీమద్ భాగవతం- పురాణములనన్నిటిలోకి శ్రేష్ఠము

శ్రీమద్ భాగవత పురాణము గౌడీయ సిద్ధాంతము మరియు అనుసరణ గూర్చి విశదీకరించే భాండాగారం. ఇది బాదరాయణ వ్యాసుల వారిచే వ్రాయబడిన పద్దెనిమిది పురాణాలలో ఒకటి. భాగవత పురాణమనే పేరుకు అర్ధం “భగవంతునిచే చెప్పబడిన పురాణం”(భగవతా ప్రోక్తం) లేక భగవంతుని ప్రియ భక్తుల స్వభావశీలి గూర్చి వివరించేదని (భాగవతానాం పురాణం) లేక భగవంతుని  మరియు ఆయన భక్తుల స్వభావాన్ని, వారి దివ్య లీలను వివరించేదని(భగవతః  భాగవతానాన్ చ పురాణం).

మొదటి స్కంథములోని నాలుగు నుండి ఏడవ అధ్యాయములలోని కథలలో  అవగతం అయినట్లు భాగవతం వ్యాసదేవుని చిట్ట చివరి రచన. భాగవత రచనకు మునుపు ఆయన వేదములను నాలుగుగా విభజించి మరియు తన నలుగురు శిష్యులకు వాటిని భోదించి వైదిక ధర్మ వృద్ధికి  తోడ్పడ్డారు. ఈ విధముగా ఆయన మానవాళికి ఎనలేని సేవ చేసారు. ఆయన వేదాల సారాన్ని జన బాహుళ్యానికి తెలియచేయడానికి పురాణాలను, మహాభారతాన్ని రచించారు.అంతేకాకుండా ఆత్మ, బ్రహ్మ  సాక్షాత్కారాన్ని పొంది వ్యాసదేవుడు సర్వ  ఉపనిషత్తుల  ముఖ్య సారాన్ని నిర్వచించటానికి వేదాంత సూత్రాన్ని రచించారు.  ఇంతటి మహత్తర రచనలు, కార్యసిద్ధులను చేసినప్పటికీ ఆయన హృదయంలో ఎదో తెలియని వెలితితో ఉండిపోయారు. 

ఆయన నారద మునిచే ఉపదేశం కావింపబడి మరియు తన సమాధి స్థితిలో కలిగిన జ్ఞానాన్ని శ్రీమద్ భాగవతముగా ఆవిష్కరించిన పిదప మాత్రమే ఆంతరంగిక పరిపూర్ణతను పొందగలిగారు. దీన్నిబట్టి ఆయన రచనలన్నింటిలోకి శ్రీమద్ భాగవతానికి గల వైశిష్ట్యత అవగతమవుతుంది. అందుకే ఈ వైశిష్ట్యతను గుర్తించే విధముగా శ్రీమద్ అనే పదముతో భాగవత పురాణం చెప్ప బడింది. శ్రీ అనే పదానికి  “సౌందర్యం” మరియు”సంపద” అర్ధాలు. శ్రీమద్ భాగవతం కవిత్వపరంగా ఎంతో సౌందర్యవంతమైనది ముఖ్యముగా స్తుతి మరియు భాగవతములోగల వివిధ  గీతముల వల్ల. అదేసమయమున శుకగోస్వాముల వారు చెప్పిన విధముగా  భగవంతుని సంపద అయిన వేదాంతమును కలిగి ఉండటం  వల్ల ఎంతో అమూల్యమైనది.

ఈ శ్రీమద్ భాగవతం వేదాంత తత్వానికి మూలమైనది ఎందుకంటే దానిలోని విషయం పరమ సత్యాన్ని( అద్వితీయం వస్తు), బ్రహ్మత్వంతో గల ఏకత్వాన్ని వివరించేది కనుక. ఇంకా చెప్పాలంటే దాని  ఒకే ఒక ప్రయోజనము కైవల్య పదంబు చేరుటయే ( శ్రీమద్ భాగవతం 12.13.12).

ఇంకొన్ని శ్లోకాల పిదప , ఆయన అంటారు :

“శ్రీమద్ భాగవతం వేదాంతములన్నింటి సారాంశము(ఉపనిషత్తుల)గా చెప్పబడింది. ఎవరైతే ఈ అమృత రసానికి ముగ్దులవుతారో వారికి వేరే రచనల పట్ల ఆసక్తి కలుగదు (శ్రీమద్ భాగవతం 12.13.15).

దానికి పూర్వం శ్రీమద్ భాగవతమును అన్ని వేదముల, ఇతిహాసముల సారాంశమని సూత గోస్వాముల వారు చెప్పారు.

