ప్రశ్న : భక్తి మార్గమునకు మరియు జ్ఞాన మార్గమునకు మధ్య గల సంబంధమేది ?
జవాబు : జ్ఞాన యోగమనేది ఒక సాంకేతికమైన పదము. జ్ఞానమనే పదానికి అనేక అర్థాలు ఉండటం చేత దాని పట్ల అనేక అపార్థాలు ఉన్నాయి. దాని సాధారణ అర్థము విజ్ఞానం, ఆ విజ్ఞానం ఒక ప్రత్యేక విషయము గూర్చినది- బ్రహ్మత్వముతో ఏకత్వమును చూపేది. అందుచేత బ్రహ్మముతో ఐక్యమును పొందాలని కోరుకొనే మార్గమును జ్ఞాన యోగమందురు. అంటే దానర్థము శాస్త్రములను చదివే వారు జ్ఞాన యోగమును అనుసరిస్తున్నారని అర్థము కాదు. జ్ఞానమనేది ప్రతి ఒక్క మార్గం లో ఉంది – అది కర్మ యోగమైనా, భక్తి యోగమైనా లేక అష్టాంగ యోగమైనా కావచ్చు. మీరు అనుసరించే దాని గూర్చి మీకు జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది.
దేవదేవుడు మూడు రూపాలలో ప్రత్యక్షమవుతాడు. ఒకటి భగవంతుడు, ఇంకొకటి పరమాత్మ మరియు ఇంకొకటి బ్రహ్మము. తదనుగుణంగా మూడు రకాల సాధు పుంగవులు ఉన్నారు. భక్తిని అనుసరించే భక్తులు. వారి లక్ష్యం భగవంతుని తెలుసుకొనడం. అలానే అష్టాంగ యోగులు లేక రాజ యోగులు కూడా ఉన్నారు, వారి లక్ష్యము పరమాత్మను తెలుసుకొనడం. అలానే జ్ఞానయోగులు కూడా ఉన్నారు వారినే అద్వైత వాదులు అని అంటారు. వారి లక్ష్యము భగవంతుని అప్రాకృత స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకొనుట.
అందుచేత జ్ఞాన యోగమనేది అప్రాకృత బ్రహ్మమును తెలుసుకొనే లక్ష్యము గల ఒక మార్గము అందులో భగవానుని లేక పరమాత్మ గూర్చి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఆ మార్గములో వారుభగవానుని పూజించినా అది కేవలం బ్రహ్మమును తెలుసుకోవాలనే ఉత్సుకతో మాత్రమే. వారు భగవానుని పూజించడం వల్ల ఆయన కృపతో వారు బ్రహ్మముతో ఐక్యము చెందగలము అని అనుకుంటారు. అందుచేత వారి చిట్ట చివరి లక్ష్యం బ్రహ్మమును పొందుటయే. జ్ఞానయోగములో జ్ఞాన అనే పదం బ్రహ్మము, స్వీయం ఒకటే అన్న విషయాన్ని ఒక్కాణిస్తుంది.
ప్రశ్న : ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఒకరు దాని మీద ప్రేమ లేకుండా అనుసరించగలరా ?
జవాబు : అనుసరించవచ్చు, కానీ అలా అనుసరిస్తూ మార్గలక్ష్యమును పొందలేరు.
ప్రశ్న : అంటే ప్రేమ లేకుండా ఒక మార్గాన్ని మనం అనుసరించలేము. జ్ఞానులు కూడా అలా చేయలేరా?
జవాబు : అటువంటి అనుసరణ విజయాన్ని చేకూర్చలేదు. ప్రతి ఒక్కరూ ప్రేమ లేక భక్తి సహాయాన్ని తీసుకోవాల్సినదే. అందుచేత ప్రేమ మార్గాన్ని అనుసరించడమే ఉత్తమము.
ప్రశ్న : మనం అనుసరించే మార్గాన్ని మన స్వభావముతోనో లేక సంస్కారములతోనో లేక ఇతర కారణాలవల్లనో ఎన్నుకొంటామా?
జవాబు: అవును, మనం మన సంస్కారాల బట్టి మార్గాన్ని ఎంచుకొంటాము. అలానే సాధు పుంగవులును మీరు కలసినప్పుడు మీరు వారిచేత కూడా ప్రేరణ పొందగలరు. ఒక వేళ మీకు ఎటువంటి పూర్వ సంస్కారము లేనట్లయితే మీరు సాధువుల సాంగత్యం వల్ల ప్రేరణ పొందుతారు, ఒక వేళ పూర్వ సంస్కారం ఉన్నట్లయితే మీరు మీ సంస్కారమునకు అనుగుణముగా బోధించే వారి పట్ల మక్కువతో ఉంటారు.
ప్రశ్న : భగవంతునితో మీకు గల వ్యక్తిగత సంబంధాన్ని మీరు ఎలా పొందారు? దాన్ని మీరు ఎలా ఎన్నుకొన్నారు?
జవాబు : నా గురువుతో పరిచయం ఏర్పడింది. ఆయన ఒక సంబంధాన్ని అనుసరిస్తున్నారు అందుచేత ఆయన వల్ల నేను దాన్ని పొందాను. ఆయన దాన్ని నాకు నేర్పారు.
info@telugu.jiva.org for inquiries about Jiva Institute and guesthouse bookings
For website question please use our contact-form»
380 Sheetal Chaya
Raman Reti, Vrindavan
UP 281121, India
© 2017 JIVA.ORG. All rights reserved.