దానితర్వాత వ్యాస మహర్షి వేదములు, ఇతిహాసముల క్లుప్త సారాంశమైన ఈ భాగవత పురాణాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారిలో అగ్రగణ్యుడైన ఆయన కుమారుడు శ్రీ శుకదేవుల వారికి తెలియ చెప్పారు. (శ్రీమద్ భాగవతము 1.3.41).

స్కంద పురాణం ప్రకారం శ్రీమద్ భాగవతము లోని ఒక్కో శ్లోకం పురాణములన్నింటికన్నా మిక్కిలి శ్రేయస్కరమైనది.శ్రద్ధాసక్తితో శ్రీమద్ భాగవతములోని ఒక్కో శ్లోకాన్ని రోజూ చదివే వారికి పద్దెనిమిది పురాణాలు  చదివిన ఫలితం లభ్యమవుతుంది”. (స్కంద పురాణం , విష్ణు కాండ 5.16.33).శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం దాని లక్షణ నిర్వచనము బట్టి కూడా అర్ధం చేసుకోవచ్చు. మత్స్య పురాణం ప్రకారం సాధారణముగా పురాణానికి ఐదు లక్షణాలు ఉంటాయి.

“పురాణమనేది ఐదు అంశాల లక్షణాలను కలిగి ఉంటుంది- సర్గ (విశ్వ వ్యాప్తి), ప్రతిసర్గ ( విశ్వ విఘటనం), వంశ (వంశ పరంపర), మన్వంతర ( మనుని ధార్మిక పాలన ) మరియు వంశానుచరిత ( గొప్ప గొప్ప రాజుల, మహాఋషుల వారసత్వ విషయాల గూర్చి ప్రస్తావన)” ( మత్స్య పురాణం 53.65).

దీనికి భిన్నముగా శుకదేవ గోస్వాముల వారు చెప్పినట్లు శ్రీమద్ భాగవతం పది స్వరూప లక్షణాలను కలిగి ఉంది అని అంటారు.

“ఈ పుస్తకములో పది విషయాల గూర్చి చర్చించడం జరిగింది – సర్గ ( ఆది భూతమైన ప్రకృతి మరియు దాని పరిణామ క్రియ), విసర్గ ( రెండవ పరిణామమైన జీవ చరములు మరియు జీవులు) స్థాన ( జీవుని జీవనము), పోషణ ( తన భక్తుల పాలనలో భగవానుడు చూపిన దాతృత్వం), ఊతి (లక్ష్యము కొరకు మార్గము చూపే చిత్తములోని పూర్వ వాసనల సంస్కారాలు మరియు కోరికలు), మన్వంతర (పదునలుగురు మనువుల చరిత్రలు వారి ధర్మములు), ఈశానుకథ (ఈశ్వరుని  అవతార కథలు, అతని భక్తుల చరిత్రలు), నిరోధ (విశ్వ నిరోధం), ముక్తి (విమోచనం), మరియు ఆశ్రయ ( జీవులందరూ శరణు కోరదగినది)”. (శ్రీమద్ భాగవతం 2.10.1)

దాని ఆధారముగా సూత గోస్వామి పురాణాలన్నిటిలోకి శ్రీమద్ భాగవతం అత్యుత్తమైనదని సరిగ్గా ఒక్కాణిస్తారు.

“నదులలో గంగ వలే, దేవతలలో అచ్యుతుడు వలే, వైష్ణవులందరిలో శివుని వలే, శ్రీమద్ భాగవతం పురాణములన్నిటిలోకి శ్రేష్ఠము”. (శ్రీమద్ భాగవతం 12.13.16)

ఈ అన్వయము పద్మ పురాణముచే మళ్ళీ  నిరూపించబడింది. “పురాణములన్నిటిలోకి శ్రీమద్ భాగవతము శ్రేష్ఠము. దాని లోని ఒక్కొక్క పదము కృష్ణుని గూర్చి పరి పరి విధముల ఋషులచే చేయబడిన కీర్తనలే” (పద్మ పురాణము, ఉత్తరఖండం 193.3).

శ్రీమద్ భాగవతం యొక్క శ్రేష్ఠత దాని వక్త  శ్రీ శుకదేవ గోస్వామి కావటం చేత మళ్లా నిరూపణ అయింది. ఆయన పుట్టుకతోనే బ్రహ్మ సాక్షాత్కారము పొంది , సంబంధ బాంధవ్యాలకు అతీతుడు అంచేత శుద్ధ స్థితిలో నిమగ్నమైన వాడు. ఆయన పుట్టిన వెంటనే ఇంటిని వదలి వేసాడు, ఎటువంటి వైదిక కర్మ కాండలు చేయలేదు మరియు గృహములో ఉండాలనే తన తండ్రి మాటలను వినలేదు (శ్రీమద్ భాగవతం 1.2.2). ఆయన బ్రహ్మములో ఎంతో తాదాత్య్మముతో ఉండటం చేత తన స్వస్థితి గూర్చి కూడా పట్టించుకోలేదు. ఆయనకు స్త్రీ, పురుష లింగ భేదం కూడా లేనే లేదు (శ్రీమద్ భాగవతం 1.4.4-5).

భాగవతానికి అంత వైశిష్ట్యత రావడానికి కారణం దాన్ని విన్న శ్రోతలకు పరీక్షిత్ మహారాజు వంటి యశః  పురుషుడు ఆధిపత్యం వహించడం కూడా. ఆయన ఏడు దినములలో మరణాన్ని పొందేటట్లు శాపగ్రస్తుడైనప్పుడు, తన రాజ్యాన్ని త్యజించి గంగానది ఒడ్డున కూర్చొని మరణం వరకు ఉపవాస దీక్ష వహించారు. అప్పుడు ఆయనను ఆశీర్వదించడానికి విశ్వము వివిధ మూలలనుండి ఋషి పుంగవులు వేంచేసిరి. సూత గోస్వామి ఈ సంఘటన గూర్చి ప్రస్తావించారు. 

ఆ సమయాన తమ ఆధ్యాత్మిక శక్తితో ఈ ప్రపంచాన్ని పునీతం కావించే ఎందరో ఋషులు తమ తమ శిష్య బృందంతో కలసి అచ్చట వేంచేసిరి. సాధారణముగా పుణ్య క్షేత్ర దర్శనం సాకుతో ఋషులు ఆయా స్థలాలను తమ సాన్నిధ్యంతో పవిత్రం చేస్తారు. అక్కడకు వచ్చిన వారిలో అత్రి, వశిష్ఠ, చ్యవన, శరద్వాన, అరిష్టనేమి, భృగు, అంగీర, పరాశర, విశ్వామిత్ర, పరశురామ, ఉతథ్య, ఇంద్రప్రమద, ఇద్మబాహు, మేధాతిథి, దేవల, ఆర్ష్టిషేణ, భారద్వాజ, గౌతమ, పిప్పలాద, మైత్రేయ, ఔర్వ, కవష, కుంభయోని (అగస్త్య) , ద్వైపాయన, మరియు నారద మహా ముని ఉండిరి. వారే కాకుండా అక్కడకు దేవ ఋషులు, బ్రాహ్మణ ఋషులు, రాజర్షులు మరియు వేదాలలోని ఒక విభాగమైన అరుణ వేద ప్రవచకులైన ఋషులు కూడా అక్కడకు వేంచేసిరి. (శ్రీమద్ భాగవతం 1.19.8-11)

అంతటి మహనీయ ఋషి పుంగవుల సముదాయములో ముగ్గురు అవతార పురుషులు పరశురామ, వ్యాస మరియు నారద కూడా ఉండటం జరిగింది. శుకదేవ గోస్వామి అక్కడకు వేంచేసినప్పుడు ఆయనను గౌరవిస్తూ వారందరూ లేచి నుంచోవడం జరిగింది (శ్రీమద్ భాగవతం 1.19.28). పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు ఆయనే సరైనవారని వారంతా ముక్త కంఠంతో ఏకీభవించారు. ఆయన ఆ గౌరవాన్ని అంగీకరించినప్పుడు, ఆయన గొప్పతనము ఈ విధముగా పేర్కొనబడింది.

“ఆ ఆసనం మీద ఆయనను గౌరవముగా కూర్చోపెట్టినప్పుడు, దేవ, సప్త, గంధర్వ ఋషి బృందం ఆయన చుట్టూ ఉండగా  మహనీయులలో మహనీయుడైన  శ్రీ శుకదేవుడు ఎంతో ప్రకాశవంతంగా అగుపిస్తూ తారలు, గ్రహాలు, రాశుల మధ్య పున్నమి చంద్రుని వలే అగుపించిరి” (శ్రీమద్ భాగవతం 1.19.30)

చివరకు భాగవతం యొక్క శ్రేష్ఠత్వం అది ఇచ్చే శ్రేష్ఠ సందేశంలో ఉంది:

పరమ ధర్మమనేది ఎటువంటి మోసం మరియు రాజీ లేకుండా ఈ శ్రీమద్ భాగవతం రూపములో బహిర్గతమైనది (శ్రీమద్ భాగవతం 1.2.2).

 

 

Notify me of new articles

Comments are closed.

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    గురు శిష్యుల అనుబంధము చాలా అద్వితీయమైనది. ఈ సంబధంలో అత్యంత గౌరవం మరియు సాన్నిహిత్యం ఉంటాయి. సాధారణంగా గౌరవం మరియు సాన్నిహిత్యం కలిసి ఉండవు.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.